దేశీయ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో మరో పరిణామం చోటు చేసుకుంది. కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీనానాథ్ ఖోల్కర్ పదవి నుంచి వైదొలిగారు. కంపెనీ అనుబంధ విభాగాలకు గ్లోబల్ హెడ్‌గా ఉన్న ఆయన 34 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత సంస్థను విడిచిపెట్టారు. ఖోల్కర్ స్థానంలో రాజీవ్ రాయ్‌ను టీసీఎస్ నియమించింది.
దీనానాథ్ ఖోల్కర్ 1996లో టీసీఎస్‌లో డేటా వేర్‌హౌసింగ్, డేటా మైనింగ్ గ్రూప్‌ను ప్రారంభించారు. తర్వాత అది బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్రాక్టీస్‌గా మారింది. తన సుదీర్ఘ అనుభవంలో ఆయన టీసీఎస్ ఈసర్వ్ సీఈవో, ఎండీగా, బీఎఫ్‌ఎస్‌ఐ బీపీవో హెడ్‌గా ఎదిగారు. 2017-22 కాలంలో అనలిటిక్స్, ఇన్‌సైట్స్ గ్లోబల్ హెడ్‌గా పనిచేశారు.
“నా కెరీర్‌లో పరిశ్రమలోని అద్భుతమైన నాయకులు, నిపుణులతో, అలాగే టీసీఎస్‌లో మా భాగస్వాములు, మా కస్టమర్‌లు, అనేక మంది సభ్యులతో కలిసి పని చేయడం నా అదృష్టం. నేను పనిచేసిన ప్రతి బృందం ప్రత్యేకమైనది. అనేక గొప్ప జ్ఞాపకాలను మిగిల్చింది” అని దీనానాథ్ ఖోల్కర్ తన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment