
మాట్లాడుతున్న కమాండెంట్ కల్నల్ వీరబదిరీయన్
విద్యారణ్యపురి: రిపబ్లిక్ పరేడ్ క్యాంపులో పాల్గొనాలంటే ఎన్‌సీసీ కేడెట్లకు డ్రిల్‌తో పాటు ఫైరింగ్ ప్రతిభ కూడా ముఖ్యమేనని శిక్షణ క్యాంపు కమాండెంట్ కల్నల్ వీరబదిరియన్ అన్నారు. ఎన్‌సీసీ పదో తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో హన్మకొండలో కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంపులో భాగంగా మంగళవారం మూడో రోజు ఫైరింగ్, ఆర్‌డిసీ సెలక్షన్స్, పీల్డ్ క్రాఫ్ట్, బ్యాటిల్ క్రాఫ్ట్‌లో వీరబదిరియన్ పర్యవేణలో శిక్షన సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రిల్ విభాగంలో కూడా సీనియర్, జూనియర్ విభాగాలకు చెందిన బాలురు, బాలికలను కూడా ప్రాధమికంగా ఎంపిక చేశామన్నారు. ఎన్‌సీసీ అనేది క్రమశిక్షణకు మారుపేరన్నారు. క్రమశిక్షణతో ఉన్న కేడెట్లు అన్నిరంగాల్లో ముందుంటారని, విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను ఏర్పర్చుకుని రాణించాలన్నారు. మేజర్ రీనా గోస్వామి, ఏరో పరేడ్ లెఫ్టినెంట్ సతీష్‌కుమార్, ఎం.సదానందం, చీఫ్ ఆఫీసర్ కె.ప్రకాశం, ఎన్‌సీసీ అధికారులు మహేష్, రాధాకృష్ణ, భగవతి, అనూష, విష్ణువర్ధన్‌రెడ్డి, ప్రభాకర్, బీహెచ్‌ఎం థాఫ్సె, మణికందనం, కుదే, ప్రదీప్, పాటిల్, జయరాంబడక్, గణేష్, కుమారస్వామి, కవిత, పుత్లీబాయి. సుధామణి, అశోక్, సురేందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment