హోరాహోరీగా టెన్నిస్ పోటీలు
Published Mon, Aug 1 2016 7:09 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM
గుంటూరు స్పోర్ట్స్ : అండర్–14 బాలబాలికల ఐటా టెన్నిస్ టోర్నమెంట్ హోరాహోరీగా సాగుతోంది. టోర్నమెంట్ బాలికల విభాగంలో సెమీ ఫైనల్స్‌కు చేరగా, బాలుర విభాగంలో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరింది. స్థానిక బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ టెన్నిస్ కోర్టులలో ఆదివారం బాలికల విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లలో లేళ్ళ ఆశ్రిత (గుంటూరు) 7–1 స్కోర్‌తో పి.లావణ్య (విజయవాడ)పై విజయం సాధించింది. అలాగే, ఆర్‌ఆర్‌వీ శరణ్య (విశాఖ) 7–5 స్కోర్‌తో ప్రవల్లిక (విజయవాడ)పై, సాత్విక (విశాఖ) 7–0 స్కోర్‌తో ఈషసాయి మండవ (హైదరాబాద్)పై, జ్ఞానిత (విశాఖ) 7–0 స్కోర్‌తో చింత రాగిణి (విశాఖ)పై విజయం సాధించి సెమీ ఫైనల్స్‌కు చేరారు. టెన్నిస్ పోటీలను ఐటా చీఫ్ రిఫరీ శ్రీకుమార్, టెన్నిస్ కోచ్ శివ ప్రసాద్ పర్యవేక్షించారు.
Advertisement