
డబుల్స్ విభాగంలో కాంస్య పతకాలు సాధించిన హేమమాధురి, మౌనిక
ఏలూరు రూరల్: సౌతాఫ్రికాలో జరిగిన టెన్నికాయిట్ వరల్డ్ కప్ పోటీల్లో పశ్చిమగోదావరి క్రీడాకారిణి జి.హేమమాధురి కాంస్య పతకం సాధించిందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ కార్యదర్శి సంపంగి తిరుమలరావు ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 8 వరకు సౌతాఫ్రికాలో 5వ టెన్నికాయిట్ వరల్డ్ కప్ పోటీలు జరుగుతున్నాయని, శుక్రవారం జరిగిన జూనియర్ డబుల్స్ విభాగంలో విశాఖపట్టణం క్రీడాకారిణి ఆర్.మౌనికతో కలిసి హేమమాధురి తృతీయస్థానంలో నిలిచిందని వివరించారు.
పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన ఈ క్రీడాకారిణి పలుసార్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి బాలికల్లో స్ఫూర్తి నింపిందని పేర్కొన్నారు. విజేతలను ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రెసిడెంట్ యు.రాంప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పి.రవీంద్ర అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment