తుల్యభాగ టు మలేషియా | swimming competition gunasekhar | Sakshi
Sakshi News home page

తుల్యభాగ టు మలేషియా

Oct 22 2016 11:25 PM | Updated on Sep 4 2017 6:00 PM

ఇక్కడి కాలువల్లో ఈత నేర్చుకున్న కుర్రాడు అంతర్జాతీయ స్విమ్మింగ్‌ పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికయ్యాడు. ఇప్పటికే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి పలు స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాడు. తాజాగా అంతర్జాతీయ స్థాయిలో మలేషియాలో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొననున్నాడు. వివరాలివి... జి.మామిడాడలోని బసివిరెడ్డి పేటకు చెందిన కొల్లకోట

  • స్విమ్మింగ్‌లో సత్తా చాటుతున్న గుణశేఖర్‌
  • అంతర్జాతీయ పోటీలకు ఎంపిక 
  • త్వరలో మలేషియాలో పోటీలు
  • జి.మామిడాడ (పెదపూడి) :
    ఇక్కడి కాలువల్లో ఈత నేర్చుకున్న కుర్రాడు అంతర్జాతీయ స్విమ్మింగ్‌ పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికయ్యాడు. ఇప్పటికే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి పలు స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాడు. తాజాగా అంతర్జాతీయ స్థాయిలో మలేషియాలో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొననున్నాడు. వివరాలివి... జి.మామిడాడలోని బసివిరెడ్డి పేటకు చెందిన కొల్లకోట గుణశేఖర్‌ తండ్రి సీతారాముడు గతంలో రజక వృతి చేసేవారు. తండ్రి స్థానిక తుల్యభాగ నది కాలువలో దుస్తులు ఉతికే సమయంలో మూడో తరగతి చదువుతున్న గుణశేఖర్‌ ఈత నేర్చుకోవడంపై ఆసక్తి చూపడంతో కుమారుడికి ఈత నేర్పించారు. స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతుండగా జిల్లా స్థాయి స్మిమ్మింగ్‌ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాడు. స్థానిక డీఎస్‌ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ పూర్తి చేసి, డీఎల్‌ఆర్‌ డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. 
     
    • 9వ తరగతి చదువుతుండగా కాకినాడలో జరిగిన స్కూల్‌గేమ్స్‌ ఫెడరేష¯ŒS(ఎస్‌జీఎఫ్‌) అండర్‌–17 పోటీల్లో నాల్గో స్థానం
    • 2014లో (ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌) కాకినాడలో జరిగిన స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేష¯ŒS అండర్‌–19 పోటీల్లో జిల్లా ప్రథమ స్థానం
    • అదే ఏడాది కర్నూలులో జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేష¯ŒS పోటీల్లో  నాల్గో స్థానం సాధించాడు. జాతీయ స్థాయి పోటీలకు స్టాండ్‌బైగా ఎంపికైయ్యాడు – 2015లో (ఇంటర్‌ సెకండియర్‌) కాకినాడలో జరిగిన స్కూల్‌గేమ్స్‌ ఫెడరేష¯ŒS అండర్‌–19 పోటీల్లో ప్రథమ స్థానం సాధించి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
    • 2016 ఏప్రిల్‌లో రాజమహేంద్రవరంలో జరిగిన స్టూడెంట్‌ ఒలింపిక్‌ అసోసియేష¯ŒS అండర్‌–19 పోటీల్లో ప్రథమ స్థానం
    •  సెప్టెంబర్‌లో నెల్లూరు జిల్లాలో జరిగిన రాష్ట్ర పోటీల్లో ప్రథమ స్థానం సాధించి జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు.
    • గుజరాత్‌ రాష్ట్రం వడోదర ప్రాంతంలో జరిగిన ఒలింపిక్‌ అసోసియేష¯ŒS అండర్‌–19 జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించి, అంతర్జాతీయ స్థాయిలో మలేషియాలో నిర్వహించే పోటీలకు ఎంపికయ్యాడు. 
    ప్రత్యేకంగా కోచ్‌ లేరు
    తనకు ఎవరూ కోచ్‌ లేరని గుణశేఖర్‌ తెలిపారు. పోటీల్లో పాల్గొనడానికి వెళ్లిన ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధతో మెళకువలు తెలుసుకుని, వాటిని పాటించాను. తొలినాళ్లలో నా తండ్రే ఈత నేర్పించారు. ప్రాథమిక మెళకువలు చెప్పారు.  రైల్వేలో ఉన్నత స్థాయి ఉద్యోగం సాధించాలనే లక్ష్యం ఉంది. మలేషియాలో నిర్వహించే అంతర్జాతీయ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచేందుకు కృషి చేస్తున్నాను.                     
    – కె.గుణశేఖర్‌
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement