తైక్వాండో పోటీలు ప్రారంభం | taekwondo competition starting | Sakshi
Sakshi News home page

తైక్వాండో పోటీలు ప్రారంభం

Published Sat, Nov 12 2016 9:08 PM | Last Updated on Mon, Sep 4 2017 7:55 PM

taekwondo competition starting

భానుగుడి (కాకినాడ) :
రాష్ట్ర స్థాయి 34వ సబ్‌ జూనియర్, 35వ సీనియర్‌ తైక్వాండో టోర్నమెంట్‌ శనివారం ఘనంగా ప్రారంభమైంది. కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఈ పోటీలను ప్రారంభించారు. కాకినాడలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన తొలిరోజు పోటీల్లో సబ్‌జూనియర్‌ విభాగంలో 13 జిల్లాల నుంచి వచ్చిన 150 మందికిపైగా క్రీడాకారులు తలపడ్డారు.ఆటలో చిన్నారులు చూపించిన పోరాట పటిమ అబ్బురపరిచింది. 
తొలిరోజు విజేతలు వీరే
18 నుంచి 50 కేజీల వరకు ఉన్న సబ్‌ జూనియర్‌ విభాగంలో పోటీలు నిర్వహించారు. 18 కేజీల విభాగంలో ఎల్‌.గౌతమ్‌కృష్ణారెడ్డి, అనంతరపురం)(గోల్డ్‌), వి.లిఖిత్‌ , చిత్తూరు (సిల్వర్‌), 21కేజీల విభాగంలో ఎ¯ŒS.చైతన్య దుర్గాప్రసాద్, విశాఖపట్నం( గోల్డ్‌), బి.జశ్వంత్‌ చిత్తూరు, í(Üసిల్వర్‌), 23 కేజీల విభాగంలో సిహెచ్‌ లోహి™Œ, కర్నూలు (గోల్డ్‌), కె.అవినాష్, విజయనగరం(సిల్వర్‌), 25 కేజీల విభాగంలో జి.దినేష్‌ అదిత్య, తూర్పుగోదావరి(గోల్డ్‌), ఎస్‌.సాయిగణేష్, చిత్తూరు(సిల్వర్‌), 27 కేజీల విభాగంలో దేవ్‌ భరత్‌ సాçహు, శ్రీకాకుళం(గోల్డ్‌), జి.తేజ, తూర్పుగోదావరి(సిల్వర్‌), 29 కేజీల విభాగంలో ఎ¯ŒSఎం దిలీప్, వైఎస్సార్‌ కడప (గోల్డ్‌), రెడ్డి లోవరాజు, విశాఖపట్నం( సిల్వర్‌), 32 కేజీల విభాగంలో బి.కాశీబాబా, వైఎస్సార్‌ కడప, (గోల్డ్‌), ఎస్‌.దేవీ శ్రీ«కర్, గుంటూరు(సిల్వర్‌), 35 కేజీల విభాగంలో ఎం.వెంకట కార్తీక్‌ , విశాఖపట్నం (గోల్డ్‌), సీఎస్‌ సమరత్, చిత్తూరు(సిల్వర్‌), 38 కేజీల విభాగంలో కృష్ణబాబు (వైఎస్సార్‌ స్పోరŠట్స్‌ స్కూల్‌) గోల్డ్, జి.వేద కార్తీక్, కర్నూల్‌(సిల్వర్‌), 41 కేజీల విభాగంలో ఎం.రిషీ చోహాన్, అనంతపూర్‌(గోల్డ్‌), కె.పరశురామ్‌( వైఎస్సార్‌ స్పోరŠట్స్‌ స్కూల్‌), (సిల్వర్‌), 44 కేజీల విభాగంలో రిషప్‌ సింగ్, విశాఖపట్నం (గోల్డ్‌), బద్రీనాధ్, వైఎస్సార్‌ కడప, í(Üసిల్వర్‌), 50 కేజీల విభాగంలో ఆర్‌.యశ్వంత్, విశాఖ పట్నం, (గోల్డ్‌), బి.యశ్వంత్‌ రెడ్డి, తూర్పుగోదావరి(సిల్వర్‌) పతకాలను గెలుచుకున్నట్లు ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బి.అర్జున రావు తెలిపారు. ప్రారంభ కార్యక్రమంలో జిల్లా తైక్వాండో సంఘ అధ్యక్షుడు ఆకుల మధుసూధనరావు, కస్టమ్స్‌ అండ్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ వై.భాస్కరరావు, ప్రొహిబిష¯ŒS అండ్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ ఎం.సత్యనారాయణ, కె.పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement