ఉత్సాహ‘బరి’తం! | kabaddi competition in peddapuram | Sakshi
Sakshi News home page

ఉత్సాహ‘బరి’తం!

Published Mon, Dec 26 2016 10:08 PM | Last Updated on Mon, Sep 4 2017 11:39 PM

kabaddi competition in peddapuram

పెద్దాపురం : 
ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అంతర్‌ కళాశాలల కబడ్డీ మీట్‌ – 2016 పోటీలు సోమవారం పెద్దాపురం మహారాణి కళాశాలలో ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ మీట్‌ను కాకినాడ  ఎంపీ తోట నరసింహం ప్రారంభించారు. సుమారు 26 కళాశాలలకు చెందిన 26 టీములు పాల్గొన్నాయి. మహారాణి కళాశాల ప్రిన్సిపాల్‌ ఆర్‌.ప్రభాకరరావు అధ్యక్షతన జరిగిన క్రీడా ప్రారంభ సభలో ఎంపీ నరసింహం మాట్లాడుతూ క్రీడారంగంలో రాణిస్తే మంచి భవిష్యత్‌ సాధ్యపడుతుందన్నారు. మున్సిపల్‌ చైర్మ¯ŒS రాజా సూరిబాబు రాజు మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యమివ్వాలన్నారు. అనంతరం కబడ్డీ పోటీలను ఎంపీ తోట నరసింహం ఆటలు ఆడి పోటీలు ప్రారంభించారు. తొలుత ఆయా కళాశాలల విద్యార్థులు కవాతు నిర్వహించగా ఎంపీ గౌరవ వందనం స్వీకరించారు. నన్నయ్య యూనవర్సిటీ పీడీ ఎ.సత్యనారాయణ, ఏఎంసీ చైర్మ¯ŒS ముత్యాల రాజబ్బాయి, ఎంపీపీ గుడాల రమేష్, కళాశాల కరస్పాండెంట్‌ తాళ్లూరి వీరభద్రరావు, చందలాడ అనంతపద్మనాభం, పీఈటీ వీరయ్యచౌదరి, చదలవాడ బాబి, దోమల గంగాధర్, తుమ్మల రాజా, కౌన్సిలర్లు విజ్జపు రాజశేఖర్, ఆయా కళాశాలల పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement