![Bandla Ganesh applies for Malkajgiri Congress ticket for LS polls - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/3/BANDLA%20GANESH.jpg.webp?itok=Xh4RoTLy)
కుమార్‌రావుకు దరఖాస్తు ఇస్తున్న బండ్ల గణేశ్
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ మేరకు పార్టీకి శుక్రవారం ఒక్కరోజే వంద దరఖాస్తులు అందాయి. శుక్రవారం గాం«దీభవన్‌కు వచ్చిన పలువురు నేతలు తమ దరఖాస్తులను అందజేశారు. మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాలకు ఎక్కువ దర ఖాస్తులు రాగా, హైదరాబాద్‌లో తక్కువగా వచ్చా యి.
దరఖాస్తు చేసుకున్న వారిలో సినీ నిర్మాత బండ్ల గణేశ్ (మల్కాజిగిరి), మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, ఆయన కుమార్తె చంద్రప్రియ (నాగర్‌కర్నూల్), ఎంఆర్‌జీ వినోద్‌రెడ్డి, విద్యా స్రవంతి (సికింద్రాబాద్) పెరిక శ్యామ్ (పెద్దపల్లి) తదితరులున్నారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గాలైన వరంగల్, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌తో పాటు జనరల్ స్థానమైన మల్కాజిగిరి కోసం 4 దరఖాస్తులు అందజేశారు. కాంగ్రెస్ ఎంపీ టికెట్ల కోసం ఇప్పటివరకు 141 దరఖాస్తులు రాగా, శనివారం సాయంత్రంతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది.
ఖమ్మం బరిలో గడల, వంకాయలపాటి
హాట్‌సీట్‌గా మారిన ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి టికెట్ కోసం శుక్రవారం ప్రజారోగ్య శాఖ మాజీ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు, ప్రముఖ వ్యాపారవేత్త, వీవీసీ గ్రూపు సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వంకాయల పాటి రాజేంద్రప్రసాద్‌లు దరఖాస్తు చేసు కున్నారు. గడల సికింద్రాబాద్ స్థానానికి కూడా దర ఖాస్తు చేశారు. ప్రభుత్వ అధికారిగా ఉండి, అప్పటి సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి వార్తల్లోకెక్కిన గడల.. అప్పట్లో కొత్తగూడెం అసెంబ్లీ టికెట్ ఆశించారు. కానీ కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. ఇటీవలే రేవంత్ ప్రభుత్వం గడలను ఆ పోస్టు నుంచి బదిలీ చేసింది. ప్రస్తుతం లాంగ్‌లీవ్‌లో ఉన్న ఆయన ఉన్నట్టుండి గాం«దీభవన్‌లో దరఖాస్తులివ్వడం గమనార్హం.
మెజార్టీ స్థానాలు గెలుస్తాం: బండ్ల గణేశ్
మల్కాజిగిరి స్థానం నుంచి పోటీకి అవకాశం కల్పించాలని కోరుతూ టీపీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్‌రావుకు దరఖాస్తు ఇచ్చిన సినీ నిర్మాత బండ్ల గణేశ్ ..విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment