నరైన్ బౌలింగ్లో పావెల్ బౌల్డ్ (PC: BCCI)
ఐపీఎల్ 2024.. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో చేసిన పరుగులు 276.. పడగొట్టిన వికెట్లు ఏడు(7/165).. కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్ ఆల్‌రౌండర్ సునిల్ నరైన్ నమోదు చేసిన గణాంకాలివి.
రాజస్తాన్ రాయల్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో 35 ఏళ్ల ఈ వెస్టిండీస్ ఆటగాడు కుర్రాళ్ల కళ్లు చెదిరే రీతిలో అద్బుతమైన షాట్లతో అలరించాడు. మొత్తంగా 56 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 109 పరుగులు చేశాడు.
ఓపెనర్‌గా ఇరగదీస్తున్నాడు
విధ్వంసకర శతకంతో విరుచుకుపడి తన ఆటలో పస తగ్గలేదని మరోసారి నిరూపించాడు. కేకేఆర్‌కు దొరికిన విలువైన ఆస్తి అంటూ నీరాజనాలు అందుకుంటున్నాడు ఈ లెఫ్టాండ్ బ్యాటర్.
𝐍𝐚𝐫𝐢𝐧𝐞, naam toh suna hi hoga 😉
— JioCinema (@JioCinema) April 16, 2024
He scores his maiden 💯 in T20s at the iconic Eden Gardens 🏟️#KKRvRR #TATAIPL #IPLonJioCinema #SunilNarine | @KKRiders pic.twitter.com/TKFSFsc3Lp
కేవలం పరుగుల తీయడానికే పరిమితం కాని ఈ రైటార్మ్ స్పిన్నర్.. రెండు వికెట్లు పడగొట్టాడు. అలాగే ఓ క్యాచ్ కూడా అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్ మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో పాటు క్యాచ్, వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు.
12 నెలలుగా ప్రయత్నిస్తూనే ఉన్నా
ఇక ఈ వెటరన్ ఆల్‌రౌండర్ ప్రతిభకు వెస్టిండీస్ కెప్టెన్, రాజస్తాన్ రాయల్స్ హిట్టర్ రోవ్‌మన్ పావెల్ కూడా ఫిదా అయ్యాడు. నరైన్‌ను ఎలాగైనా ఒప్పించి ఈసారి వరల్డ్‌కప్‌లో ఆడించే ప్రయత్నం చేస్తామంటున్నాడు.
కేకేఆర్‌పై రాజస్తాన్ విజయంలో తన వంతు పాత్ర పోషించిన పావెల్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘గత 12 నెలలుగా నేను నరైన్ చెవిలో జోరీగలా మొత్తుకుంటూనే ఉన్నాను. రిటైర్మెంట్ వెనక్కి తీసుకోమని అడుగుతున్నాను.
కానీ అతడు ఏదో దాస్తున్నాడు. ఎవరితోనూ తన మనసులోని భావాలు పంచుకోవడం లేదు. ఈ విషయం గురించి ఇప్పటికే కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్‌లతో చర్చించాను.ప్రపంచకప్ జట్టు ఎంపిక కంటే ముందే వీళ్లు అతడి మనసులో ఏముందో కనిపెట్టగలరనే అనుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు.
విండీస్‌లో ఈసారి వరల్డ్‌కప్
జూన్ 1 నుంచి వెస్టిండీస్- అమెరికా వేదికగా మొదలుకానున్న టీ20 ప్రపంచకప్-2024లో సునిల్ నరైన్ ఆడించడమే తన లక్ష్యమని రోవ్‌మన్ పావెల్ ఈ సందర్భంగా ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో చెప్పుకొచ్చాడు.
ఇక కేకేఆర్‌తో మ్యాచ్‌లో పావెల్ 13 బంతుల్లో 26 పరుగులు చేసి నరైన్ బౌలింగ్‌లో బౌల్డ్ కావడం విశేషం. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో 29 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న నరైన్.. మరో 20 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు.
2023లో రిటైర్ అయిన నరైన్
2012, 2014 టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో వెస్టిండీస్ తరఫున బరిలోకి దిగిన సునిల్ నరైన్.. 2019 నుంచి జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో.. 2023లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే ఫ్రాంఛైజీ క్రికెట్‌లో మాత్రం ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు.
చదవండి: #T20WorldCup2024: రోహిత్‌తో ద్రవిడ్, అగార్కర్ చర్చలు.. హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్!
Comments
Please login to add a commentAdd a comment