21 నుంచి పెద్దాపురంలో ఎన్‌సీసీ శిబిరం
Published Wed, Oct 12 2016 11:11 PM | Last Updated on Mon, Sep 4 2017 5:00 PM
పెద్దాపురం :
దేశ సమైక్యతను చాటే విధంగా పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయలో జాతీయస్థాయి ఎన్‌సీసీ ప్రత్యేక శిక్షణ శిబిరం (స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపు–2016) నిర్వహిస్తున్నట్టు ఎన్‌ఎస్‌ఎస్ కాకినాడ గ్రూపు కమాండర్ కల్నల్ ఎల్‌సీఎస్ నాయుడు తెలిపారు. విద్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 21 నుంచి 12 రోజుల పాటు విద్యాలయంలో శిబిరం జరుగుతుందన్నారు. 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 300 మంది సీనియర్ ఎన్‌సీసీ క్యాడెట్లు హాజరవుతారన్నారు. శారీరక శిక్షణ, యోగా, వ్యక్తిగత పోటీలు, విజ్ఞాన పర్యాటకాలు, మోటివేషన్ ఉపన్యాసాలు, సామాజిక సేవ తదితర అంశాలపై శిక్షణ ఇస్తామన్నారు. సమావేశంలో క్యాంపు డిప్యూటీ కమాండర్ లెఫ్టనెంట్ కల్నల్ నివేష్ ఎ షాల్వీ, ఎన్‌సీసీ అధికారులు పాల్గొన్నారు.
Advertisement