ఐసీసీ వరల్డ్‌కప్ లీగ్-2 (2023-27)లో విండ్‌హోక్ వేదికగా యూఏఈతో జరుగుతున్న మ్యాచ్‌లో అమెరికా జట్టు అదరగొట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూఎస్ఎ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 339 పరుగుల భారీ స్కోర్ సాధించింది. యూఎస్ఎ బ్యాటర్లలో భారత సంతతికి చెందిన మిలింద్ కుమార్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.
ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మిలింద్ యూఏఈ బౌలర్లను ఊతికారేశాడు. 110 బంతులు ఎదుర్కొన్న కుమార్.. 16 ఫోర్లు, 5 సిక్స్‌లతో 155 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు భారత సంత ముక్కముల్లా సాయితేజ(107) సైతం సెంచరీతో మెరిశాడు. అయితే యూఏఈ బౌలర్లను ఊచకోత కోసిన మిలింద్ కుమార్ క్రికెట్ జర్నీపై ఓ లుక్కేద్దం.
ఎవరీ మిలింద్ కుమార్?
33 ఏళ్ల మిలింద్ కుమార్ 1991లో ఢిల్లీలో జన్మించాడు. అతడు ఫస్ట్ క్రికెట్‌లో ఢిల్లీ, సిక్కిం, త్రిపురలకు ప్రాతినిధ్యం వహించాడు. 2011లో ఢిల్లీ తరపున ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేసిన మిలింద్.. ఆ తర్వాత సిక్కిం, త్రిపురలకు ఆడాడు. 2018-19 రంజీ ట్రోఫీలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఆ సీజన్‌లో సిక్కిం తరపున ఆడిన కుమార్ ఏకంగా 1331 పరుగులు చేశాడు. అదేవిధంగా ఐపీఎల్‌లో కూడా మిలింద్ భాగమయ్యాడు. 2014లో ఢిల్లీ డేర్‌డెవిల్స్(ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్), 2019లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల తరపున అతడు ఆడాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లితో డ్రెస్సింగ్ రూమ్‌ను మిలింద్ పంచుకున్నాడు. ఇద్దరూ కలిసి ఒకట్రెండు మ్యాచ్‌ల్లో కూడా ఆడారు. అయితే 2021లో పూర్తిగా బీసీసీఐతో సంబంధాలు తెంచుకున్న యూఎస్ఎకు మకాం మార్చాడు. మిలింద్ ఏప్రిల్ 2024లో కెనడాపై అమెరికా తరపున అరంగేట్రం చేశాడు. టీ20 వరల్డ్ కప్ 2024లో కూడా యూఎస్ఎ జట్టులో సభ్యునిగా ఉన్నాడు.
చదవండి: Ind vs Ban: అశ్విన్ ఇంకో నాలుగు వికెట్లు తీశాడంటే..
Comments
Please login to add a commentAdd a comment