జపాన్ పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇండో పసిఫిక్ ట్రేడ్ డీల్ను ప్రవేశపెట్టారు. ఇందులో అమెరికా, ఇతర క్వాడ్ దేశాలు సహా 12 దేశాలు భాగమయ్యాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతం ఆర్థికంగా బలోపేతం అవడంలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. జపాన్‌లోని టోక్యోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఒప్పందాన్ని ప్రారంభించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతం ఆర్థికంగా బలోపేతం అవడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం.
ఇందులో క్వాడ్ దేశాలతో పాటు బ్రూనయ్, దక్షిణ కొరియా, ఇండోనేసియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, వియత్నాం, థాయ్లాండ్, మలేసియా దేశాలు ఉన్నాయి. గతంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్, ఉక్రెయిన్-రష్యా యుద్ధ పరిస్థితులు తీవ్ర ప్రభావాన్ని చూపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి సమస్యలను ఎదుర్కొనేందుకు ఈ ఒప్పందం కీలక పాత్ర పోషించనుంది. చైనా ఆక్రమణకు ప్రయత్నిస్తే తైవాన్‌కు తాము అండగా ఉంటామని బైడెన్ భరోసా ఇచ్చారు. అంతే కాకుండా సైనికపరంగా కూడా జోక్యం చేసుకుంటున్నట్లు తెలిపారు.
అయితే తమ మార్కెట్లలోకి ప్రవేశించడానికి భాగస్వామ్య దేశాలకు అమెరికా పన్నుల తగ్గింపు సహా ఒప్పందంలో ప్రోత్సాహకాలను ఇవ్వలేదన్న విమర్శలు వస్తున్నాయి. 2017లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ట్రాన్స్-పసిఫిక్ భాగస్వామ్యం నుంచి అమెరికా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో యూఎస్‌కు సంబంధించిన పలు వ్యాపార ఒప్పందాలు తీవ్రంగా నష్టాన్ని చవి చూశాయి.
చదవండి: China Warns US: మమల్ని తక్కువ అంచనా వేయకండి: అమెరికాకు చైనా వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment