ncc camp
-
Viral Video: చెప్పినట్టు వినలేదని ఎన్సీసీ జూనియర్లపై సీనియర్ దురాగతం..
ముంబై: ముంబైకి సమీపంలోని థానేకు చెందిన ఓ కాలేజీలో ఓ సీనియర్ ఎన్సీసీ విద్యార్థి జూనియర్ క్యాడెట్లను కర్రతో చితక బాదుతోన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. జూనియర్లను అమానుషంగా కొడుతున్న ఈ వీడియోను చూసి అనేక మంది నెటిజన్లు సీరియస్ అవుతూ ఆ సీనియర్ విద్యార్థిపైనా, కాలేజీ యాజమాన్యంపైనా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసున్నారు. ముంబైకు సమీపంలోని థానే బందొర్కర్ కాలేజీలో జోరువానలో ఓ సీనియర్ ఎన్సీసీ క్యాడెట్ అతను చెప్పిన టాస్క్ చేయలేదన్న నెపంతో ఎనిమిది మంది జూనియర్ క్యాడెట్లను వరుసగా తల బురదనీటిలో ఆనించి వీపు భాగాన్ని పైకి లేపమని కర్రతో విచక్షణారహితంగా కొట్టాడు. ఈ దృశ్యాలను అక్కడి వారెవరో వీడియో తీసి వైరల్ చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎన్సీసీ క్యాడెట్లు అంటేనే క్రమశిక్షణకు మారు పేరు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో క్రమశిక్షణతో కూడిన నడవడికతోపాటు సేవాతత్వాన్ని అలవాటు చేసే విశేష కార్యక్రమం ఎన్సీసీ. అనేక మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ మిగతా వారికి మార్గదర్శకంగా నిలుస్తూ ఉంటారు. అలాంటిది తమ కాలేజీలోని ఎన్సీసీ క్యాడెట్లు ఇంతటి దుశ్చర్యకు పాల్పడటంతో ఆ కాలేజీ ప్రిన్సిపాల్ సుచిత్రా నాయక్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆ సీనియర్ విద్యార్థి కూడా ఎన్సీసీ క్యాండిడేటే కాబట్టి అతనిపై తప్పక చర్య తీసుకుంటాము. మా కాలేజీలో 40 ఏళ్లుగా ఎన్సీసీ ట్రైనింగ్ నిర్వహిస్తున్నాము. కానీ ఎన్నడూ ఇలాంటి సంఘటన జరగలేదన్నారు. శిక్షకుడు లేని సమయంలో ఆ సంఘటన జరిగిందని మానసిక ఆరోగ్యం సరిగ్గా లేనివారే అలా ప్రవర్తిస్తుంటారని ఆమె అన్నారు. ఇది కూడా చదవండి: సీఎం ‘కుర్చీ’లో అజిత్ పవార్.. -
డ్రిల్‌తో పాటు ఫైరింగ్ కూడా ముఖ్యమే..
విద్యారణ్యపురి: రిపబ్లిక్ పరేడ్ క్యాంపులో పాల్గొనాలంటే ఎన్సీసీ కేడెట్లకు డ్రిల్‌తో పాటు ఫైరింగ్ ప్రతిభ కూడా ముఖ్యమేనని శిక్షణ క్యాంపు కమాండెంట్ కల్నల్ వీరబదిరియన్ అన్నారు. ఎన్సీసీ పదో తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో హన్మకొండలో కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంపులో భాగంగా మంగళవారం మూడో రోజు ఫైరింగ్, ఆర్డిసీ సెలక్షన్స్, పీల్డ్ క్రాఫ్ట్, బ్యాటిల్ క్రాఫ్ట్‌లో వీరబదిరియన్ పర్యవేణలో శిక్షన సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రిల్ విభాగంలో కూడా సీనియర్, జూనియర్ విభాగాలకు చెందిన బాలురు, బాలికలను కూడా ప్రాధమికంగా ఎంపిక చేశామన్నారు. ఎన్సీసీ అనేది క్రమశిక్షణకు మారుపేరన్నారు. క్రమశిక్షణతో ఉన్న కేడెట్లు అన్నిరంగాల్లో ముందుంటారని, విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను ఏర్పర్చుకుని రాణించాలన్నారు. మేజర్ రీనా గోస్వామి, ఏరో పరేడ్ లెఫ్టినెంట్ సతీష్‌కుమార్, ఎం.సదానందం, చీఫ్ ఆఫీసర్ కె.ప్రకాశం, ఎన్సీసీ అధికారులు మహేష్, రాధాకృష్ణ, భగవతి, అనూష, విష్ణువర్ధన్‌రెడ్డి, ప్రభాకర్, బీహెచ్ఎం థాఫ్సె, మణికందనం, కుదే, ప్రదీప్, పాటిల్, జయరాంబడక్, గణేష్, కుమారస్వామి, కవిత, పుత్లీబాయి. సుధామణి, అశోక్, సురేందర్ పాల్గొన్నారు. -
పెళ్లి చేసుకున్నాడు.. వద్దంటున్నాడు..
నెక్కొండ: మామునూరు ఎన్సీసీ క్యాంపులో ఐదు సంవత్సరాల క్రితం మొదలైన ప్రేమ..పెళ్లి వరకు దారితీసింది. పెళ్లయిన అనంతరం దళిత మహిళవంటూ ఓ ప్రబుద్ధుడు ఆమెను వదిలించుకోవాలని ప్రయత్నించాడు. దీంతో బాధితురాలు భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండలంలోని ముచ్చర్ల నాగారానికి చెందిన మేకల సంగీత, రూరల్ జిల్లా నెక్కొండ మండలంలోని గుండ్రపల్లి గ్రామానికి చెందిన బైరు భూపతి ప్రకాష్ 2013 సంవత్సరంలో మామునూరు ఎన్సీసీ క్యాంపునకు హాజరయ్యారు. అక్కడ వీరి పరిచయం ప్రేమగా మారింది. సంగీత మాదిగ, ప్రకాష్ మున్నూరు కాపు కులానికి చెందినవాడు. దీంతో పెళ్లిని ప్రకాష్ తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఈ క్రమంలో జనగామ జిల్లా చిల్పూరుగుట్టపై 25 నవంబర్ 2017న వారు పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం ప్రకాష్ కొద్ది రోజులు సంగీత ఇంటి వద్ద ఉన్నాడు. అనంతరం ప్రకాష్ ఇంటికి వెళ్లి తండ్రిదండ్రులను ఒప్పిస్తానని తిరిగి నెక్కొండ మండలంలోని గుండ్రపల్లికి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో సంగీతతోపాటు కుటుంబసభ్యులు ప్రకాష్‌కు పలుమార్లు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్‌లో పెట్టుకున్నాడు. తీరా గుండ్రపల్లికి సంగీత కుటుంబ సభ్యులు వచ్చి సంగీతను ఎప్పుడు తీసుకువెళ్తావని అడిగారు. సంగీత మాదిగ కులానికి చెందినందున తల్లిదండ్రులు వద్దంటున్నారని ప్రకాష్ చెప్పాడు. వెంటనే సంగీత, కుటుంబ సభ్యులు హన్మకొండ సుబేదారిలోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు భూపతి ప్రకాష్‌ను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. తన భార్యను వెంట తీసుకపోతానని నమ్మబలికి, కేసు ఉపసంహరించుకోవాలని సంగీతకు సూచించాడు. సంగీత కేసును ఉపసంహరించుకున్న అనంతరం మళ్లీ ఫోన్ ఎత్తకుండా, సమాధానమివ్వకుండా ప్రకాష్ తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో మంగళవారం సంగీత తన కుటుంబ సభ్యులతోపాటు ఎస్సీ మహిళా నాయకులతో కలిసి మండలంలోని గుండ్రపల్లిలో భూపతి ప్రకాష్ ఇంటి ఎదుట బైఠాయించింది. విషయాన్ని తెలుసుకున్న నెక్కొండ సీఐ వెంకటేశ్వర్రావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తనను పెళ్లి చేసుకుని ఇప్పుడు దళిత మహిళవంటూ ప్రకాష్ నిరాకరిస్తున్నాడని సంగీత కన్నీటి పర్యంతమైంది. స్పందించిన సీఐ వెంకటేశ్వర్రావు సంగీతకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చా రు. రాత్రి 7 గంటల వరకు సైతం ప్రకాష్ ఇంటి ఎదుటనే ఆమె బైఠాయించింది. -
21 నుంచి పెద్దాపురంలో ఎన్సీసీ శిబిరం
పెద్దాపురం : దేశ సమైక్యతను చాటే విధంగా పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయలో జాతీయస్థాయి ఎన్సీసీ ప్రత్యేక శిక్షణ శిబిరం (స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపు–2016) నిర్వహిస్తున్నట్టు ఎన్ఎస్ఎస్ కాకినాడ గ్రూపు కమాండర్ కల్నల్ ఎల్సీఎస్ నాయుడు తెలిపారు. విద్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 21 నుంచి 12 రోజుల పాటు విద్యాలయంలో శిబిరం జరుగుతుందన్నారు. 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 300 మంది సీనియర్ ఎన్సీసీ క్యాడెట్లు హాజరవుతారన్నారు. శారీరక శిక్షణ, యోగా, వ్యక్తిగత పోటీలు, విజ్ఞాన పర్యాటకాలు, మోటివేషన్ ఉపన్యాసాలు, సామాజిక సేవ తదితర అంశాలపై శిక్షణ ఇస్తామన్నారు. సమావేశంలో క్యాంపు డిప్యూటీ కమాండర్ లెఫ్టనెంట్ కల్నల్ నివేష్ ఎ షాల్వీ, ఎన్సీసీ అధికారులు పాల్గొన్నారు.