ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన మూడో చిత్రం 'లాల్ సలామ్' ఆడియో ఆవిష్కరణ శుక్రవారం చెన్నైలోని శ్రీ సాయిరామ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో విక్రాంత్, విష్ణు విశాల్ ప్రధాన పాత్రలలో నటించారు, ఇందులో రజనీకాంత్ అతిధి పాత్రలో కనిపించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్స్ ద్వారా సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 9న థియేటర్లలోకి లాల్ సలామ్ రానుంది.
లాల్ సలామ్ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. లాల్ సలామ్ గురించి రజనీకాంత్ మాట్లాడుతూ.. "నా పాత్ర, మొయిదీన్ భాయ్, దక్షిణాది జిల్లాలో నివసించిన ఒక వ్యక్తి ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రం 1992లో జరిగిన రియల్ సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. కానీ అవకాశవాదులు అతని పేరును తెరపై లేకుండా చూడాలని కోరుకున్నారు. వారు అతని గుర్తింపును దాచారు. మత సామరస్యంతో ఈ చిత్రం నిండి ఉంటుంది.' అని రజనీ చెప్పారు.
నాకు ఎవరూ పోటీ కాదు
జైలర్ సినిమా ఈవెంట్‌లో భాగంగా 'అర్థమైందా రాజా' అంటూ నేను చేసిన వ్యాఖ్యలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకుని వైరల్ చేశారు. సాధారణంగా చెప్పిన మాటలను దళపతి విజయ్‌పై కావాలనే నేను ఆ వ్యాఖ్యలు చేసినట్లు వ్యాప్తి చేశారు. నాకు చాలా బాధ అనిపించింది. నేను అతన్ని చిన్నతనం నుంచి చూస్తున్నాను. విజయ్ నా కళ్ల ముందే పెరిగాడు. ఎంతో పట్టుదలతో కష్టపడి నేడు ఈ స్థాయికి చేరుకున్నాడు. అలాంటి వ్యక్తిపై నేను ఎందుకు కామెంట్లు చేస్తాను. నాకు ఎవరితోనూ పోటీ ఉండదు. నాకు నేనే పోటీగా కొనసాగుతాను. ఈ సమయంలో నా అభిమానులకు చెప్పేది ఒక్కటే.. మా ఇద్దరినీ పోల్చి చూడకండి.' అని రజనీకాంత్ వివరణ ఇచ్చారు.
జైలర్ ఈవెంట్‌లో రజనీకాంత్ మాట్లాడుతూ.. 'మొరగని కుక్కలేదు.. విమర్శించని నోరు లేదు.. ఇవి రెండూ జరగని ఊరు లేదు.. మనం మన పని చూసుకుంటూ పోతూనే ఉండాలి.. అర్థమైందా రాజా..' అంటూ తన జీవితంలో ఎదురైన పరిస్థితులను వివరిస్తూ కామెంట్ చేశారు. ఆ సమయంలో విజయ్, ఆయన ఫ్యాన్స్‌ను ఉద్దేశించే రజనీ ఈ వ్యాఖ్యలు చేశారంటూ కోలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో రజనీపై విజయ్ ఫ్యాన్స్ భారీగా ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే.
Clarification from Superstar Rajinikanth at the #LalSalaamAudioLaunch about the KAAKA KAZHUGU speech. pic.twitter.com/8NzNC7Psz0
— Actor Vijay Universe (@ActorVijayUniv) January 26, 2024
Comments
Please login to add a commentAdd a comment