‘‘నాకు, విజయ్‌కు మధ్య పోటీ లేదు. తనకు తానే పోటీ అని విజయ్ అంటుంటాడు. నేనూ అంతే. నాకు పోటీ నేనే’’ అన్నది రజనీకాంత్ లేటెస్ట్ స్టేట్మెంట్. ‘లాల్‌సలామ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రజనీకాంత్ ఈ విధంగా మాట్లాడారు. దీనికి ఓ కారణం ఉంది. ‘జైలర్’ సినిమా ఆడియో ఫంక్షన్ వేదికగా రజనీకాంత్ ఓ డేగ, కాకి కథ చెప్పారు. ‘కాకులు ఎంత అరిచినా వాటి అరుపులు పట్టించుకోకుండా డేగ ఆకాశానికి ఎగురుతూనే ఉంటుంది’ అంటూ తన జర్నీని ఉద్దేశించి ఆ కథ చెప్పారు రజనీ.
దాంతో విజయ్‌ను ఉద్దేశించే ఆ కథ చెప్పారని కొందరు విజయ్ ఫ్యాన్స్, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకరమైన కామెంట్స్ చేశారు. ఈ విషయంపై తాజాగా చెన్నైలో జరిగిన ‘లాల్‌సలామ్’ ఆడియో లాంచ్ వేదికగా రజనీకాంత్ స్పందించారు. ‘‘జైలర్’ ఫంక్షన్‌లో నేను చెప్పిన కథ తప్పుగా ప్రచారంలోకి వెళ్లింది. విజయ్‌ని ఉద్దేశించే నేను ఆ కథ చెప్పానని ప్రచారం జరగడం బాధగా అనిపించింది.
‘ధర్మత్తిన్ తలైవన్’ సినిమా షూటింగ్ టైమ్‌లో విజయ్ తండ్రి చంద్రశేఖర్ నాకు అతన్ని పరిచయం చేసి, విజయ్ నటనపట్ల ఆసక్తిగా ఉన్నాడని చెప్పారు. చదువు పూర్తి చేశాక ఇండస్ట్రీలోకి రావాలని విజయ్‌కి సలహా ఇచ్చాను. తన చిన్నప్పట్నుంచి చూస్తున్నాను. ప్రతిభ, క్రమశిక్షణ, కష్టంతో విజయ్ పెద్ద స్టార్‌గా ఎదిగాడు. ఇకపై మా ఇద్దరి మధ్య పోటీ పెట్టొద్దని ఫ్యాన్స్‌ని కోరుతున్నాను’’ అన్నారు. ఇక ఐశ్వర్య దర్శకత్వంలో రూపొందిన ‘లాల్ సలామ్’ ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment