NCC Cadets, Face Down In Puddle Amid Rain, Thrashed By Senior - Sakshi
Sakshi News home page

Viral Video: చెప్పినట్టు వినలేదని ఎన్‌సీసీ జూనియర్లపై సీనియర్ దురాగతం.. వర్షపు నీటిలో తల పెట్టించి

Published Fri, Aug 4 2023 11:36 AM | Last Updated on Fri, Aug 4 2023 1:13 PM

NCC Cadets Face Down In Puddle Amid Rain By Senior - Sakshi

ముంబై: ముంబైకి సమీపంలోని థానేకు చెందిన ఓ కాలేజీలో ఓ సీనియర్ ఎన్‌సీసీ విద్యార్థి జూనియర్ క్యాడెట్లను కర్రతో చితక బాదుతోన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. జూనియర్లను  అమానుషంగా కొడుతున్న ఈ వీడియోను చూసి అనేక మంది నెటిజన్లు సీరియస్ అవుతూ ఆ సీనియర్ విద్యార్థిపైనా, కాలేజీ యాజమాన్యంపైనా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసున్నారు.    

ముంబైకు సమీపంలోని థానే బందొర్కర్ కాలేజీలో జోరువానలో ఓ సీనియర్ ఎన్‌సీసీ క్యాడెట్ అతను  చెప్పిన టాస్క్ చేయలేదన్న నెపంతో ఎనిమిది మంది జూనియర్ క్యాడెట్లను వరుసగా తల బురదనీటిలో ఆనించి వీపు భాగాన్ని పైకి లేపమని కర్రతో విచక్షణారహితంగా కొట్టాడు. ఈ దృశ్యాలను అక్కడి వారెవరో వీడియో తీసి వైరల్ చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.       

ఎన్‌సీసీ క్యాడెట్లు అంటేనే క్రమశిక్షణకు మారు పేరు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో క్రమశిక్షణతో కూడిన నడవడికతోపాటు సేవాతత్వాన్ని అలవాటు చేసే విశేష కార్యక్రమం ఎన్‌సీసీ. అనేక మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ మిగతా వారికి మార్గదర్శకంగా నిలుస్తూ ఉంటారు. అలాంటిది తమ కాలేజీలోని ఎన్‌సీసీ క్యాడెట్లు ఇంతటి దుశ్చర్యకు పాల్పడటంతో ఆ కాలేజీ ప్రిన్సిపాల్ సుచిత్రా నాయక్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

ఆ సీనియర్ విద్యార్థి కూడా ఎన్‌సీసీ క్యాండిడేటే కాబట్టి అతనిపై తప్పక చర్య తీసుకుంటాము. మా కాలేజీలో 40 ఏళ్లుగా ఎన్‌సీసీ ట్రైనింగ్ నిర్వహిస్తున్నాము. కానీ ఎన్నడూ ఇలాంటి సంఘటన జరగలేదన్నారు. శిక్షకుడు లేని సమయంలో ఆ సంఘటన జరిగిందని మానసిక ఆరోగ్యం సరిగ్గా లేనివారే అలా ప్రవర్తిస్తుంటారని ఆమె అన్నారు.    

ఇది కూడా చదవండి: సీఎం ‘కుర్చీ’లో అజిత్ పవార్..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement