రేపు ‘సాక్షి’ ముగ్గుల పోటీలు
అనంతపురం కల్చరల్ : తెలుగువారి సంస్కృతికి అద్దం పట్టే సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ దినపత్రిక, ఫర్నీచర్ వరల్డ్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. అనంతపురంలోని కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఉదయం పది గంటలకు ఈ పోటీలు ప్రారంభమవుతాయి. మహిళలలోని సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, సంస్కృతీ సంప్రదాయాలను ఘనంగా చాటేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. విజేతలకు మంచి బహుమతులుంటాయి. ఆసక్తి గల్గిన వారు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు 08554–248896, 9052300933, 9849067681 నంబర్లలో సంప్రదించాలి.