పెళ్లి చేసుకున్నాడు.. వద్దంటున్నాడు.. | wife alleged husband for not agree her | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకున్నాడు.. వద్దంటున్నాడు..

Published Wed, Jan 24 2018 3:20 PM | Last Updated on Wed, Jan 24 2018 3:45 PM

wife alleged husband for not agree her - Sakshi

భర్త ఇంటి ఎదుట బంధువులతో బైఠాయించిన మేకల సంగీత

నెక్కొండ: మామునూరు ఎన్‌సీసీ క్యాంపులో ఐదు సంవత్సరాల క్రితం మొదలైన ప్రేమ..పెళ్లి వరకు దారితీసింది. పెళ్లయిన అనంతరం దళిత మహిళవంటూ ఓ ప్రబుద్ధుడు ఆమెను వదిలించుకోవాలని ప్రయత్నించాడు. దీంతో బాధితురాలు భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌పర్తి మండలంలోని ముచ్చర్ల నాగారానికి చెందిన మేకల సంగీత, రూరల్‌ జిల్లా నెక్కొండ మండలంలోని గుండ్రపల్లి గ్రామానికి చెందిన బైరు భూపతి ప్రకాష్‌ 2013 సంవత్సరంలో మామునూరు ఎన్‌సీసీ క్యాంపునకు హాజరయ్యారు. అక్కడ వీరి పరిచయం ప్రేమగా మారింది. సంగీత మాదిగ, ప్రకాష్‌ మున్నూరు కాపు కులానికి చెందినవాడు. దీంతో పెళ్లిని ప్రకాష్‌ తల్లిదండ్రులు అంగీకరించలేదు.

ఈ క్రమంలో జనగామ జిల్లా చిల్పూరుగుట్టపై 25 నవంబర్‌ 2017న వారు పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం ప్రకాష్‌ కొద్ది రోజులు సంగీత ఇంటి వద్ద ఉన్నాడు. అనంతరం ప్రకాష్‌ ఇంటికి వెళ్లి తండ్రిదండ్రులను ఒప్పిస్తానని తిరిగి నెక్కొండ మండలంలోని గుండ్రపల్లికి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో సంగీతతోపాటు కుటుంబసభ్యులు ప్రకాష్‌కు పలుమార్లు ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌లో పెట్టుకున్నాడు. తీరా గుండ్రపల్లికి సంగీత కుటుంబ సభ్యులు వచ్చి సంగీతను ఎప్పుడు తీసుకువెళ్తావని అడిగారు. సంగీత మాదిగ కులానికి చెందినందున తల్లిదండ్రులు వద్దంటున్నారని ప్రకాష్‌ చెప్పాడు. వెంటనే సంగీత, కుటుంబ సభ్యులు హన్మకొండ సుబేదారిలోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు భూపతి ప్రకాష్‌ను పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. తన భార్యను వెంట తీసుకపోతానని నమ్మబలికి, కేసు ఉపసంహరించుకోవాలని సంగీతకు సూచించాడు. సంగీత కేసును ఉపసంహరించుకున్న అనంతరం మళ్లీ ఫోన్‌ ఎత్తకుండా, సమాధానమివ్వకుండా ప్రకాష్‌ తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో మంగళవారం సంగీత తన కుటుంబ సభ్యులతోపాటు ఎస్సీ మహిళా నాయకులతో కలిసి మండలంలోని గుండ్రపల్లిలో భూపతి ప్రకాష్‌ ఇంటి ఎదుట బైఠాయించింది. విషయాన్ని తెలుసుకున్న నెక్కొండ సీఐ వెంకటేశ్వర్‌రావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తనను పెళ్లి చేసుకుని ఇప్పుడు దళిత మహిళవంటూ ప్రకాష్‌ నిరాకరిస్తున్నాడని సంగీత కన్నీటి పర్యంతమైంది. స్పందించిన సీఐ వెంకటేశ్వర్‌రావు సంగీతకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చా రు. రాత్రి 7 గంటల వరకు సైతం ప్రకాష్‌ ఇంటి ఎదుటనే ఆమె బైఠాయించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

సంగీతతో మాట్లాడుతున్న సీఐ వెంకటేశ్వర్‌రావు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement