
టీ20 ప్రపంచకప్-2022లో రెండు సార్లు చాంపియన్ వెస్టిండీస్ దారుణమైన ప్రదర్శన కనబరిచింది. ఈ మెగా ఈవెంట్ తొలి రౌండ్‌లోనే విండీస్ ఇంటిముఖం పట్టింది. ఐర్లాండ్, స్కాట్లాండ్ వంటి పసికూనలపై కూడా విండీస్ తమ ప్రతాపం చూపలేపోయంది. కాగాటీ20 ప్రపంచకప్‌లో తమ జట్టు ప్రదర్శనపై పూర్తిస్థాయి సమీక్ష జరుపుతామని ఇప్పటికే విండీస్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ రిక్కీ స్కెర్రిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో విండీస్ జట్టు హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ తన హెడ్ కోచ్ పదవికి మంగళవారం రాజీనామా చేశాడు. ప్రపంచకప్‌లో తమ జట్టు ప్రదర్శన చాలా నిరాశపరిచింది అని అతడు తెలిపాడు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సిమన్స్ పేర్కొన్నాడు. మరోవైపు విండీస్ వైట్‌బాల్ కెప్టెన్ నికోలస్ పూరన్ కూడా తన బాధ్యతలు నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
కాగా పూరన్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక కరీబియన్ జట్టు ద్వై పాక్షిక సిరీస్‌లలో కూడా ఘోర పరాజయాలను చవిచూసింది. అదే విధంగా కెప్టెన్సీ పరంగానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనలో కూడా పూరన్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో పూరన్ స్థానంలో వైస్ కెప్టెన్‌గా ఉన్న రావ్‌మన్ పావెల్‌కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పాలని విండీస్ క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ ఏడాది కిరాన్ పొలార్డ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడంతో పూరన్ విండీస్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టాడు.
చదవండి: T20 World Cup 2022: ప్రపంచకప్‌లో దారుణ ప్రదర్శన.. వెస్టిండీస్ హెడ్ కోచ్ రాజీనామా