drill
-
విశాఖ తీరంలో కళ్లుచెదిరే విన్యాసాలు (ఫోటోలు)
-
మెత్తబడ్డ తైవాన్.. చైనాకు స్నేహ హస్తం
తైపీ: చైనా భారీ ఎత్తున చేపట్టిన సైనిక విన్యాసాలతో తైవాన్ దిగొచ్చింది. తైవాన్ కొత్త అధ్యక్షుడిగా లాయ్ చింగ్-తె బాధ్యతలు స్వీకరిస్తూ చేసిన ప్రసంగంలో చైనాకు వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు. ఇది బీజింగ్‌కు ఆగ్రహం తెప్పించింది. దీనికి ప్రతిగా తైవాన్ చుట్టూ డ్రాగన్ భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది.దీంతో లాయ్ చింగ్-తె దూకుడు తగ్గించారు. చైనాతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు సిద్ధమేనన్నారు. ఆదివారం తైపీలో ఓ సమావేశంలో పాల్గొన్న లాయ్‌చింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ సుస్థిరత చాలా ముఖ్యం. తైవాన్ జలసంధిలో అలజడులను ప్రపంచ దేశాలు అంగీకరించవు. చైనాతో కలిసి పని చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’అని లాయ్ చింగ్ అన్నారు.కాగా, ఇటీవల తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో చైనా వ్యతిరేకిగా పేరొందిన లాయ్ చింగ్-తె విజయం సాధించిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడిగా ప్రమాణస్వీకార సందర్భంగా లాయ్‌చింగ్ మాట్లాడుతూ చైనా తమను బెదిరించడం ఆపాలని డ్రాగన్‌కు కాస్త గట్టిగానే చెప్పారు. దీంతో ఆగ్రహించిన చైనా, తైవాన్ చుట్టూ పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది. దీంతో దూకుడు తగ్గించిన లాయ్ చింగ్ మెత్తబడ్డారు. -
న్యూక్లియర్ డ్రిల్స్‌కు ఆదేశించిన పుతిన్
ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న తరుణంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌కు సమీపంలో రష్యన్ మిలటరీ, నేవి ఆధ్వర్యంలో అణ్వాయుధాల డ్రిల్స్ నిర్వహించాలని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించినట్లు ఆ దేశ రక్షణ శాఖ సోమవారం ప్రకటించింది. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అణుయుద్ధానికి సంబంధించి పుతిన్ పలుసార్లు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే.న్యూక్లియర్ డ్రిల్స్ చేస్తున్న సమయంలో నాన్ స్ట్రాటజిక్ న్యూక్లియర్ ఆయుధాలను ఉపయోగించటంపై శిక్షణ తీసుకోనున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. నాన్ స్ట్రాటిజిక్ న్యూక్లియర్ ఆయుధాలను టెక్నికల్ వెపన్స్ అంటారు. యుద్ధ క్షేత్రాల్లో ఉపయోగించే మిసైల్స్ గుండా వీటిని ప్రయోగిస్తారు.కొన్ని పశ్చాత్య దేశాల నుంచి తమ దేశానికి పొంచి ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకొని సమీప భవిష్యత్తులో న్యూక్లియర్ డ్రిల్స్ చేపడతామని రష్యా రక్షణ శాఖ తెలిపింది. అక్రమిత ఉక్రెయిన్ సరిహద్దుల్లో సైనిక బలగాలతో పాటు.. వైమానిక, నౌకా దళాలు న్యూక్లియర్ డ్రిల్స్ పాల్గొంటాయని పేర్కొంది. అమెరికాతో గతంలో చేసుకున్న ‘న్యూ స్టార్ట్ ఒప్పందం’నుంచి తాత్కాలికంగా తప్పుకొంటున్నామని గతేడాది రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. -
లవ్ డ్రిల్
‘‘నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. అమెరికాలో డాక్టర్‌గా బిజీగా ఉన్నా సినిమాలపై ఇష్టంతో ‘కెప్టెన్ రాణా ప్రతాప్, టిక్ టిక్, చంద్రహాస్’ వంటి 8 సినిమాలు తీయడంతో పాటు నటించాను. అయితే తెలుగులో ఇప్పటివరకూ లవ్ జిహాదీపై ఒక్క సినిమా కూడా రాలేదు. అందుకే ఆ కథాంశం ఎంచుకుని ‘డ్రిల్’ తీశా’’ అని హరనాథ్ పోలిచెర్ల అన్నారు. ఆయన లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘డ్రిల్’. కారుణ్య చౌదరి హీరోయిన్. డ్రీమ్ టీమ్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 16న రిలీజవుతోంది. ఈ చిత్రం టీజర్ రిలీజ్ వేడుకలో అతిథిగా పాల్గొన్న సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్... ‘‘అమెరికాలో డాక్టర్‌గా స్థిరపడ్డ హరనాథ్‌గారు ఇండియా వచ్చి తెలుగు సినిమాలు తీయడం హ్యాపీ’’ అన్నారు. -
రియల్ వార్ డ్రిల్‌కు ఆదేశించిన కిమ్!
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ శుక్రవారం తన సైన్యాన్ని రియల్ వార్ కోసం కసరత్తులను మరింత తీవ్రతరం చేయమని ఆదేశించారు. ఈ సైనికి డ్రిల్‌ను ఆయన తన కుమార్తెతో కలిసి పర్యవేక్షించారు. కిమ్ ఆయన కుమార్తె ఇద్దరు నల్లటి జాకెట్లు ధరించి అధికారులతో కలిసి ఫిరంగి యూనిట్ క్షిపణుల మాస్ ఫైరింగ్‌ను వీక్షించారు. అయితే దక్షిణ కొరియా ఆ ప్రదేశం నుంచి ఉత్తరకొరియా ఒక బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం జరిపినట్లు గుర్తించామని, అక్కడ నుంచి మరిన్ని క్షిపణి ప్రయోగాలు జరిగే అవకాశం కూడా ఉందని పేర్కొంది. అంతేగాక అదికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(కేసీఎన్ఏ) శుక్రవారం విడుదల చేసిన ఛాయచిత్రల ప్రకారం.. ఉత్తర కొరియా ఆరు క్షిపణులను ఒకేసారి పేల్చినట్లు చూపించాయి. ఇది స్ట్రైక్ మిషన్ల కోసం శిక్షణ పొందిందని కేసీఎన్ఏ తెలిపింది. ఉత్తర కొరియా పశ్చిమ జలాలే లక్ష్యంగా శక్తిమంతమైన దాడులు జరిగినట్లు కేసీఎన్ఏ పేర్కొంది. ఇదిలా ఉండగా, ఉత్తర కొరియా అధ్యక్షుడు రెండు వ్యూహాత్మక మిషన్లను సిద్ధం చేశాడని.. ఒకటి యుద్ధాన్ని నిరోధించడానికి, రెండోది యుద్ధానికి సిద్ధం కావడం అని కిమ్ సైనికులు చెప్పారు. నిజమైన యుద్ధం కోసం వివిధ పరిస్థితుల్లో, విబిన్న రీతిలో ఎదర్కొనేలా కరత్తులను మరింత తీవ్రతరం చేయమని సైనికులను కిమ్ ఆదేశించాడు. దక్షిణ కొరియా, అమెరికా తోకలిసి సోమవారం అతిపెద్ద ఉమ్మడి సైనిక విన్యాసాలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఉత్తర కొరియా ఈ డ్రిల్ నిర్వహించింది. కాగా, రెండు కొరియాల మధ్య దశాబ్దాలుగా సంబంధాలు మరింత క్షీణిస్తుండగా..మరోవైపు ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలతో కవ్వింపు చర్యలకు దిగుతోంది. దీంతో దక్షిణ కొరియా ప్రతిస్పందనగా.. వాషింగ్టన్‌తో భద్రతా సహకారాన్ని పెంచుకుంటోంది. (చదవండి: చైనా అధ్యక్షుడిగా మరోసారి జిన్‌పింగ్! ముచ్చటగా మూడోసారి) -
తైవాన్‌కి చుక్కలు చూపించేలా.. చైనా సైనిక విన్యాసాలు
చైనా మళ్లీ తైవాన్‌పై కయ్యానికి కాలుదువ్వే కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఈ మేరకు తైవాన్‌కి సమీపంలోని జల, వాయు మార్గాల్లో చైనా సైనిక విన్యాసాలు నిర్వహించిందని తైవాన్ రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. దీన్ని చైనా చేస్తున్న అతిపెద్ద చొరబాటు ప్రయత్నంగా తైవాన్ చెబుతోంది. ఐతే చైనా మిలటరీ మాత్రం ఇది అమెరికా కవ్వింపు చర్యలకు ప్రతిగా ఈ సైనిక కసరత్తులని స్పష్టం చేసింది. యూఎస్ రెచ్చగొట్టు చర్యలకు ఇది గట్టి కౌంటర్ అని కూడా పేర్కొంది. అంతేగాదు యూఎస్ తన రక్షణ బడ్డెట్లో తైవాన్‌కు రూ. 82 వేల కోట్ల సహాయం అందించిందని, దీన్ని తాము ఎన్నటికీ సహించమని తెగేసి చెప్పింది చైనా. ఈ మేరకు చైనా తైవాన్ గగతలంలోకి పంపించిన విమానాల్లో 6ఎస్‌యూ30 ఫైటర్ జెట్లు, హెచ్6 బాంబర్లు, అణుదాడులు కలిగిన డ్రోన్లు ఉన్నాయని తైవాన్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. చైనా తన యుద్ధ విమానాలతో 47 సార్లు తైవాన్ గగనతలంలోకి చొరబడినట్లు తెలపింది. తమ ప్రాంతంలోని శాంతికి విఘాతం కలిగించేలా ప్రజలను భయపెట్టడానికి చైనా ప్రయత్నిస్తోందంటూ తైవాన్ ఆరోపణలు చేసింది. మరోపక్క తైవాన్ విదేశాంగ మంత్రి తైవాన్‌లో చొరబడేందుకే చైనా ఇలా సాకులు వెతుకుతోందని మండిపడ్డారు. కాగా, రోజు రోజుకి తైవాన్ చైనా మధ్య పరిస్థితులు అధ్వాన్నంగా మారుతున్నాయి. చైనా పదే పదే చొరబడటంతో..ఏ క్షణం ఏం జరుగుతుందోనని తైవాన్ నిరంతరం ఆందోళన చెందుతోంది. (చదవండి: తక్షణమే ప్రజల ప్రాణాలను కాపాడండి..అధికారులకు జిన్‌పింగ్ ఆదేశాలు -
పుతిన్ వార్నింగ్‌ని బేఖాతారు చేస్తూ..నాటో సైనిక కసరత్తులు
ఉక్రెయిన్‌పై మిసైల్ దాడులతో దూకుడు పెంచిన రష్యా ఒకవేళ నాటో యుద్ధానికి దిగితే ప్రపంచ విపత్తు తప్పదు అని హెచ్చరించింది. అవసరమనుకుంటే అణ్వాయుధ దాడికి దిగుతానని వార్నింగ్ ఇచ్చారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఈ ఉద్రిక్తతల నడుమ పశ్చిమ యూరప్‌లో నాటో దళాలు అణు నిరోధ కసరత్తులు నిర్వహించాయి. ఇది తమ రోటిన్ అణు నిరోధక డ్రిల్ అని నొక్కి చెబుతోంది. వాస్తవానికి ఈ కసరత్తులు రష్యా ఉక్రెయిన్‌తో యుద్ధానికి దిగక మునుపే ఈ కసరత్తుల ప్రణాళిక ఉందని తెలిపింది. ఈ విన్యాసాలకు రష్యా బెదిరింపులతో సంబంధంల లేదని నాటో స్పష్టం చేసింది. పుతిన్ బెదిరింపుల మధ్య తాము కసరత్తులు నిర్వహించకపోతే తప్పు అర్థం వస్తుందని స్పష్టం చేసింది. అలా రద్దు చేస్తే తమ సైనిక బలాన్ని తక్కువ చేసినట్లు అవుతుందని చెప్పింది. అయినా పుతిన్ అణ్వాయుధాలకు పాల్పడతానని హెచ్చరిక నేపథ్యంలో నాటో జనరల్ స్టోలెన్‌బర్గ్ ఈ కసరత్తులు రద్దు చేయకూడదని నిర్ణయించారు. ఏం చేసినా రష్యా అణుదాడికి సంబంధించిన వైఖరిలో మార్పు ఉండదని తెలుసన్నారు. ఏదీఏమైన తాము మాత్రం అప్రమత్తంగా ఉంటామని చెప్పారు. (చదవండి: జిన్‌పింగ్‌కి వ్యతిరేకంగా నిరసనలు...ఈడ్చుకెళ్లి చితకబాది...:) -
ఆస్ట్రిచ్ పక్షిలా దుస్తులు ధరించి... జూలో హల్చల్! ఎందుకలా చేశాడంటే...
థాయిలాండ్‌లో ఒక అపరిచిత వ్యక్తి ఆస్ట్రిచ్ పక్షిలా దుస్తులు ధరించి జూలో హల్చల్ చేశాడు. చివరికి ఒక పెద్ద ఫిషింగ్ నెట్ వలకి చిక్కుతాడు. అసలు ఇదంతా ఏంటి? ఎందుకిలా సంచరించాడనే కదా! వివరాల్లోకెళ్తే...ఆ వ్యక్తి యానిమల్ ఎస్కేప్ డ్రిల్‌లో భాగంగా ఇలా చేశాడు. ఆస్ట్రిచ్ పక్షులు చాలా వైల్డ్‌గా ఉంటుంది. పైగా అది ఎప్పుడైన అనుకోని పరిస్థితుల్లో జూ నుంచి తప్పించుకుంటే జూ సిబ్బంది అప్రమత్తమై పట్టుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో చాలా తెలివిగా వ్యవహరించి దాన్ని పట్టుకోవాలి లేదంటే అది ఎవరిపైన ఐనా దాడి చేస్తే ఇక అంతే సంగతులు. ఈ నేపథ్యంలోనే జూ అధికారులు వైల్డ్ యానిమల్ మేనేజ్మెంట్ ప్లాన్ అనే డ్రిల్‌ని నిర్వహించారు. అందులో భాగంగా ఆ వ్యక్తి ఆస్ట్రిచ్ పక్షిమాదిరిగా దుస్తులు ధరించి జూలో అటు నుంచి ఇటూ పరిగెడుతుంటాడు. మిగతా ముగ్గురు జూ సిబ్బంది అప్రమత్తమై ఒక పెద్ద వలతో సదరు ఆస్ట్రిచ్ వేషధారణలో ఉన్న వ్యక్తిని పట్టుకుంటారు. పక్షులలో అతిపెద్ద పక్షి అయిన ఆస్ట్రిచ్ని పట్టుకోవాలంటే జూ పరిసరాలను సిబ్బంది తమ నియంత్రణలోనికి తెచ్చుకుని మరీ పట్టుకునేందుకు యత్నించాలి. పైగా ఆ పక్షి గంటకు 70 కి.మీ వేగంతో పరిగెత్తుతుంది. ఆ విపత్కర సమయంలో ఏ మాత్రం భయపడినా చాలు మన పని అయ్యిపోతుంది. అది సింహం వంటి పెద్ద పెద్ద జంతువులనే దాడి చేసి హతమార్చగలదు. (చదవండి: ఆ జర్నలిస్ట్ వర్క్ డెడికేషన్ని చూసి... ఫిదా అవుతున్న నెటిజన్లు) -
భగ్గుమంటున్న చైనా!...తైవాన్ పై కక్ష సాధింపు చర్యలు
బీజింగ్: అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన పెద్ద ప్రకంపనమే సృష్టంచింది. ఎట్టకేలకు ఆమె మంగళవారం రాత్రి తైవాన్‌లో అడుగుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న చైనా కస్సుమంటూ జరగబోయే ఏ పరిణామానికైనా అమెరికానే కారణమంటూ తన అక్కసును వెళ్లగక్కింది. ఈ నేపథ్యంలోనే తైవాన్ పై చైనా కక్ష సాధింపు చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా తైవాన్ దిగుమతులపై నిషేధం విధించింది. ఈ మేరకు తైవాన్ నుంచి దిగుమతి అయ్యే పళ్లను, చేపల ఉత్పత్తులతోపాటు సహజ సిద్ధంగా లభించే ఇసుకను చైనా నిషేధించింది. ఆయా ఉత్పత్తుల్లో అధిక రసాయనాల అవశేషాలు ఉన్నాయని, పైగా ఆ ప్యాకేజిలపై చేసిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా వచ్చిందంటూ సాకులు చెబుతూ తైవాన్ దిగుమతులను నిషేధించింది. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తైవాన్ సహజ సిద్ధ ఇసుకను నిషేధిస్తూ కారణాలను వెల్లడించకుండానే నోటీసులు జారీ చేసింది. ఇలా తైవాన్ ఎగుమతులను చైనా నిషేధించడం తొలిసారి కాదు. ఇలా మార్చి 2021లో తైవాన్ ఎగుమతి చేసే పైనాపిల్‌లో అధిక రసాయనాల అవశేషాలు ఉన్నాయంటూ నిషేధించింది. పైగా రాజకీయపరంగానే ఇలా కక్ష పూరిత చర్యకు చైనా పాల్పడిందని సమాచారం. అదీగాక 2016 నుంచి తైవాన్ అధ్యక్షురాలిగా సాయ్ ఇంగ్ వెన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తైవాన్ పై ఒత్తిడి పెంచింది చైనా. ఆమె తమ దేశాన్ని సార్వభౌమ దేశంగానూ, వన్ చైనాలో భాగంగా కాదు అన్నట్లుగా భావించడంతోనే చైనా ఈ సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఇదిలా ఉండగా తైవాన్‌ని చుట్టుముట్టి ప్రత్యక్ష మిలటరీ డ్రిల్‌ను నిర్వహిస్తున్నట్లు చైనా అధికారులు ప్రకటించారు. తైవాన్‌లోని కీలక ఓడరేవుల్లోనూ, పట్టణా ప్రాంతాల్లోనూ దాడులు చేస్తామని చైనా బెదిరింపులు దిగుతుందని తైపీ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తైవాన్ సరిహద్దు ప్రాంతానికి సుమారు 20 కిలో మీటరల దూరంలో మిలటరీ ఆపరేషన్లు చేపట్టినట్లు చైనీస్ పిపుల్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది. అయినా దాదాపు 23 మిలయన్ల జనాభా ఉన్న తైవాన్ ప్రజలు ఎప్పటికైన చైనా దండయాత్ర చేస్తుందన్న దీర్ఘకాలిక భయాలతోనే జీవిస్తున్నారు. ప్రస్తుత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హయాంలో ఆ ముప్పు మరింత తీవ్రతరమైంది. (చదవండి: హైటెన్షన్.. తైవాన్‌లో నాన్సీ పెలోసీ.. రెచ్చగొట్టేలా ట్వీట్లు.. పరిణామాలపై చైనా హెచ్చరిక) -
ఇండో పసిఫిక్ ట్రేడ్ డీల్‌ను ప్రవేశపెట్టిన జో బైడెన్
జపాన్ పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇండో పసిఫిక్ ట్రేడ్ డీల్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో అమెరికా, ఇతర క్వాడ్ దేశాలు సహా 12 దేశాలు భాగమయ్యాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతం ఆర్థికంగా బలోపేతం అవడంలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. జపాన్‌లోని టోక్యోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఒప్పందాన్ని ప్రారంభించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతం ఆర్థికంగా బలోపేతం అవడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. ఇందులో క్వాడ్ దేశాలతో పాటు బ్రూనయ్, దక్షిణ కొరియా, ఇండోనేసియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, వియత్నాం, థాయ్‌లాండ్, మలేసియా దేశాలు ఉన్నాయి. గతంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్, ఉక్రెయిన్-రష్యా యుద్ధ పరిస్థితులు తీవ్ర ప్రభావాన్ని చూపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి సమస్యలను ఎదుర్కొనేందుకు ఈ ఒప్పందం కీలక పాత్ర పోషించనుంది. చైనా ఆక్రమణకు ప్రయత్నిస్తే తైవాన్‌కు తాము అండగా ఉంటామని బైడెన్ భరోసా ఇచ్చారు. అంతే కాకుండా సైనికపరంగా కూడా జోక్యం చేసుకుంటున్నట్లు తెలిపారు. అయితే తమ మార్కెట్లలోకి ప్రవేశించడానికి భాగస్వామ్య దేశాలకు అమెరికా పన్నుల తగ్గింపు సహా ఒప్పందంలో ప్రోత్సాహకాలను ఇవ్వలేదన్న విమర్శలు వస్తున్నాయి. 2017లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ట్రాన్స్-పసిఫిక్ భాగస్వామ్యం నుంచి అమెరికా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో యూఎస్‌కు సంబంధించిన పలు వ్యాపార ఒప్పందాలు తీవ్రంగా నష్టాన్ని చవి చూశాయి. చదవండి: China Warns US: మమల్ని తక్కువ అంచనా వేయకండి: అమెరికాకు చైనా వార్నింగ్ -
డ్రిల్‌తో పాటు ఫైరింగ్ కూడా ముఖ్యమే..
విద్యారణ్యపురి: రిపబ్లిక్ పరేడ్ క్యాంపులో పాల్గొనాలంటే ఎన్సీసీ కేడెట్లకు డ్రిల్‌తో పాటు ఫైరింగ్ ప్రతిభ కూడా ముఖ్యమేనని శిక్షణ క్యాంపు కమాండెంట్ కల్నల్ వీరబదిరియన్ అన్నారు. ఎన్సీసీ పదో తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో హన్మకొండలో కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంపులో భాగంగా మంగళవారం మూడో రోజు ఫైరింగ్, ఆర్డిసీ సెలక్షన్స్, పీల్డ్ క్రాఫ్ట్, బ్యాటిల్ క్రాఫ్ట్‌లో వీరబదిరియన్ పర్యవేణలో శిక్షన సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రిల్ విభాగంలో కూడా సీనియర్, జూనియర్ విభాగాలకు చెందిన బాలురు, బాలికలను కూడా ప్రాధమికంగా ఎంపిక చేశామన్నారు. ఎన్సీసీ అనేది క్రమశిక్షణకు మారుపేరన్నారు. క్రమశిక్షణతో ఉన్న కేడెట్లు అన్నిరంగాల్లో ముందుంటారని, విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను ఏర్పర్చుకుని రాణించాలన్నారు. మేజర్ రీనా గోస్వామి, ఏరో పరేడ్ లెఫ్టినెంట్ సతీష్‌కుమార్, ఎం.సదానందం, చీఫ్ ఆఫీసర్ కె.ప్రకాశం, ఎన్సీసీ అధికారులు మహేష్, రాధాకృష్ణ, భగవతి, అనూష, విష్ణువర్ధన్‌రెడ్డి, ప్రభాకర్, బీహెచ్ఎం థాఫ్సె, మణికందనం, కుదే, ప్రదీప్, పాటిల్, జయరాంబడక్, గణేష్, కుమారస్వామి, కవిత, పుత్లీబాయి. సుధామణి, అశోక్, సురేందర్ పాల్గొన్నారు. -
ఉద్రిక్తతల నడుమ భారత నేవి భారీ డ్రిల్
న్యూఢిల్లీ: సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భారత ఆర్మీ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధమౌతోంది. సర్జికల్ దాడుల అనంతరం పాక్ వైపు నుంచి కాల్పుల ఉల్లంఘనలు పెరగడంతో పాటు.. గురువారం ఉదయం నుంచి పాక్ సైన్యం ఎల్ఓసీ, అంతర్జాతీయ సరిహద్దు వద్ద భారీ స్ధాయిలో కాల్పులకు దిగుతోంది. ఈ దాడులను భారత సైన్యం ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తిప్పికొడుతూనే ఉంది. అయితే నవంబర్ చివర్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ పదవికాలం ముగియనుండటంతో.. ఈ లోపు పాక్ ఏదైనా దుందుడుకు చర్యలకు పాల్పడే అవకాశం లేకపోలేదని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో భారత సైన్యం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఆర్మీ, వాయుసేన పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండగా.. ఇప్పుడు ఇండియన్ నేవి సైతం అరెబియా సముద్రంలో 'పశ్చిమ్ లెహర్' పేరుతో భారీస్థాయిలో విన్యాసాలకు సిద్ధమౌతోంది. 40కి పైగా వార్‌షిప్‌లు, సబ్మెరైన్లు, మెరిటైమ్ ఫైటర్ జెట్లు, గస్తీ ఎయిర్ క్రాఫ్ట్స్, డ్రోన్లతో నౌకాదళం ఈ విన్యాసాలను నవంబర్ 2 నుంచి 14 వరకు నిర్వహించనుంది. -
పాతాళంలో జలం!
కీసరకు చెందిన దాగిళ్లపురం రాజు తాగునీటి బోరు తవ్వించాలని నిర్ణయించుకున్నాడు. నాలుగైదు వందల అడుగులైనా సరే.. నీళ్లు వస్తే చాలనుకొని రంగంలోకి దిగాడు. గత వారం ఐదువందల అడుగుల లోతువరకు బోరు వేయించినా ప్రయోజనం లేదు. ధైర్యం చేసి మరో 500 అడుగుల లోతువరకు డ్రిల్ వేయించాడు. కానీ ఫలితం శూన్యం. ఇంట్లో నీటిసమస్యను తట్టుకోలేక మరికొంత ధైర్యం చేసిన రాజు.. మరో వంద ఫీట్లలోతు వరకు డ్రిల్ చేయించాడు. రాతి పొగ తప్ప.. చుక్కనీరు కూడా రాలేదు. ఇప్పటికే రూ.1.60లక్షలు ఒడిసిపోవడంతో చేసేదేమీ లేక బోరువేసే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. తాగునీటికి కటకట ఉన్న మన జిల్లాలో వెయ్యి అడుగుల లోతులో కూడా చుక్క నీరు దొరకని పరిస్థితికి నిదర్శనమిది. జిల్లాలో భారీగా పతనమైన భూగర్భ నీటిమట్టం సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో నీటి సమస్య ఊగ్రరూపం దాల్చింది. తాగునీటితోపాటు నిత్యవసరాలకు వాడుకునే నీటికి సైతం తీవ్ర కటకట వచ్చింది. వేసవి సీజన్ సమీపించకముందే జిల్లాలోని అన్ని మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు తలెత్తడం జిల్లా ప్రజానికాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. సగటున ఐదు అడుగులు పతనం మండలంలో లోతట్టు ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకుని అక్కడ భూగర్భ జలశాఖ వేసిన బోరులో నీటి పరిస్థితిని పరిశీలించి భూగర్భజలాల పరిస్థితిని అంచనా వేస్తోంది. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పద్ధతితో స్పష్టత రానప్పటికీ.. అధికారులు మాత్రం దీన్నే కొనసాగిస్తున్నారు. ఇటీవల జిల్లా భూగర్భజల శాఖ అధికారులు మండలాల వారీగా నీటిమట్టాలను ప్రకటించారు. 2013-14 పరిస్థితిని పరిశీలిస్తూ.. తాజాగా 2014-15 సంవత్సరంలో నమోైదె న వివరాలను పోలిస్తే భారీగా తగ్గుదల కనిపిస్తోంది. జిల్లాలో సగటున ఐదు అడుగుల లోతుకు నీటిమట్టం పడిపోయినట్లు అధికారులు గణాంకాలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇదీ.. * జిల్లాలో అత్యధికంగా కీసర మండలంలో భూగర్భ జలాలు పడిపోయాయి. అయితే ఇక్కడ ఎంతమేర నీటి మట్టం పడిపోయిందనేది అధికావర్గాలు సైతం చెప్పలేకపోవడం గమనార్హం. * బంట్వారం మండలంలో ఏకంగా 19 అడుగులలోతుకు నీటిమట్టం పతనమైంది. * గండేడ్, మల్కాజిగిరి మండలాల్లో 11 అడుగుల లోతుకు భూగర్భజలాలు పతనమయ్యాయి. ఇక్కడ 25అడుగుల లోతులో నీరు లభ్యమవుతున్నట్లు అధికారులు నివేదికలు చెబుతున్నాయి. * పెద్దేముల్, బాలానగర్, మర్పల్లి, మహేశ్వరం తదితర మండలాల్లోనూ నీటిమట్టాలు భారీగా పడిపోయాయి. * పలుమండలాల్లో భూగర్భ జలాల పరిస్థితి పతనమవ్వడం, వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో మరింత ఒత్తిడి పెరగడంతో భూగర్భజలాల పరిస్థితి ఆందోళనకంగా మరే అవకాశం ఉంది. దీంతో కలుషితనీటితో అనర్థాలు జరవచ్చని పర్యవరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భజలాల వాడకాన్ని అరికట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుంటే భవిష్యత్తు ఉండదని హెచ్చరిస్తున్నారు. -
హోంగార్డులకు ఇళ్ల స్థలాలు
ఎస్పీ రఘురామ్‌రెడ్డి కృషి చేస్తున్నారని హోంగార్డుల డీఎస్పీ ఎస్ఎస్కేవీ కృష్ణారావు వెల్లడి భీమవరం అర్బన్ : జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డులందరికీ ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి కృషి చేస్తున్నారని హోంగార్డుల డీఎస్పీ (తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాలు) ఎస్ఎస్కేవీ కృష్ణారావు తెలిపారు. చాలామంది హోంగార్డులకు ఉండేందుకు సొంత ఇళ్లు లేవని, వారు పడుతున్న ఇబ్బందులను గమనించిన ఎస్పీ ఆ దిశగా కృషి చేస్తున్నారన్నారు. స్థానిక లూథరన్ హైస్కూల్ క్రీడామైదానంలో సోమవారం నరసాపురం డివిజన్లోని హోంగార్డులకు డ్రిల్ నిర్వహించి పలు సూచనలు చేశారు. శాంతి భద్రతలను కాపాడటంలో, ట్రాఫిక్ సమస్యల పరిష్కారంలో, ప్రభుత్వరంగ ఆస్తుల పరిరక్షణలో హోంగార్డులు కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పారు. విధి నిర్వహణలో ఎక్కడా రాజీ పడవద్దని, డ్రెస్ కోడ్‌ను తప్పనిసరిగా పాటించాలని వారికి సూచించారు. ఓఎన్జీసీ, బీఎస్ఎన్ఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో మరింతమంది హోంగార్డులను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. హోంగార్డ్స్ ఏఆర్ ఎస్సై ఎ.హనుమంతరావు ఆయన వెంట ఉన్నారు. -
ఉత్తరముంటే.. ఉద్యోగం!
దండుకోవడంలో పోటీ! అంగట్లో సబ్స్టేషన్లలోని షిప్ట్ ఆపరేటర్ పోస్టులు అధికార పార్టీ నేతల సిఫారసు లేఖ ఉంటే ఉద్యోగం వచ్చినట్లే ఎమ్మెల్యే, ఎంపీతో పాటు మేయర్, మున్సిపల్ చైర్మన్లూ లేఖలిస్తున్న వైనం తలలు పట్టుకుంటున్న ఎస్పీడీసీఎల్ అధికారులు ఒక్కో లేఖ ఖరీదు రూ.2లక్షలుపైనే సాక్షి, చిత్తూరు: ‘దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం అంటే ఇదే!’ అధికారం పీఠం ఎక్కిన అనతికాలంలోనే ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారు కొంతమంది ప్రజాప్రతినిధులు. జిల్లాలో విద్యుత్ సబ్స్టేషన్లలో షిప్ట్ ఆపరేటర్ పోస్టులను బేరానికి పెట్టారు. ఒక్కో పోస్టు ఖరీదు రూ.2లక్షలుగా ఖరారు చేసి బేరం కుదిరిన వారికి సిఫారసు లేఖ ఇస్తున్నారు. ఒకే పోస్టుకు ఇద్దరు, ముగ్గురు ప్రజాప్రతినిధులు లేఖలు ఇవ్వడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎవరికి పోస్టింగ్ ఇవ్వాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల జిల్లాలో చర్చనీయాంశమవుతున్న ఈ అవినీతి బాగోతం వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లాలో ఇటీవల 46 విద్యుత్ సబ్స్టేషన్లను ప్రభుత్వం నిర్మించింది. ఇందులో 43 సబ్స్టేషన్లు 2-3 నెలల కాలంలో ప్రారంభమయ్యాయి. మరో 3 సబ్స్టేషన్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతి స్టేషన్లో 3 ఆపరేటర్లు, ఓ వాచ్‌మన్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయాలి. ఈ క్రమంలో అనుప్పల్లి, దొడ్డిపల్లి, బోయకొండ, తిరుపతి ఆటోనగర్‌తోపాటు పలు సబ్స్టేషన్లలో ఆపరేటర్ పోస్టులు భర్తీ ప్రక్రియ పూర్తికాలేదు. ఇప్పటికే ప్రారంభించిన కొత్త సబ్స్టేషన్లలో కూడా ఖాళీ లు ఉన్నాయి. తమకు తెలియకుండా వీటిని భర్తీ చేయరాదని విద్యుత్ అధికారులపై అధికార పార్టీ ప్ర జాప్రతినిధులు హుకుం జారీ చే సినట్లు తెలిసింది. తమ నియోజకవర్గ పరిధిలోని పోస్టు ఎవరికి ఇవ్వాలో లిఖిత పూర్వక లేఖ ఇస్తామని, అందులో పేర్కొన్న వారికే ఇవ్వాలని చెప్పినట్లు తెలుస్తోంది. చిత్తూరు నేతల మధ్య రగడ చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గాని కి సంబంధించి కొన్ని ఆపరేటర్ పోస్టులకు ఓ మహిళా ప్రజాప్రతినిధి సిఫారసు లేఖ ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఇవే పోస్టులకు ఓ ఎంపీ కూడా లేఖ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది చాలదన్నట్లు మరో మహిళా ప్రజాప్రతినిధి మరో లేఖ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఎవరికి ఇవ్వాలో తెలియక అధికారులు తలలుపట్టుకుంటున్నట్లు ఎస్పీడీసీఎల్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని ఆయా ప్రజాప్రతినిధులకు వివరించినా ఎవరూ లేఖను వెనక్కు తీసుకునేందుకు సిద్ధపడడం లేదు. ‘నా పరిధి అంటే నా పరిధి’ అని వారిలో వారే పంతానికి పోతున్నారు. చేసేదేమీ లేక అధికారులు కూడా వీటి భర్తీకి తాత్కాలికంగా బ్రేక్ వేశారు. ఇదే రగడ తిరుపతి నియోజకవర్గంలోనూ చోటు చేసుకున్నట్లు తెలిసింది. లేఖలు వెనక్కు తీసుకోవాలంటే అభ్యర్థుల నుంచి తీసుకున్న డబ్బులు ఇచ్చేయాలి. దీనికి ప్రజాప్రతినిధులు ససేమిరా అంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ పరిస్థితి నెలకొంది. దండుకోవడంలో ఉన్న పోటీ అభివృద్ధిలో ఉంటే జిల్లా బాగుపడుతుందని ఐటీఐ విద్యార్థులు అంటున్నారు.