jaisha
-
జై షా వారసుడెవరో!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ పదవి రేసులో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా ఒక్కడి పేరే బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తదుపరి భారత బోర్డులో ఆయన వారసుడు ఎవరనే చర్చ అప్పుడే మొదలైంది. ఐసీసీలో మొత్తం 16 మంది సభ్యుల్లో 15 మంది జై షాకు అనుకూలంగా ఉండటంతో చైర్మన్ పదవి ఏకగ్రీవంతో దక్కనుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే బీసీసీఐలో రెండోసారి కార్యదర్శిగా కొనసాగుతున్న ఆయన పదవీకాలం మరో ఏడాది మిగిలుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐలో జై షా వారసుడెవరనే చర్చలో ప్రముఖంగా సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, సంయుక్త కార్యదర్శి ఆశిష్ షెలార్, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ ముగ్గురిలో కీలకమైన కార్యదర్శి పదవి ఎవరిని వరిస్తుందో చూడాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు. ఎందుకంటే ప్రస్తుత ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే పదవీకాలం నవంబర్ 30 వరకు ఉంది. కొత్త చైర్మన్ ఎన్నిక కోసం ఈ నెల 27తో నామినేషన్ల గడువు ముగుస్తుంది. ఎన్నికైన వ్యక్తి డిసెంబర్ 1 తర్వాతే పదవీ బాధ్యతలు చేపడతారు. దీంతో ఇంకో మూడు నెలల వరకు జై షా బీసీసీఐ పదవిని అట్టిపెట్టుకునే అవకాశముంది. -
‘సీనియర్లు కొనసాగుతారు’
బ్రిడ్జ్‌టౌన్: అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించినా... ఐసీసీ వన్డే టోర్నీ చాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్టు చాంపియన్íÙప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అందుబాటులో ఉంటారని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. టి20 ఫార్మాట్‌కు సంబంధించి భారత జట్టులో మార్పు మొదలైందన్న ఆయన... పాండ్యాను కెపె్టన్‌గా నియమించే విషయం సెలక్టర్లు చూసుకుంటారని వ్యాఖ్యానించారు. 2025లో చాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్నాయి. ‘ముగ్గురు కీలక ఆటగాళ్ల రిటైర్మెంట్ తర్వాత టి20 జట్టులో ఇప్పటికే మార్పులు మొదలయ్యాయి. అయితే ప్రస్తుతం సీనియర్లతో కూడిన మన జట్టు ప్రదర్శన చూస్తే మా తర్వాతి లక్ష్యం చాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా గెలవడమే. దాదాపు ఇదే జట్టు అక్కడా ఆడుతుంది. సీనియర్లంతా అందుబాటులో ఉంటారు. భారత జట్టు అన్ని ఐసీసీ టైటిల్స్ గెలవాలనే నేనూ కోరుకుంటా. మన దగ్గర ప్రతిభావంతులైన రిజర్వ్ ఆటగాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అవసరమైతే ఒకేసారి మనం 3 జట్లను బరిలోకి దించగలం’ అని జై షా అభిప్రాయపడ్డారు. తాజా వరల్డ్ కప్‌లో కీలక ప్రదర్శన చేసిన పాండ్యాపై షా ప్రశంసలు కురిపించారు. ‘పాండ్యా ఫామ్ గురించి గతంలో ఎన్నో రకాల సందేహాలు వ్యక్తం చేశారు. కానీ సెలక్టర్లు అతనిపై నమ్మకం ఉంచి ఎంపిక చేస్తే దానిని పాండ్యా నిలబెట్టుకున్నాడు. అయితే టి20 టీమ్‌కు పూర్తి స్థాయి కెపె్టన్‌గా నియమించే అధికా రం సెలక్టర్ల చేతుల్లోనే ఉంది’ అని షా చెప్పారు. టీమిండియా మరింత ఆలస్యంగా...బ్రిడ్జ్‌టౌన్ (బార్బడోస్): వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత టి20 జట్టు స్వదేశానికి రావడం మరింత ఆలస్యం కానుంది. బార్బడోస్ దేశాన్ని తాకిన పెను తుఫాన్‌తో ఆటగాళ్లు ఎక్కడికీ వెళ్లే పరిస్థితి లేదు. తీవ్రత ఎక్కువగా ఉండే కేటగిరీ 4 హరికేన్ వల్ల రెండు రోజులుగా దేశం మొత్తం లాక్డౌన్లో ఉంది. ముఖ్యంగా స్థానిక ఎయిర్‌పోర్ట్‌ను పూర్తిగా మూసేశారు. దాంతో భారత జట్టు ప్రత్యేక విమానం ద్వారా అక్కడి నుంచి బయల్దేరే అవకాశాలు కూడా లేకుండా పోయాయి. విద్యుత్, నీటి సరఫరా కూడా అస్తవ్యస్తంగా మారింది. ఎలాగైనా ఇక్కడి నుంచి ఆటగాళ్లను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ చార్టర్డ్ ఫ్లయిట్ కంపెనీలతో మాట్లాడే ప్రయత్నం చేశామని... అయితే ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలు సాధ్యం కావడం లేదని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడే వరకు వేచి ఉండటం మినహా మరో మార్గం లేదన్ని జై షా... భారత్‌కు చేరుకున్న తర్వాతే ఆటగాళ్ల సన్మానం తదితర విషయాల గురించి ఆలోచిస్తామని అన్నారు. -
అమితాబ్‌కు ‘గోల్డెన్ టికెట్’
భారత్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్‌నకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన ‘గోల్డెన్ టికెట్’ను నట దిగ్గజం అమితాబ్ బచ్చన్‌కు బీసీసీఐ కార్యదర్శి జై షా అందజేశారు. ఈ టికెట్ ద్వారా ప్రత్యేక అతిథి హోదాలో అన్ని వేదికల్లో అన్ని మ్యాచ్‌లనూ చూసే అవకాశం ఉంటుంది. మహానటుడే కాకుండా క్రికెట్ వీరాభిమాని అయిన అమితాబ్‌కు ‘గోల్డెన్ టికెట్’ ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు, ఎప్పటిలాగే టీమిండియాకు ఆయన మద్దతు కొనసాగాలని జై షా వ్యాఖ్యానించారు. -
ఫైనాన్స్ కమిటీ చైర్మన్‌గా జై షా
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) లో ఎంతో ప్రాధాన్యత ఉన్న, బలమైన ఫైనాన్స్ అండ్ కమర్షియల్ అఫైర్స్ కమిటీకి చైర్మన్‌గా బీసీసీఐ కార్యదర్శి జై షా ఎంపికయ్యారు. అయితే ప్రస్తుతానికి జై షా ఎఫ్ అండ్ సీఏలో సభ్యుడిగా మాత్రమే ఉంటారు. మార్చి 2023 నుంచి రాస్ మెకల్లమ్ స్థానంలో ఆయన చైర్మన్‌గా బాధ్యతలు చేపడతారు. ఐసీసీ చైర్మన్‌గా న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్క్లే మరో రెండేళ్లపాటు చైర్మన్‌గా కొనసాగుతారు. -
బీసీసీఐ ఎన్నికలు: ముహూర్తం ఖరారు
ముంబై: ప్రపంచ క్రికెట్లో అత్యంత ధనిక బోర్డులో ఎన్నికలకు నగారా మోగింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లోని పదవుల కోసం అక్టోబర్ 18న ఎన్నికలు జరపనున్నట్లు బోర్డు ఎన్నికల అధికారి ప్రకటించారు. అదే రోజు బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) కూడా నిర్వహిస్తారు. భారత ఎలక్షన్ కమిషన్ మాజీ చీఫ్ కమిషనర్ ఏకే జోటి దీనికి ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు. నోటిఫికేషన్ జారీ చేసిన ఆయన ఈ వివరాలను ఇప్పటికే బీసీసీఐ పరిధిలోని రాష్ట్ర క్రికెట్ సంఘాలకు అందించారు. వీరంతా తమ సంఘం తరఫు నుంచి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల వివరాలను బోర్డుకు పంపించాలని ఆయన కోరారు. గతంలో ఎన్నికల ప్రక్రియలో వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం అమలులో ఉన్న అన్ని నిబంధనల ప్రకారం అర్హత ఉన్నవారే బరిలోకి దిగాలని కూడా ఎన్నికల అధికారి ప్రత్యేకంగా సూచించారు. బోర్డు నియమావళి ప్రకారం ఐదు కీలకమైన ఆఫీస్ బేరర్ పదవులకు (అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి) ఎన్నికలు జరుగుతాయి. దీంతో పాటు ఒక అపెక్స్ కౌన్సిల్ సభ్యుడిని, ఇద్దరు గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులను కూడా ఎన్నుకుంటారు. అక్టోబర్ 11, 12 తేదీల్లో దరఖాస్తులు స్వీకరించనుండగా... 18న ఎన్నికలు జరిపి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఇప్పటికే బీసీసీఐ ఎన్నికల ప్రక్రియ ముగియాల్సి ఉన్నా... వివిధ అంశాలపై సుప్రీం కోర్టు నుంచి స్పష్టత కోరుతూ బోర్డు ఇప్పటి వరకు ఆగింది. ఇటీవల సుప్రీం కోర్టులో దీనికి సంబంధించి కీలక ఆదేశాలు రావడంతో మార్గం సుగమమైంది. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులుగా ఉన్న సౌరవ్ గంగూలీ, జై షా అదే పదవుల కోసం బరిలో ఉంటారా... లేక వీరిలో ఒకరు ఐసీసీ వైపు వెళ్లి కొత్తవారు ఆ పదవిలో వస్తారా వేచి చూడాలి. -
మిల్కా సింగ్ మృతి కి నివాళి అర్పించిన బీసీసీఐ
ముంబై: లెజండరీ అథ్లెట్.. ద ఫ్లయింగ్ సిక్కుగా ఖ్యాతి గాంచిన మిల్కా సింగ్ మృతి పట్ల బీసీసీఐ నివాళి అర్పించింది. మిల్కా సింగ్ మృతి తీవ్ర విషాదాన్ని మిగిల్చినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ట్వీట్ చేశారు. భారత్‌కు చెందిన అతిగొప్ప క్రీడాకారుడు మిల్కా సింగ్ అని, భారతీయ యువత అథ్లెటిక్స్ వైపు మళ్లేందుకు మిల్కా సింగ్ ఆదర్శంగా నిలిచారని, అతనితో దగ్గర పరిచయం ఉన్నట్లు సౌరవ్ గంగూలీ తెలిపారు. బీసీసీఐ కార్యదర్శి జే షా కూడా నివాళి అర్పించారు. మిల్కాసింగ్ మృతి విషాదాన్ని మిగిల్చిందని, తరతరాలు ఎంతో మంది క్రీడాకారులకు మిల్కా ప్రేరణగా నిలిచారని, అసాధ్యం అంటూ ఏదీ లేదని ఆయన నిరూపించారని, మిల్కా మృతి పట్ల నివాళి అర్పిస్తున్నట్లు జే షా చెప్పారు. ఏషియా క్రీడల్లో స్ప్రింట్ విభాగంలో మిల్కాసింగ్ నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించాడు. సురేష్ రైనా, అనిల్‌కుంబ్లే, జస్ప్రీత్ బుమ్రా, వెంకటేశ్ ప్రసాద్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ఇండియన్ క్రికెట్ టీమ్ కోచ్ రవిశాస్త్రి మిల్కాసింగ్ మృతి పట్ల నివాళి అర్పించారు. చదవండి: ఊరించి... ఉసూరుమనిపించి... -
అమిత్‌షా తనయుడి అవినీతికి సమాధానం చెప్పండి
సాక్షి, అమరావతి: తనపైనా, తన కుమారుడిపైనా అవినీతి ఆరోపణలు చేసే ముందు అమిత్‌షా కుమారుడి అవినీతిపై బీజేపీ నేతలు సమాధానం చెప్పాల్సి ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఆదివారం టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులతో టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అమిత్‌షా కుమారుడి అవినీతి వ్యవహారాలను చంద్రబాబు ప్రస్తావించినట్లు తెలిసింది. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తనపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేసిన విషయాన్ని చంద్రబాబు ఉటంకిస్తూ.. అమిత్‌షా, ఆయన కుమారుడు జైషా అవినీతిని ప్రశ్నించి బీజేపీపై ఎదురుదాడి చేయాలని టీడీపీ నేతలకు సూచించారు. బీజేపీ నేతలు తమ అవినీతి చరిత్రను చదువుకోవాలని, నీతులు వల్లిస్తున్న బీజేపీ నేతలు రాజ్యసభ ఎన్నికల్లో ఎందుకు కుయుక్తులు పన్నారని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో బలం లేకపోయినా రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టడం దేశమంతా చూసిందన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిందని ఆరోపించారు. అమిత్‌షా లేఖకు అసెంబ్లీలోనే సమాధానం ఇచ్చానని, నాలుగేళ్లయ్యాక ఇప్పుడు స్పెషల్ పర్పస్ వెహికల్ అంటున్నారని విమర్శించారు. యూసీలు ఇవ్వలేదు కాబట్టే నిధులు ఆపామని చెప్పడం సరికాదన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులన్నింటికీ యూసీలు ఇచ్చామన్నారు. ఆర్థిక లోటు విషయంలో యూసీలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. యూసీలు ఇవ్వడంలో దేశంలోనే ఏపీ 3వ స్థానంలో ఉందన్నారు. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తే రాష్ట్రానికి మద్దతునివ్వడమేనని, టీడీపీని బలహీనపరిస్తే రాష్ట్రాన్ని బలహీనపరచడమేననే విషయం ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. ఆంధ్రపక్షమా? కేంద్రపక్షమా? ఆయా పార్టీల నేతలు తేల్చుకోవాలన్నారు. ప్రజల కోసం పోరాడే ముఖ్యమంత్రి పక్షాన ఉంటారా..? రాష్ట్రానికి అన్యాయం చేసే కేంద్రం పక్షాన ఉంటారా..? అని వివిధ పార్టీల నేతలను ప్రశ్నించారు. -
‘షా–జాదా’ గురించి మాట్లాడను: రాహుల్
న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కొడుకు జయ్ గురించి తాను మాట్లాడనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. ‘షా–జాదా(జయ్ షాను ఉద్దేశించి) గురించి నేను, నా మిత్రులు మాట్లాడరు’ అని ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. ‘ది వైర్’ పై జయ్ షా దాఖలుచేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి అలహాబాద్ కోర్టు జారీచేసిన తాత్కాలిక నిషేధ ఉత్తర్వులను ఈ ట్వీట్లో ప్రస్తావించారు. జయ్ షా కంపెనీకి సంబంధించి కథనాలు ప్రచురించొద్దని ఆ వెబ్‌సైట్‌ను కోర్టు ఆదేశించిన నేపథ్యంలో రాహుల్ ట్వీట్ చేశారు. -
సున్నాతో ముగించారు
బీజింగ్ లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో భారత్ పతకాల వేట ముగిసింది. పతకం మీద ఆశలు రేపిన వికాస్ గౌడ శనివారం నిరశపరచగా.. ఆదివారం మారథాన్ లో భారత అథ్లెట్లు నేషనల్ రికార్డుతో సరిపెట్టుకున్నారు. ఓపీ జైషా 2:34:43 టైమింగ్ తో నేషనల్ రికార్డు నెలకొల్పింది. మరో రన్నర్ సుధాసింగ్ 2:35:35తో వ్యక్తిగత రికార్డు మెరుగుపరుచుకుంది. దీంతో భారత్ పతకాల జాబితాలో చిట్ట చివరి స్థానంతో సరిపెట్టుకుంది. ఇక లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించే ఇధియోపియా నుంచి మారే డిబాబా మారథాన్ స్వర్ణం గెలుచుకోగా.. కెన్యా రన్నర్ హెలత్ రెండో స్థానంలో నిలిచింది.