
పెయింటింగ్ వేసి గెలిచిన కోహ్లీ!
మైదానంలో పరుగుల వరద పారిస్తున్న స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ.. తాజాగా చేతికి పని చెప్పాడు. క్రికెట్ ఆడటమే కాదూ కుంచెతో బొమ్మలు గీయడం కూడా వచ్చని నిరూపించాడు. అంతేకాదండోయ్ ఆ పెయింటింగ్ పోటీలో గెలుపొందాడు కూడా. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆటగాళ్లను ఎప్పుడూ ఏదో ఒక ఇంటర్వూ చేసే నేగ్స్ తాజాగా కోహ్లీని ఇంటర్వూ చేశాడు. నేగ్స్ అడిగిన తమషా ప్రశ్నలకు సమాధానం చెప్పిన కోహ్లీ.. పెయింటింగ్ తనకు ఇష్టమని చెప్పుకొచ్చాడు. దాంతో తనతో పెయింటింగ్ వేసి గెలవమని నేగ్స్ కోరడంతో కోహ్లీ స్వయంగా బొమ్మను గీసి నేగ్స్ ని ఓడించేశాడు.
మరి కోహ్లీ పెయింటింగ్ వేసిన వీడియోను ఓ సారి చూసేయండి.