తైపీ: చైనా భారీ ఎత్తున చేపట్టిన సైనిక విన్యాసాలతో తైవాన్ దిగొచ్చింది. తైవాన్ కొత్త అధ్యక్షుడిగా లాయ్ చింగ్-తె బాధ్యతలు స్వీకరిస్తూ చేసిన ప్రసంగంలో చైనాకు వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు. ఇది బీజింగ్‌కు ఆగ్రహం తెప్పించింది. దీనికి ప్రతిగా తైవాన్ చుట్టూ డ్రాగన్ భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది.
దీంతో లాయ్ చింగ్-తె దూకుడు తగ్గించారు. చైనాతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు సిద్ధమేనన్నారు. ఆదివారం తైపీలో ఓ సమావేశంలో పాల్గొన్న లాయ్‌చింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ సుస్థిరత చాలా ముఖ్యం. తైవాన్ జలసంధిలో అలజడులను ప్రపంచ దేశాలు అంగీకరించవు.
చైనాతో కలిసి పని చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’అని లాయ్ చింగ్ అన్నారు.కాగా, ఇటీవల తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో చైనా వ్యతిరేకిగా పేరొందిన లాయ్ చింగ్-తె విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అధ్యక్షుడిగా ప్రమాణస్వీకార సందర్భంగా లాయ్‌చింగ్ మాట్లాడుతూ చైనా తమను బెదిరించడం ఆపాలని డ్రాగన్‌కు కాస్త గట్టిగానే చెప్పారు. దీంతో ఆగ్రహించిన చైనా, తైవాన్ చుట్టూ పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది. దీంతో దూకుడు తగ్గించిన లాయ్ చింగ్ మెత్తబడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment