
photo credit: IPL Twitter
Mitchell Marsh: ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్ రౌండర్, ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మిచెల్ మార్ష్ ఇటీవలే తన లాంగ్ టర్మ్ పార్ట్‌నర్ గ్రెటా మాక్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆస్ట్రేలియాలోని గ్రేస్‌టౌన్‌లో అతి కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం నిరాడంభరంగా జరిగింది. వివాహ వేడుకలో మార్ష్ బ్లాక్ కలర్ సూట్‌లో మెరిసిపోగా.. మాక్, సంప్రదాయ తెల్లని గౌనులో తళుక్కుమంది. నూతన వధూవరులకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
కాగా, పెళ్లి నిమిత్తం మార్ష్ ఐపీఎల్-2023 మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌కు మార్ష్ అందుబాటులో లేడు. డీసీ ఆడబోయే మరో 3, 4 మ్యాచ్‌లకు మార్ష్ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. మార్ష్ గైర్హాజరీలో డీసీ రోవ్‌మన్ పావెల్‌ను తుది జట్టులోకి తీసుకుంది. అయితే ఆర్‌ఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను దారుణంగా నిరాశపరిచాడు. దీంతో మార్ష్ లేని లోటు డీసీ శిబిరంలో స్పష్టంగా కనిపించింది.
ఇదిలా ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్ తమ తదుపరి మ్యాచ్‌లో ఫైవ్ టైమ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఢీకొంటుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ ఏప్రిల్ 11న జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో తలపడబోయే ఇరు జట్లు ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు బోణీ కొట్టలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓటమిపాలు కాగా.. ముంబై ఇండియన్స్ ఆడిన 2 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది.
ఈ నేపథ్యంలో రేపు జరుగబోయే మ్యాచ్‌ను ఇరు జట్లు చాలా సీరియస్‌గా తీసుకోనున్నాయి. గెలుపు కోసం ఇరు జట్లు సర్వశక్తులు ఒడ్డనున్నాయి. దీంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment