టెస్టు క్రికెట్‌కు ఆదరణను మరింత పెంచే దిశగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అడుగులు వేస్తోంది. సంప్రదాయ ఫార్మాట్‌ను రెండు శ్రేణుల్లో( 2- Tier Test cricket) నిర్వహించాలని ఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది.
ఈ క్రమంలోనే అగ్ర శ్రేణి జట్లైనా భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మరిన్ని ఎక్కువ సిరీస్‌లను నిర్హహించాలని ఐసీసీ యోచిస్తోంది. ఇదే విషయంపై ఐసీసీ ఛైర్మన్ జై షా, బీసీసీఐ ప్రతినిధులు, క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు, ఈసీబీ చీఫ్ ఈ నెలాఖరులో సమావేశం కానున్నారని పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
విండీస్ గ్రేట్ ఫైర్..
కాగా టెస్టుల్లో ఈ రెండంచెల విధానం ప్రతిపాదనపై వెస్టిండీస్ గ్రేట్ క్లైవ్ లాయిడ్ మండిపడ్డాడు. "ఐసీసీ నిజంగా టెస్టుల్లో 2 టైర్ విధానాన్ని తీసుకురావాలని ఆలోచిస్తుంటే, అది కచ్చితంగా భయంకరమైన నిర్ణయమవుతోంది. టెస్టు క్రికెట్ హోదా పొందేందుకు కష్టపడుతున్న చిన్న జట్ల పట్ల శాపంగా మారనుంది. ఇకపై లోయర్ డివిజన్‌లో మిగతా జట్లు వాళ్లతో వాళ్లే ఆడుకుంటారు.
దీంతో టెస్టు క్రికెట్‌కు ఆదరణ పెరగడం కాదు మరింత తగ్గుతోంది. చిన్న జట్లను అగ్ర జట్లతో ఎక్కువగా ఆడేలా చేయడంపై ఐసీసీ దృష్టి సారించాలి. అంతే తప్ప ఎటువంటి చెత్త నిర్ణయాలు తీసుకోకూడదు అని 80 ఏళ్ల క్లైవ్ లాయిడ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
వెస్టిండీస్ జట్టును రద్దు చేసి విడివిడిగా ఆడాలన్న ఐసీసీ మాజీ ఛైర్మన్ గ్రెగ్ బార్‌క్లే సూచనపై కూడా లాయిడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. " వరల్డ్ క్రికెట్‌లో వెస్టిండీస్ జట్టుకు గొప్ప చరిత్ర ఉంది. అలాంటి జట్టును విడదీయాలని మాట్లాడుతున్నారు. అది సరైన పద్దతి కాదు. వెస్టిండీస్‌తో సహా ఇన్ని జట్లకు సమంగా డబ్బులిస్తే సౌకర్యాలను మెరుగుపరుచుకుంటారు. వారు తమ క్రికెట్‌ను మరింత మెరుగుపరచుకునేందుదు మెరుగైన వ్యవస్థలు ఏర్పాటు చేసుకుంటారు అని లాయిడ్ వ్యాఖ్యనించారు.
చదవండి: 'రాహుల్ కోసం అతడిని పక్కన పెట్టేశారు.. ఒక్క ఛాన్స్ ఇవ్వాల్సింది'
Comments
Please login to add a commentAdd a comment