భవిష్యత్తులో భారతదేశం ఎలా ఉండబోతోంది? భారతీయ రైల్వేలు ఎంతలా మారనున్నాయి?.. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలను ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులను వారి అధ్యాపకులు అడుగుతుంటారు. తాజాగా భారతీయ రైల్వే దేశంలోని పాఠశాలల విద్యార్థులకు ఒక పోటీ నిర్వహించబోతోంది.
ఈ పోటీలో పాల్గొనే విద్యార్థులు భావి భారతంపై తమకున్న కలల గురించి చెప్పాలని రైల్వేశాఖ కోరింది. ఇందుకోసం భారతీయ రైల్వే ఒక ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 4000 పాఠశాలల నుంచి 4 లక్షల మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొననున్నారు.
భావి భారతం ఎలా ఉండబోతోంది? రైల్వేల భవిష్యత్ ఎలా ఉండనుందనే దానిపై విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, కవితా రచన తదితర పోటీలు నిర్వహించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. పోటీలో ప్రతిభ కనబరిచిన 50 వేల మంది విద్యార్థులకు అవార్డులు, సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫిబ్రవరి 26న దేశంలోని అన్ని డివిజన్లలోని 2000 రైల్వే స్టేషన్లలో పోటీ నిర్వహించనున్నామని, పోటీలు జరిగే సమయంలో ప్రధాని స్వయంగా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారని రైల్వే అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment