నేను పోటీ కోరుకుంటాను | I wanted to compete - tamanna | Sakshi
Sakshi News home page

నేను పోటీ కోరుకుంటాను

Sep 2 2015 3:08 AM | Updated on Jul 15 2019 9:21 PM

నేను పోటీ కోరుకుంటాను - Sakshi

నేను పోటీ కోరుకుంటాను

నేను పోటీని కోరుకుంటున్నాను. నాకు పలువురు పోటీగా ఉండాలి అంటున్నారు నటి తమన్న.

నేను పోటీని కోరుకుంటున్నాను. నాకు పలువురు పోటీగా ఉండాలి అంటున్నారు నటి తమన్న. ఈ గుజరాతి భామకు కోలీవుడ్‌లో అవకాశాలు రానురాను అంటూనే వరుసగా రావడం విశేషం. ఆ మధ్య తమన్న పని అయిపోయింది అనుకున్న వారి నోళ్లను బాహుబలి మూయించింది. ఇక తమిళంలో వీరం చిత్రం విజయం సాధించినా తమన్నకు చిన్న గ్యాప్ వచ్చింది. ఇటీవల ఆర్యతో నటించిన వాసువుమ్ శరవణనుమ్ ఒన్నా పడిచ్చవంగ చిత్రం విడుదలై సక్సెస్ అనిపించుకుంది. ప్రస్తుతం నాగార్జున కార్తీలతో బెంగళూర్ టైగర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా మిల్కీబ్యూటీ తమన్నను పలకరిస్తూ నటిగా గట్టి పోటీని ఎదుర్కొంటునట్లున్నారే అని అడగ్గా నేనెప్పుడూ పోటీని కోరుకుంటాను. పోటీతోనే ప్రతిభను చాటుకుని ఉన్నత స్థాయికి చేరుకోగలం. ఇంకో విషయం ఏమిటంటే నా చిత్రాల విజయాలకు సంతోషిస్తాను.అయితే నేనొక్కదాన్నే ఇక్కడ ఉండాలని కోరుకోను.

నేనొక్కదాన్నే ఉంటే బోర్. ఇతర హీరోయిన్లు కూడా నాలా ఉండాలనుకుంటాను. బాహుబలి చిత్ర విజ యం చాలా సంతోషాన్ని ఇచ్చింది. బయట ఎక్కడికెళ్లినా అనామిక అంటూ గౌరవిస్తుంటే గర్వంగా ఉంది. ప్రస్తు తం నాగార్జున, కార్తీలతో బెంగాలీ టైగర్ చిత్రంలో నటిస్తున్నాను. ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవం.ప్రతి చిత్రంలోనూ ఒక్కో విషయాన్ని నేర్చుకుం టున్నాను. అయినా ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఇక దక్షిణాది ప్రతిభావంతులైన నటీమణులు చాలా మంది ఉన్నారు. ఇలాంటప్పుడు హీరోయిన్ల మధ్య పోటీ తప్పకుండా ఉంటుంది. అలాంటి పోటీ నే నేను కోరుకుంటాను. పోటీతోనే ఉన్నత స్థాయికి చేరుకోవడం సాధ్యం అన్నది నా భా వన అని తమ్మన అన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement