వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టు పరిమిత ఓవర్ల కొత్త కెప్టెన్‌లను గురువారం ప్రకటించింది. వన్డేలకు సారథిగా సీనియర్ ఆటగాడు షాయ్ హోప్ ఎంపికవ్వగా.. టీ20లకు విధ్వంసకర ఆల్‌రౌండర్ రోవ్‌మన్ పావెల్ నియమితుడయ్యాడు. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఘోర పరాభావానికి నైతిక బాధ్యత వహిస్తూ నికోలస్ పూరన్ విండీస్ వైట్ బాల్ కెప్టెన్సీకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే.
అతడి స్థానంలో వీరిద్దరూ బాధ్యతలు చేపట్టనున్నారు. మార్చి 16 నుంచి దక్షిణాఫ్రికాతో జరగున్న వన్డే, టీ20 సిరీస్‌లతో సారథిలగా వీళ్ల ప్రయాణం ప్రారంభం కానుంది. కాగా 2019 నుంచి విండీస్ వన్డే జట్టుకు హోప్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకు 104 వన్డే మ్యాచ్‌లు ఆడిన అతడు 48.08 సగటుతో 4308 పరుగులు చేశాడు.
అదే విధంగా రోవ్‌మన్ పావెల్ కూడా విండీస్ జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. టీ20ల్లో కెప్టెన్‌గా అతడికి అపారమైన అనుభవం ఉంది. గత ఏడాది కరేబియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను సొంతం చేసుకున్న జమైకా తల్లావాస్‌కు పావెల్ సారథిగా వ్యవహరించాడు.
అదే విధంగా అతడు కెప్టెన్‌గా జమైకా స్కార్పియన్స్‌కు యునైటెడ్ సూపర్50 కప్ టైటిల్‌ను కూడా అందించాడు. ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా విండీస్ రెండు టెస్టులు,మూడు వన్డేలు, మూడు టీ20 సిరీస్‌లో అతిథ్య జట్టుతో తలపడనుంది.
చదవండి: T20 WC: టీ20 ప్రపంచకప్‌లో స్పాట్ ఫిక్సింగ్ కలకలం.. బంగ్లా క్రికెటర్‌తో
🚨BREAKING NEWS🚨
— Windies Cricket (@windiescricket) February 15, 2023
CWI announces new captains for White-Ball formats.
Read More⬇️ https://t.co/Bmw7qILA9p pic.twitter.com/suNk7ndqKE
Comments
Please login to add a commentAdd a comment