Powell: Series will be decided on how West Indies bat spin in middle overs - Sakshi
Sakshi News home page

చాలా సంతోషంగా ఉంది.. టీమిండియాను చూశాక తప్పుచేశా అనుకున్నా! కానీ: విండీస్‌ కెప్టెన్‌

Published Fri, Aug 4 2023 12:11 PM | Last Updated on Fri, Aug 4 2023 12:37 PM

Series will be decided on how West Indies bat spin in middle overs - Sakshi

టీమిండియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను వెస్టిండీస్‌ విజయంతో ఆరంభించింది. ట్రినిడాడ్‌ వేదికగా జరిగిన తొలి టీ20లో విండీస్‌ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షోతో కరేబియన్లు అదరగొట్టారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో విండీస్‌ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఈ విజయంపై మ్యాచ్‌ అనంతరం విండీస్‌ కెప్టెన్‌  రోవ్‌మన్ పావెల్ స్పందించాడు. తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందంటూ పావెల్‌ చెప్పుకొచ్చాడు.

మేము ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు చాలా కష్టపడ్డాం. ఏదైమనప్పటికీ విజయంతో సిరీస్‌ను ఆరంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్‌లో తొలుత భారత బౌలింగ్‌ ఎటాక్‌ చూశాక, మేము అదనంగా ఒక స్పిన్నర్‌ను తీసుకుని వుంటే బాగుండేది అన్పించింది. కానీ మా ఫాస్ట్ బౌలర్లు మరో స్పిన్నర్‌ అవసరం లేకుండా చేశారు.

మా విజయంలో బౌలర్లదే కీలక పాత్ర. ట్రినిడాడ్‌లో బ్యాటింగ్‌ చేయడం అంత సులభం కాదు.  ఈ మ్యాచ్‌లో పవర్‌ప్లేలో మాకు మంచి స్కోర్‌ వచ్చింది. కానీ మిడిల్‌ ఓవర్లలో పెద్దగా పరుగులు సాధించలేకపోయాము. మిడిల్‌ఓవర్లలో విండీస్‌ బ్యాటర్లు స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటారో అన్నదానిపై సిరీస్‌ ఫలితం ఆధారపడి ఉంటుంది.

ఇక హోల్డర్‌ కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడని పోస్ట్‌మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో పావెల్‌ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో 48 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక భారత్‌-విండీస్‌ మధ్య రెండో టీ20 ఆగస్టు 6న గయానా వేదికగా జరగనుంది.
చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో తొలి టీ20.. కన్నీరు పెట్టుకున్న హార్దిక్‌! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement