
‘‘చలనచిత్ర వాణిజ్య మండలి (తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్) ఎన్నికల్లో అధ్యక్షునిగా, ప్యానల్ సభ్యులుగా నిజాయతీగా సేవ చేసేవాళ్లను ఎన్నుకోండి’’ అని నిర్మాత సి. కల్యాణ్ అన్నారు. ఈ నెల 30న చలనచిత్ర వాణిజ్య మండలి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షునిగా పోటీ చేస్తున్న సి. కల్యాణ్ తన ప్యానల్ సభ్యులతో కలిసి మాట్లాడుతూ– ‘‘గతంలో నేను పో టీ చేయాలనుకున్నప్పుడు కొందరు నిర్మాతలు ‘యూఎఫ్‌ఓ, క్యూబ్’ వంటి డిజిటల్ ఛార్జీల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెబితే విరమించుకున్నాను. కానీ, వాళ్లు సభ్యుల శ్రేయస్సు కోసం కృషి చేయలేదు. అందుకే.. అందరికీ మంచి చేయాలనే ఆశయంతో పో టీ చేస్తున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment