మిల్క్ బ్యూటీకి మరో మాస్ చిత్రం? | tamanna a mass film Sleeping? | Sakshi
Sakshi News home page

మిల్క్ బ్యూటీకి మరో మాస్ చిత్రం?

Published Tue, Aug 25 2015 2:49 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

మిల్క్ బ్యూటీకి  మరో మాస్ చిత్రం? - Sakshi

మిల్క్ బ్యూటీకి మరో మాస్ చిత్రం?

ఇక నటి తమన్న పనైపోయింది. కోలీవుడ్ ఆమెను పక్కన పెట్టేసింది. టాలీవుడ్, బాలీవుడ్‌ల్లోనూ అదే పరిస్థితి. అజిత్‌తో నటించిన వీరం చిత్రం విజయం సాధించిన తరువాత కూడా ఆ మిల్క్ బ్యూటీ గురించి ఇలాంటి ప్రచారమే జరిగింది. అలాంటి గాలి వార్తల్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్న తమన్న బాహుబలి చిత్రంతో తనలోని ఫైర్ ఏమిటో మరోసారి నిరూపించారు. ఆ తరువాత ఆర్య సరసన వాసువుమ్ శరవణనుమ్ ఒన్నా పడిచవంగ చిత్రంలో నటించారు. ఈ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. ఆపై నాగార్జున, కార్తీలు హీరోలుగా నటిస్తున్న ద్విభాషా చిత్రం దోస్త్(టైటిల్ అధికారికంగా ప్రకటించలేదు)చిత్రంలో నటించే అవకాశం వరించింది. ఇలా వరుసగా చిత్రాలు చేస్తున్న తమన్నకు తాజాగా సంచలన నటుడు శింబుతో రొమాన్స్ చేసే అవకాశం వచ్చినట్లు తెలిసింది.

మూడో సంవత్సరాలు సమస్యల మీద సమస్యలను ఎదురొడ్డి ఇటీవల తెరైపై కొచ్చి విజయాన్ని అందుకున్న వాలు చిత్రం ఇచ్చిన పునరానందంతో ఉన్న నటుడు శింబు ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అచ్చం ఎంబదు మడమయడా చిత్రంతో పాటు సెల్వరాఘవన్ తాజా చిత్రం ఖాన్ లోనూ కథానాయకుడిగా నటిస్తున్నారు. తన చిత్రాల వేగాన్ని పెంచుతానని వాలు చిత్ర సక్సెస్ మీట్‌లో పేర్కోన్న శింబు ఆ దిశగా అడుగులు వేస్తున్నారనిపిస్తోంది. అమీర్ దర్శకత్వంలో నటించడానికి పచ్చజండా ఊపారు. ఇందులో ఆయనకు జంటగా నటి తమన్న నటించనున్నట్లు కోలీవుడ్ సమాచారం. మంచి రోమంటిక్ ప్రేమ కథా చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రానికి మెర్సల్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు, దీనికి ఇప్పటికే అరడజను చిత్రాలతో బిజీగా ఉన్న యువ సంచలన సంగీత దర్శకుడు అనిరుద్ సంగీత బాణీలు అందించనున్నట్లు కోలీవుడ్ టాక్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement