Commerce
-
చిన్న రైతులకు అ‘ధన’పు తోడ్పాటు
చిన్న, సన్నకారు రైతులు పండించిన ధాన్యానికి అనదపు విలువను జోడిస్తూ వ్యవసాయాన్ని మరింత లాభదాయకం చేయడంలో కృషి చేస్తోంది దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రెయిన్ కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన ‘ఆర్య.ఏజీ’. తాజాగా రిత్ సమ్మిట్ 2.0 పేరుతో 200 రైతు ఉత్పత్తిదారుల సంస్థలను (FPO) మరింత ఆకర్షణీయమైన, లాభదాయక సంస్థలుగా మార్చేందుకు శ్రీకారం చుట్టింది. సాంకేతిక సహకారంతో సాగు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తూ, లాభదాయకమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ రైతు ఉత్పత్తిదారుల సంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చొరవను ప్రారంభించింది.ఈ నేపథ్యంలో రైతులకు ఉత్పత్తుల నిల్వ, మార్కెట్‌తో పాటు రుణ సౌకర్యం కల్పిస్తున్న ఆర్య.ఏజీ సంస్థ ఎలా ఏర్పాటైంది.. రైతులకు ఎలాంటి సేవలు అందిస్తోంది.. టెక్నాలజీ పరంగా పెరిగిన సౌలభ్యాలు.. తదితర అంశాలపై సాక్షి బిజినెస్ వెబ్ డెస్క్ ఆర్య.ఏజీ మేనేజింగ్ డైరెక్టర్ చట్టనాథన్ దేవరాజన్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా వారు వెల్లడించిన పలు ఆసక్తికర విషయాలను ఇక్కడ మీ కోసం అందిస్తున్నాం.సాక్షి: ఆర్య.ఏజీ ఎలా ఏర్పాటైంది?నాథన్: నేను, ప్రసన్నరావు, ఆనంద్ చంద్ర అనే మరో ఇద్దరితో కలిసి ఆర్య.ఏజీని ప్రారంభించాం. మొదట నష్టాల్లో ఉన్న ఆర్య కొలేటరల్స్ అనే సంస్థను కొనుగోలు చేశాం. తర్వాత దీన్ని ఆర్య.ఏజీ పేరుతో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రెయిన్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌గా తీర్చిదిద్దాం.సాక్షి: ఆర్య.ఏజీ ఎలా పని చేస్తుంది?నాథన్: మా సంస్థ ప్రధానంగా మూడు విభాగాలుగా పనిచేస్తుంది. ఆర్య.ఏజీ కింద ఆర్య కొలేటరల్ వేర్‌హౌసింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్యధన్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్యటెక్ ప్లాట్‌ఫారమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ విభాగాలు ఉన్నాయి. ఈ మూడింటినీ సమ్మిళితం చేసి రైతులకు సేవలు అందిస్తున్నాం.సాక్షి: రైతులకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు?నాథన్: దేశంలో అత్యధికమంది చిన్న, సన్నకారు రైతులే. వీరికి ప్రధాన సమస్య దిగుబడిని నిల్వ చేయడం. ప్రధానంగా ఈ సమస్యను పరిష్కరించడం కోసం వేర్‌హౌస్‌లను నిర్వహిస్తున్నాం. దీంతో పాటు వారికి దిగుబడులకు మార్కెటింగ్ కల్పిస్తున్నాం. ఈలోపు అవసరమున్న రైతులకు దిగుబడులపై రుణ సదుపాయం కూడా కల్పిస్తున్నాం.సాక్షి: ఎలాంటి దిగుబడులకు స్టోరేజ్ కల్పిస్తున్నారు.. సామర్థ్యం ఎంత?నాథన్: మాది ప్రధానంగా గ్రెయిన్ కామర్స్ ప్లాట్‌ఫామ్. అంటే అన్ని రకాల ధాన్యం దిగుబడులకు స్టోరేజ్, మార్కెటింగ్, ఫైనాన్స్ సౌకర్యం కల్పిస్తున్నాం. సీజన్‌ను బట్టి దేశవ్యాప్తంగా 3000 వేర్‌హౌస్‌లను నిర్వహిస్తున్నాం. 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులకు స్టోరేజ్ సదుపాయం కల్పిస్తున్నాం.సాక్షి: ఎక్కడెక్కడ మీ కార్యకలాపాలు ఉన్నాయి?నాథన్: కొన్ని ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. స్థానిక సంస్థలు, ప్రభుత్వాల సహకారంతో రైతులకు సేవలు అందిస్తున్నాం. -
CJI DY Chandrachud: న్యాయం, వైద్యం... అత్యంత ఖరీదు!
చండీగఢ్: ‘‘వైద్య, న్యాయ వృత్తుల రెండింటి లక్ష్యమూ ఒక్కటే. అంకితభావంతో కూడిన సేవ ద్వారా వ్యక్తులకు, సమాజానికి హితం చేకూర్చడం. సంక్షేమమే వాటి మూలసూత్రం. కానీ, సమాజ హితానికి పాటుపడేందుకే పుట్టుకొచి్చన అతి కీలకమైన ఆ రెండు రంగాలూ నేడు అదే సమాజానికి అందుబాటులో లేకుండా పోవడం ఆశ్చర్యకరం’’ అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆవేదన వెలిబుచ్చారు. ముఖ్యంగా ప్రైవేట్ రంగం రాకతో 1980ల నుంచి భారత్‌లో వైద్యం బాగా వ్యాపారమయంగా మారిపోయిందన్నారు. ‘‘పలు ఔషధాల ఖరీదు భరించలేనంతగా పెరిగిపోయింది. గ్రామీణుల ఆదాయంలో ఏకంగా 77 శాతం, పట్టణ ప్రాంతాల్లో 70 శాతం వైద్య ఖర్చులకే పోతోంది’’ అని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా వైద్య కళాశాలు చూడాల్సిన అవసరముంది. ఇది వాటి సామాజిక బాధ్యత కూడా’’ అని హితవు పలికారు. శనివారం చండీగఢ్‌లో పీజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 37వ స్నాతకోత్సవంలో సీజేఐ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువ వైద్యులను ఉద్దేశించి ప్రసంగించారు. రోగుల పట్ల దయ, సహానుభూతి ఉండాలని వారికి ఉద్బోధించారు. ‘‘భారత్ ఇన్నొవేషన్ల కేంద్రంగా మారడం అభినందనీయం. కానీ వాటి ఫలాలు అతి కొద్దిమందికే పరిమితం అవుతుండటం బాధాకరం. కనుక వైద్య రంగంలో కీలక పరిశోధనలకు యువ డాక్టర్లు శ్రీకారం చుట్టాలి’’ అని ఆకాంక్షించారు. టెక్నాలజీ వాడకం పెరగాలి టెక్నాలజీ ద్వారా కోర్టుల పనితీరులో జవాబుదారీతనం పెరగడమే గాక న్యాయప్రక్రియ ప్రజలకు మరింత చేరువవుతుందని సీజేఐ అభిప్రాయపడ్డారు. ‘‘పారదర్శకత, ప్రజాస్వామ్యం, అందరికీ సమన్యాయం వంటి విలువల పరిరక్షణకు టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతోంది. కక్షిదారులు కూడా ఉన్నచోటి నుంచే వారి కేసుల విచారణను ప్రత్యక్షంగా వీక్షించే వీలు కలి్పస్తోంది’’ అని చెప్పారు. గత నాలుగేళ్లలో సుప్రీంకోర్టు ఏకంగా 8 లక్షలకు పైగా కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిందని గుర్తు చేశారు. పెండింగ్ భారాన్ని తగ్గించేందుకు కోర్టుల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరముందన్నారు. -
ఫ్రెషర్లకు పెరిగిన ఉద్యోగ అవకాశాలు
హైదరాబాద్: ఫ్రెషర్లకు ఉద్యోగ అవకాశాలు గతేడాది ద్వితీయ ఆరు నెలల (జూలై–డిసెంబర్) కాలంలో 3 శాతం పెరిగాయి. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో ఫ్రెషర్ల నియామకాలు 62 శాతంగా ఉంటే, తర్వాతి ఆరు నెలల్లో 65 శాతంగా ఉన్నట్టు టీమ్‌లీజ్ ఎడ్టెక్ తెలిపింది. కెరీర్ అవుట్‌లుక్ రిపోర్ట్ హెచ్‌వై2, 2023 నివేదికను విడుదల చేసింది. అలాగే అన్ని విభాగాల్లోనూ నియామకాల ఉద్దేశ్యం కూడా 68 శాతం నుంచి 73 శాతానికి పెరిగింది. ఈ స్థిరమైన వృద్ది రానున్న నెలల్లో ఉద్యోగ మార్కెట్ వృద్ధికి, ఫ్రెషర్ల ఉపాధికి దారితీస్తుందని ఈ నివేదిక అంచనా వేసింది. ఫ్రెషర్లకు (విద్య అనంతం ఉపాధి మార్కెట్లోకి వచ్చిన వారు) సంబంధించి అత్యధికంగా నియామకాల ఉద్దేశ్యం ఈ కామర్స్, టెక్నాలజీ స్టార్టప్‌లలో 59 శాతం, టెలీ కమ్యూనికేషన్స్‌లో 53 శాతం, ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాలో 50 శాతం చొప్పున నమోదైంది. కానీ, ఐటీ పరిశ్రమలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది. ఫ్రెషర్ల నియామక ఉద్దేశ్యం 2023 మొదటి ఆరు నెలల్లో 67 శాతంగా ఉంటే, ద్వితీయ ఆరు నెలల్లో 49 శాతానికి తగ్గింది. అంటే 18 శాతం క్షీణత కనిపించింది. ట్రావెల్, హాస్పిటాలిటీ రంగంలో నియామకాల ధోరణి 5 శాతం పెరిగింది. వీరికి డిమాండ్.. డెవలప్మెంట్ ఆపరేషన్స్ ఇంజనీర్, చార్టర్ అకౌంటెంట్, ఎస్ఈవో అనలిస్ట్, యూఎక్స్ డిజైనర్లకు డిమాండ్ ఎక్కువగా కనిపించింది. ఇతర పట్టణాల కంటే బెంగళూరు ఫ్రెషర్ల నియామకాల పరంగా ముందుంది. నియామకాల ఉద్దేశ్యం 65 శాతంగా నమోదైంది. 2023 మొదటి ఆరు నెలలతో పోలిస్తే ద్వితీయ ఆరు నెలల్లో 10 శాతం తగ్గినప్పుటికీ ముందు స్థానంలో ఉంది. ఆ తర్వాత ముంబైలో 61 శాతం, చెన్నైలో 47 శాతం, ఢిల్లీలో 43 శాతం చొప్పున నమోదైంది. కొత్త నిపుణులకు డిమాండ్ స్వల్పంగా పెరిగింది. వీటిపై దృష్టి పెట్టాలి.. ఫ్రెషర్లు తమ ఉద్యోగార్హతలు పెంచుకునేందుకు వీలుగా కొన్ని కోర్సులకు డిమాండ్ ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ కమ్యూనికేషన్, డేటా సైన్స్, బ్లాక్‌చైన్‌లో సర్టిఫికేషన్, ఆర్టిఫీషియల్ లెన్నింగ్ (ఏఐ), మెషిన్ లెన్నింగ్ (ఎంఎల్)లో పీజీ కోర్స్‌లకు డిమాండ్ ఉందని పేర్కొంది. డిగ్రీ అప్రెంటిస్‌లను నియమించుకునే విషయంలో తయారీ, ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా, విద్యుత్, ఇంధన రంగాలు టాప్–3గా ఉన్నాయి. -
మంచి చేయడానికే పోటీ చేస్తున్నా
‘‘చలనచిత్ర వాణిజ్య మండలి (తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్) ఎన్నికల్లో అధ్యక్షునిగా, ప్యానల్ సభ్యులుగా నిజాయతీగా సేవ చేసేవాళ్లను ఎన్నుకోండి’’ అని నిర్మాత సి. కల్యాణ్ అన్నారు. ఈ నెల 30న చలనచిత్ర వాణిజ్య మండలి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షునిగా పోటీ చేస్తున్న సి. కల్యాణ్ తన ప్యానల్ సభ్యులతో కలిసి మాట్లాడుతూ– ‘‘గతంలో నేను పో టీ చేయాలనుకున్నప్పుడు కొందరు నిర్మాతలు ‘యూఎఫ్ఓ, క్యూబ్’ వంటి డిజిటల్ ఛార్జీల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెబితే విరమించుకున్నాను. కానీ, వాళ్లు సభ్యుల శ్రేయస్సు కోసం కృషి చేయలేదు. అందుకే.. అందరికీ మంచి చేయాలనే ఆశయంతో పో టీ చేస్తున్నాను’’ అన్నారు. -
వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం ఛైర్మన్‌గా విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం ఛైర్మన్‌గా ఎంపీ విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. 31 మంది ఎంపీలతో కమిటీ ఏర్పాటైంది. రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యునిగా ఎంపీ మోపిదేవి వెంకటరమణ నియమితులయ్యారు. చదవండి: రేపు అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు -
ఎగుమతులు 48.34% అప్
న్యూఢిల్లీ: ఏడు నెలల వరుస పురోగతిని కొనసాగిస్తూ, భారత్ ఎగుమతులు జూన్‌లో 48.34 శాతం పెరిగి 32.50 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక దిగుమతులు ఇదే నెల్లో 98 శాతం ఎగసి 41.87 బిలియన్ డాలర్లకు ఎగశాయి. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 9.37 బిలియన్ డాలర్లకు చేరింది. వాణిజ్య మంత్రిత్వశాఖ గురువారం వెలువరించిన గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే.. ► పెట్రోలియం పొడక్టులు, రత్నాలు–ఆభరణాలు, రసాయనాలు, తోలు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు జూన్‌లో గణనీయంగా పెరిగాయి. ► దిగుమతుల్లో ఒక్క చమురును చూస్తే, ఈ విలువ 10.68 బిలియన్ డాలర్లుగా ఉంది. 2020 జూన్‌తో పోల్చితే (4.93 బిలియన్ డాలర్లు) ఇది 116.51 శాతం అధికం. ► పసిడి దిగుమతులు 60 శాతం పెరిగి 970 మిలియన్ డాలర్లకు చేరాయి. మొదటి త్రైమాసికంలో ఇలా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఏప్రిల్–జూన్ మధ్య ఎగుమతుల విలువ 86 శాతం పెరిగి 95.39 బిలియన్ డాలర్లకు పెరిగింది. దిగుమతులు 126.15 బిలియన్ డాలర్లకు (గత ఏడాది ఇదే కాలంలో 60.44 బిలియన్ డాలర్లు)ఎగసింది. వెరసి వాణిజ్యలోటు 30.75 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ఒక్క చమురు దిగుమతులు సమీక్షా కాలంలో 13 బిలియన్ డాలర్ల (2020 ఏప్రిల్–జూన్) నుంచి 31 బిలియన్ డాలర్లకు ఎగశాయి. -
కామర్స్ చదివి వైద్యులకు బోధిస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: కామర్స్ చదువుకొని వైద్యులు, వైద్య నిపుణులకు కరోనా చికిత్స ఎలా చేయాలో బోధిస్తారా అంటూ పిటిషనర్‌పై సుప్రీంకోర్టు ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ నిర్ధారణకు చేయాల్సిన పరీక్షలు, చికిత్సకు సంబంధించిన అంశాలు సూచిస్తూ వాటిపై ఆదేశాలు ఇవ్వాలంటూ కోల్‌కతాకు చెంది న సురేష్ షా అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా మీరు వైద్యులా.. కోవిడ్‌పై మీకున్న జ్ఞానం ఏంటి అని పిటిషనర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. శాస్త్రీయ పత్రాల ఆధారంగా పిటిషన్ దాఖలు చేశానని పిటిషనర్ తెలిపారు. ఇలాంటి పనికిమాలిన పిటిషన్లు వేయడమే మీ పనా అని ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టుకు వెళ్లకుండా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారు. వర్చువల్ హియరింగ్ కాబట్టి ఎలాంటి ఖర్చులేదు. ఈ తరహా పిటిషన్‌తో కోర్టు సమయం వృథా చేసినందుకు రూ.లక్ష జరిమానా విధించాలనుకుంటున్నాం అని ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్ తాను నిరుద్యోగినని పేర్కొనగా రూ.1000 జరిమానా విధించిన ధర్మాసనం పిటిషన్ కొట్టివేసింది. చదవండి: సెకండ్ వేవ్: ఒక్కరోజే 4 లక్షల కరోనా కేసులు -
సైన్స్‌లో సోనాలి కామర్స్‌లో సుగంధ ఆర్ట్స్‌లో భారతి
ఇంటర్ పరీక్షల నిర్వహణలో బిహార్ బోర్డు ఈసారి అన్ని రాష్ట్రాల కన్నా ముందుంటే, బిహార్ పరీక్షా ఫలితాల్లో అమ్మాయిలు ముందున్నారు. అమ్మాయిలు ముందుండటం అన్నీ రాష్ట్రాల్లోనూ యేటా అదొక సంప్రదాయంగా వస్తున్నప్పటికీ, కరోనా పరిస్థితుల్లో మనోబలాన్ని సడలనివ్వకుండా చక్కగా చదివి.. ఆర్ట్స్, కామర్స్, సైన్స్.. ఈ మూడు స్ట్రీమ్‌లలోనూ అమ్మాయిలే టాపర్లుగా నిలవడం విశేషం. సైన్స్‌లో సొనాలి కుమారి 94.2 శాతం మార్కులతో స్టేట్ ఫస్ట్ వచ్చింది. సైన్సే కష్టం అనుకుంటే, ఆమె కుటుంబ పరిస్థితులు ఇంకా కష్టమైనవి. రెండు కష్టాల మధ్య విజేతగా చదువును లాక్కొచ్చొని సొనాలి తండ్రి రిక్షా పుల్లర్! సోనాలికి స్వీట్ తినిపిస్తున్న కుటుంబ సభ్యులు. చిత్రంలో జీత్ సార్, సోనాలి తల్లిదండ్రులు (కుడి చివర) మార్చి 26 శుక్రవారం బిహార్ ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలు వెల్లడయ్యాయి. మూడు విభాగాల్లో టాపర్‌గా విజయ కేతనాన్ని ఎగరేసిన వారు ముగ్గురూ అమ్మాయిలే! బిహార్‌లోని ఖగరియాకు చెందిన మధు భారతి 92.6 శాతం మార్కులతో ఆర్ట్స్‌లో, ఔరంగాబాద్‌కు చెందిన సుగంధ కుమారి 94.2 శాతం మార్కులతో కామర్స్‌లో స్టేట్ టాపర్లుగా నిలిచారు. సైన్స్‌లో టాప్ ర్యాంక్ కొట్టిన సోనాలి 500 కు 471 మార్కులు సాధించి తండ్రి కష్టానికి తగ్గ ఫలితాన్ని సాధించింది. సోనాలి నలందలోని శ్రీమతి పరమేశ్వరీ దేవి ఉఛ్తార్ మాధ్యమిక పాఠశాల విద్యార్థిని. బిహార్ ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 13 వరకు జరిగాయి. మొత్తం 13.4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వాళ్లల్లో 10.45 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణశాతం 78.04. ఆ శాతం కంటే కూడా ఈ ముగ్గురు అమ్మాయిలు వ్యక్తిగతంగా సాధించిన శాతమే ఎక్కువ. ముగ్గురూ 90 అంకెను దాటేశారు. సోనాలి చదివిన పాఠశాలకు సమీపంలో బిహార్ షరిఫ్ అనే ప్రాంతంలో ఒక బస్టాండ్ ఉంది. ఆ బస్టాండ్‌లోనే తోపుడు బండిపై తినుబండారాలను అమ్ముతారు సోనాలి తండ్రి చున్నులాల్. ఆ సంపాదనే వారి కుటుంబానికి జీవనాధారం. ఓపిక ఉన్నప్పుడు ఆయన రిక్షాబండి లాగుతారు. గత ఏడాది లాక్డౌన్ అన్ని బతుకు బండ్ల ఇరుసులను లాగేసినట్లే సోనాలి తండ్రి జీవికనూ కనాకష్టం చేసేసింది. మరో వైపు సోనాలి పంతం పట్టినట్టుగా చదివింది. లాక్డౌన్ సమయం మొత్తాన్ని చదువుకే అంకితం చేసింది. ‘‘నాన్న కష్టపడేవారు. జీత్ సర్ కష్టపడి నన్ను చదివించేవారు. అమ్మ కష్టపడి నాకు అన్నీ అమర్చేది. జీత్ సార్ టెన్త్‌లో కూడా దగ్గరుండి మరీ నా డౌట్లు తీర్చేవారు. లాక్డౌన్లో సార్ మా ఇంటికే వచ్చి నాకు సబ్జెక్ట్‌లు టీచ్ చేసేవారు. ఆన్ లైన్ స్టడీస్ కోసం అప్పుడప్పుడు తన సెల్‌ఫోన్‌ను నాకు ఇచ్చేవారు. అమ్మ ఎప్పుడూ నా ఆకలిని కనిపెట్టుకుని ఉండేది. ఇంతమంది పడిన కష్టం మందు నేను ర్యాంకు సాధించడం పెద్ద విషయం కాదు అనిపిస్తుంది నాకు’’ అంటోంది సోనాలి! జీత్సార్కి, అమ్మకు నాన్నకు థ్యాంక్స్ చెబుతోంది. సోనాలి ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ అవాలని కలగంటోంది. ‘‘భవిష్యత్తులో యు.పి.ఎస్.సి. పరీక్షకు ప్రిపేర్ అవుతాను. నాకెప్పుడూ సమాజానికి, పేదవాళ్లకు సాయం చేయాలని ఉంటుంది. నాలా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం కూడా ఐ.ఎ.ఎస్. అధికారిగా నేను తప్పకుండా ఏదైనా చేసి తీరుతాను. ప్రతి విద్యార్థిలో ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభ వెలుగులోకి రాకుండా పేదరికం అడ్డుపడుతుంటుంది. కడుపులో పేగుల్ని ఆకలి మెలిపెడుతుంటే పుస్తకం ముందేసుకుని చదవగలడం కూడా ఆ పూటకు సాధించిన ర్యాంకే నా దృష్టిలో..’’ అంటోంది సోనాలి. -
ఈ కామర్స్ నియంత్రణకు నిబంధనలు
జెనీవా: భారత ఈ కామర్స్ రంగ నియంత్రణ కోసం నిబంధనలను రూపొందించే పని జరుగుతోందని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ తెలిపారు. ఈ కామర్స్ రంగం 2020 నాటికి 120 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఈ కామర్స్ రంగం ఏటా 51 శాతం మేర వృద్ధి చెందుతున్నప్పటికీ, డిజిటల్ మార్కెట్లకు సంబంధించిన చట్టాలను ఇంకా రూపొందించాల్సి ఉందన్నారు. వాణిజ్యం, అభివృద్ధిపై జెనీవాలో జరిగిన మూడో ఇంటర్ గవర్నమెంటల్ నిపుణుల బృందం సమావేశంలో పాశ్వాన్ మాట్లాడారు. అంతర్జాతీయ సరఫరా చైన్ల అవతరణ, వాణిజ్య అడ్డంకులు తగ్గిపోవడం, అంతర్జాతీయ వాణిజ్యం పెరగడం, ఈ కామర్స్ వేగవంతమైన విస్తరణతో కొత్త తరహా అనైతిక వ్యాపార ధోరణులకు ముప్పు పెరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వినియోగదారుల రక్షణ కోసం డైరెక్ట్ సెల్లింగ్ నియంత్రణకు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసిందని, ఈ కామర్స్ రంగానికి నిబంధనలను తీసుకొచ్చే పని జరుగుతోందని చెప్పారు. -
ఎగుమతుల మార్కెట్ లో మన వాటాను కాపాడుకోవాలి!
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యూఢిల్లీ: ప్రపంచ వాణిజ్యంలో భారత్ తొలుత తన ఎగుమతుల వాటాను పరిరక్షించుకోడానికి కృషి చేయాలని, అటు తర్వాత వృద్ధిపై దృష్టి పెట్టాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం పేర్కొన్నారు. భారత ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) స్వర్ణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రణబ్ ముఖర్జీ ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. వివిధ మార్పులకు గురవుతున్న ఎగుమతుల రంగంలో మన వాటా పరిరక్షణకు విభిన్న వ్యూహాలను అవలంభించాల్సి ఉంటుందని అన్నారు. ధర, నాణ్యతా ప్రమాణాలు, ఒప్పందాలు, మౌలిక రంగం పురోగతి, నిబంధనల సరళీకరణ, తగిన ఆర్థిక సౌలభ్యత వంటి పలు అంశాలు ఇందులో ఇమిడి ఉంటాయని పేర్కొన్నారు. మందగమనంలో కేవలం 2.8 శాతం వృద్ధి సాధిస్తున్న ప్రపంచ వాణిజ్య విపణిలో భారత్ తన వాటాను కాపాడుకోవడంపైనే తక్షణం దృష్టి పెట్టాలన్నారు. 16 నెలలుగా భారత్ ఎగుమతుల్లో అసలు వృద్ధి నమోదుకాకపోగా... క్షీణత నెలకొన్న సంగతి తెలిసిందే. దిగుమతుల బిల్లు తగ్గడం తగిన కరెంట్ అకౌంట్‌లోటు కొనసాగడానికి కారణమని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి వార్షిక ఎగుమతుల అవార్డులు ‘నిర్యాత్ శ్రీ’, ‘నిర్యాత్ బంధు’లను పలువురికి ప్రదానం చేశారు. -
ఈ -కామర్స్ విక్రయాలపై పన్ను
తమిళనాడు, కేరళ తరహాలో వ్యాట్ రిఫండ్ విధానం సాక్షి, హైదరాబాద్: దేశంలో ఈ-కామర్స్ పేరుతో ఆన్లైన్ అమ్మకాలు విపరీ తంగా పెరుగుతున్నందున తెలంగాణ రాష్ట్రంలో అమ్ముడయ్యే వస్తువులపై పన్ను విధించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. వేలకోట్ల విలువైన ఉత్పత్తులు ఆన్లైన్లో అమ్ముడవుతుండడంతో ప్రభుత్వానికి రావాల్సిన పన్ను రావడంలేదు. ఎక్కడ వస్తువులను పంపిణీ చేస్తారో అక్కడ పన్ను వసూలు చేసేం దుకు సర్కార్ సిద్ధం అవుతోంది. తద్వారా భారీగా ఆదాయం సమకూరుతుం దని ఆర్థికశాఖ అంచనా వేసింది. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి కమిటీ చేసిన సిఫారసులను అమలు చేయనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. వాటిలో ముఖ్యమైనవి ఇలా ఉన్నాయి... వ్యాపారులకు వ్యాట్ తిరిగి చెల్లింపు(రిఫండ్) నిబంధనలు మార్చాల్సిన అవసరముంది. దీన్ని కర్నాటక, తమిళనాడులో ఉన్నట్టే ఇక్కడ అమలు చేయాలి. వ్యాట్ రిఫండ్‌పై తనిఖీ విధానం సరిగా లేదు. వ్యాపారులు ఇచ్చిన సమాచారంపై ఆధారపడకూడదు. గతంలో ఐదేళ్ల పన్ను రాయితీ పొందిన సంస్థలు, పరిశ్రమలు ఆ తరువాత చెల్లిస్తున్న పన్ను ఎంతో అంచనా వేయాలి. పన్ను రాయితీ సమయంలో ఉత్పత్తి, అమ్మకాలను సరిపోల్చుకోవాలి. కల్లు దుకాణాలతో ఏటా దాదాపు వెయ్యికోట్ల ఆదాయం తగ్గుతుంది. నష్టాన్ని తగ్గించుకునేందుకు కల్లు దుకాణాల ఏర్పాటు, చెట్లసంఖ్యను అంచనా వేయాలి. అక్రమమద్యాన్ని అరికట్టడానికి నల్లబెల్లంపై గట్టినిఘా పెట్టాలి. విలాస, వినోద రంగాల నుంచి వస్తున్న పన్నును పునఃపరిశీలించాలి. కేంద్ర అమ్మకం పన్నులపై నష్టపరిహారం రాబట్టుకోవడానికి ఒత్తిడి తేవాలి. రిజిస్ట్రేషన్‌కు అర్హత ఉన్నా, అలాచేయకుండా ఒప్పందాలతో నడిచే వాటిని రిజిస్ట్రేషన్ల పరిధిలోకి తేవాలి. దీనికి స్పెషల్ సెల్స్‌ను ఏర్పాటు చేయాలి. రవాణా, సరకురవాణా వాహనాలపై విధిస్తున్న పన్నులో జీవితకాలపన్ను లేదా మూడు నెలలకోమారు విధిస్తున్న పన్ను ఏది మంచిదో పరిశీలించాలి. కర్నాటక, మహారాష్ట్రలో అమలు అవుతున్న విధానాన్ని పరిశీలించాలి. -
పల్లె అల్లం... పట్నం బెల్లం!
* ప్రాంతాల్లోని కళాశాలల్లో చదివేందుకు విముఖత * నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని కళాశాల్లో చేరేందుకు ఆసక్తి * ఎంబీయే చదువు కోసం ఢిల్లీ, ఎన్సీఆర్కే మొదటి ఓటు * తర్వాతి స్థానాల్లో బెంగళూరు, పుణే, ముంబై నగరాలు న్యూఢిల్లీ: ఉపాధి కోసమే కాదు.. చదువుకునేందుకు కూడా జనం ఇప్పుడు పట్నంబాట పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కళాశాలలు ఉన్నా పట్టణాలు, నగరాల్లోని కళాశాలల్లో చేరేందుకు అమితాసక్తిని కనబరుస్తున్నారు. ప్రాంతీయ అసమానతలను రూపుమాపేందుకు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నా వాటిలో చేరేందుకు విద్యార్థులు పెద్దగా ఇష్టపడడం లేదు. పట్టణాలు, నగరాల్లోని కళాశాలల్లో సరైన సదుపాయాలు, బోధించే ఉపాధ్యాయులు లేకపోయినా అందులోనే చేరుతున్నారు. ప్రతి వంద మంది విద్యార్థుల్లో 66 మంది పట్టణాల్లో చదివేందుకే ప్రాధాన్యతనిస్తున్నారని శిక్షా డాట్ కామ్ సంస్థ నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని స్పష్టం చేసింది. సర్వే ద్వారా వెల్లడైన వివరాల్లోకెళ్తే... రాజధాని రమ్మంటోంది... సాంకేతిక విద్య బాటపట్టే విద్యార్థులు... ప్రత్యేకించి ఎంబీఏ చదవాలనుకుంటున్న విద్యార్థుల్లో ఎక్కువమంది ఢిల్లీ, రాజధాని ప్రాదేశిక ప్రాంతం(ఎన్సీఆర్)లోని కళాశాల్లో చేరేందుకే తొలి ప్రాధాన్యతనిస్తున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 21.1 శాతం మంది విద్యార్థులు ఎంబీఏ చదివేందుకు ఢిల్లీ, ఎన్సీఆర్కే తొలి ప్రాధాన్యతనిచ్చారు. ఆ తర్వాత 17.58 శాతం మంది బెంగళూరు కళాశాలలకు, 10.63 మంది పుణే కళాశాలలకు, 8.4 శాతం మంది ముంబైలోని కాలేజీలకు తమ ఓటు వేశారు. అనేక కారణాలు... రాజధాని ఢిల్లీలోని కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు తొలి ప్రాధాన్యత ఇవ్వడానికి అనేక కారణాలున్నాయని శిక్షా డాట్ కామ్ బిజినెస్ హెడ్ మనీశ్ ఉపాధ్యాయ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... గ్రామీణ ప్రాంతాల్లోని కళాశాల్లో సరైన వసతులు లేకపోవడం, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు అంతగా అందుబాటులోకి లేకపోవడం వంటివి విద్యార్థులను హస్తినవైపు చూసేలా చేస్తున్నాయన్నారు. రాజధానిలో అయితే ఉద్యోగం చేసుకుంటూ కూడా చదువుకునే అవకాశముందనే అభిప్రాయాన్ని కూడా చాలా మంది వ్యక్తం చేశారన్నారు. అంతేకాక తామ చదువుతున్న కోర్సుకు సంబంధించి కోచింగ్ వంటివి అందుబాటులో ఉన్నాయని, అదే ఇతర ప్రాంతాల్లో కష్టమేనని చెబుతున్నారు. ఇంజ నీరింగ్ విద్యార్థులేకాదు ఆర్ట్స్, సైన్స్, కామర్స్, డిజైన్ అండ్ మాస్ కమ్యూనికేషన్ చదువుతున్న విద్యార్థులు కూడా ఇదే అభిప్రాయంతో ఢిల్లీ, ఎన్సీఆర్లోని కళాశాలల్లో చేరామన్నారు. -
సరైన సాధనతో విజయ శిఖరాలకు..!
చార్టర్డ్ అకౌంటెంట్‌గా స్థిరపడాలని కోరుకునే వారు కొందరు.. కంపెనీ సెక్రటరీ కొలువును చేజిక్కించుకోవాలనుకునే వారు మరికొందరు.. వీరి లక్ష్యాల సాధనకు మార్గాన్ని సుగమం చేసే సబ్జెక్టులు.. సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. ఇవి గ్రూపు సబ్జెక్టులుగా ఉన్న సీఈసీని అధిక మార్కులతో దిగ్విజయంగా పూర్తిచేసి సుస్థిర వృత్తి జీవితం వైపు అడుగులు వేయొచ్చు. ఈ నేపథ్యంలో ఇంటర్ సెకండియర్ సీఈసీ ప్రిపరేషన్ ప్రణాళిక.. సివిక్స్ సీనియర్ ఇంటర్ సివిక్స్ పాఠ్య ప్రణాళికలో భారత రాజ్యాంగం, భారత ప్రభుత్వం, పరిపాలన అంశాలు ఉన్నాయి. సిలబస్‌లో ఎనిమిది యూనిట్లు ఉన్నాయి. ప్రశ్నపత్రం: *** సివిక్స్‌కు 100 మార్కులు కేటాయించారు. ప్రశ్నపత్రం మూడు విభాగాలుగా ఉంటుంది. *** సెక్షన్-ఎలో ఐదు వ్యాసరూప ప్రశ్నలుంటాయి. వాటిలో మూడింటికి సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 10 మార్కులు. *** సెక్షన్-బిలో 12 ప్రశ్నలుంటాయి. వాటిలో 8 ప్రశ్నలకు కనీసం 20 పంక్తుల్లో సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 5 మార్కులు. *** సెక్షన్-సిలో 20 ప్రశ్నలు ఇస్తారు. వాటిలో 15 ప్రశ్నలకు కనీసం 5 పంక్తుల్లో సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. వ్యాసరూప ప్రశ్నలకు ముఖ్యమైనవి: 1. భారత రాజ్యాంగం-ముఖ్య లక్షణాలు. 2. ప్రాథమిక హక్కులు. 3. భారత రాష్ట్రపతి. 4. భారత ప్రధానమంత్రి. 5. భారత పార్లమెంటు. 6. రాష్ట్ర గవర్నర్. 7. గ్రామీణ- పట్టణ స్థానిక ప్రభుత్వాలు. 8. జిల్లా కలెక్టర్ తదితర అంశాలు. ఐదు మార్కుల ప్రశ్నలకు: *** భారత జాతీయోద్యమం ఆవిర్భావానికి కారణాలు, వివిధ జాతీయోద్యమ ఉద్యమాలు, భారత ప్రభుత్వ చట్టాలు. *** ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు- ఆదేశిక సూత్రాల మధ్య భేదాలు. *** ఉప రాష్ట్రపతి- మంత్రిమండలి. *** శాసన తయారీ విధానం- వివిధ బిల్లులు, పార్లమెంటరీ కమిటీలు. *** సుప్రీంకోర్టు అధికారాలు; రాష్ట్ర ప్రభుత్వం- రాష్ట్ర శాసనశాఖ- రాష్ట్ర న్యాయశాఖ. *** కేంద్ర- రాష్ట్ర సంబంధాలు- సర్కారియా కమిషన్ సూచనలు. *** 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు, వివిధ స్థానిక ప్రభుత్వాల విధులు. *** భారత విదేశాంగ విధానం, ఐక్యరాజ్యసమితి, సమకాలీన ధోరణులు- అంశాలు. రెండు మార్కుల ప్రశ్నలకు: ప్రతి పాఠ్యాంశానికి సంబంధించిన ఏ అంశం నుంచైనా రెండు మార్కుల ప్రశ్నలు వచ్చే అవకాశముంది. అయితే ఎక్కువ ప్రశ్నలు వచ్చేందుకు అవకాశమున్న ముఖ్యమైన అంశాలు: భారత రాజ్యాంగం (యూనిట్ 1); కేంద్ర ప్రభుత్వం (యూనిట్ 3); భారత పార్లమెంటు (యూనిట్ 4); రాష్ట్ర శాసనశాఖ (యూనిట్ 7); కేంద్ర- రాష్ట్ర సంబంధాలు (యూనిట్ 9); స్థానిక ప్రభుత్వాలు (యూనిట్ 10); ఐక్యరాజ్య సమితి (యూనిట్ 12); సమకాలీన ధోరణులు- అంశాలు (యూనిట్ 13). సూచనలు: *** ప్రశ్నపత్రాన్ని ఒకటికి రెండుసార్లు చదవాలి. పూర్తిగా అవగాహన ఉన్న ప్రశ్నలనే ఎంపిక చేసుకోవాలి. *** మొదట రెండు మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఈ విభాగంలో 15 ప్రశ్నలకే సమాధానాలు రాయాల్సి ఉన్నా అదనంగా మరో రెండింటికి సమాధానాలు రాస్తే మంచిది. *** వ్యాసరూప ప్రశ్నలకు 20-30 నిమిషాలు, ఐదు మార్కుల ప్రశ్నలకు 10-20 నిమిషాలు, రెండు మార్కుల ప్రశ్నలకు ఐదు నిమిషాలు కేటాయించాలి. చివరి 5 నిమిషాలు పునఃపరిశీలనకు కేటాయించాలి. *** సీనియర్ ఇంటర్ సిలబస్‌లో రాజ్యాంగ అధికరణలు (ఆర్టికల్స్) ఉన్నాయి. అందువల్ల అవసరమైన చోట ఆర్టికల్స్‌ను, సమకాలీన ఉదాహరణలు రాయవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఎక్కువ మార్కులు వచ్చేందుకు అవకాశముంటుంది. కామర్స్ పార్ట్-1 వాణిజ్య శాస్త్రం సిలబస్: యూనిట్ 1: అంతర్జాతీయ వర్తకం. యూనిట్ 2: మార్కెటింగ్ వ్యవస్థలు, వ్యాపార ప్రకటనలు, వినియోగదారిత్వం. యూనిట్ 3: వ్యాపార సేవలు. యూనిట్ 4: స్టాక్ ఎక్స్చేంజ్లు. యూనిట్ 5: కంప్యూటర్ అవగాహన. పార్ట్- 2 వ్యాపార గణక శాస్త్రం: యూనిట్ 1: వర్తకం బిల్లులు, తరుగుదల. యూనిట్ 2: కన్సైన్మెంట్ ఖాతాలు. యూనిట్ 3: వ్యాపారేతర సంస్థల ఖాతాలు. యూనిట్ 4: ఒంటిపద్దు విధానం. యూనిట్ 5: భాగస్వామ్య వ్యాపార ఖాతాలు, భాగస్తుని ప్రదేశం, భాగస్తుని విరమణ. ప్రశ్నపత్రం: పార్ట్- 1 థియరీ- 50 మార్కులు విభాగం- మార్కులు- సమయం సెక్షన్-ఎ- 10 x 2 *** 20- 35 నిమిషాలు సెక్షన్-బి- 4 x 5 *** 20- 35 నిమిషాలు సెక్షన్-సి- 5 x 2 *** 10- 20 నిమిషాలు *** సెక్షన్-ఎ విభాగంలో వ్యాసరూప ప్రశ్నలు.. ప్రధానంగా స్టాక్ ఎక్స్చేంజ్, మార్కెటింగ్ వ్యవస్థ, వ్యాపార సేవలు, వినియోగదారిత్వం యూనిట్ల నుంచి వస్తాయి. అధిక మార్కులు సాధించేందుకు నిర్వచనం, ముఖ్యాంశాలను అండర్లైన్ చేస్తూ ముగింపు రాయాలి. *** సెక్షన్-బిలోని లఘు సమాధాన ప్రశ్నలు.. ప్రధానంగా స్టాక్ ఎక్స్చేంజ్, అంతర్జాతీయ వర్తకం, వ్యాపార ప్రకటనలు, కంప్యూటర్ అవగాహన లేదా వ్యాపార సేవల యూనిట్ల నుంచి వస్తాయి. ఈ సెక్షన్లో పూర్తి మార్కులు పొందేందుకు ఎక్కువ అవకాశం ఉన్నందున నిర్వచనంతో పాటు ప్రశ్నకు సంబంధించిన ప్రత్యక్ష సమాధానాలను విపులంగా రాయాలి. *** సెక్షన్-సిలో అతిస్వల్ప సమాధాన ప్రశ్నలకు క్లుప్తంగా, వివరంగా సమాధానాలు రాసి పూర్తి మార్కులు పొందొచ్చు. పార్ట్- 2 అకౌంట్స్- 50 మార్కులు విభాగం- మార్కులు- సమయం సెక్షన్-డి- 1 x 20 *** 20- 30 నిమిషాలు సెక్షన్-ఇ- 1 x 10 *** 10- -20 నిమిషాలు సెక్షన్-ఎఫ్- 2 x 5 *** 10- 20 నిమిషాలు సెక్షన్-జి - 5 x 2 *** 10- 20 నిమిషాలు *** సెక్షన్-డి లో భాగస్వామ్య వ్యాపార సంస్థకు సంబంధించి 20 మార్కుల ప్రశ్న వస్తుంది. దీనికి సమాధానం సుదీర్ఘంగా ఉండటం వల్ల సంబంధిత పట్టికల్లో జాగ్రత్తగా వ్యవహారాలను నమోదు చేస్తూ సరైన పద్ధతిలో ఖాతాల నిల్వల్ని తేల్చాలి. సమయం వృథా కాకుండా చూసుకోవాలి. *** సెక్షన్-ఇ లో కన్సైన్మెంట్ ఖాతాలు, వ్యాపారేతర సంస్థల ఖాతాల నుంచి 10 మార్కుల ప్రశ్నలు వస్తాయి. వీటిని బాగా చదివి, అర్థం చేసుకొని ఒక ప్రశ్నను ఎంపిక చేసుకొని అవసరమైన మేరకు మాత్రమే సమాధానం రాయాలి. *** సెక్షన్-ఎఫ్ లోని నాలుగు ప్రశ్నల్లో 3 అకౌంట్స్ ప్రశ్నలు, 1 థియరీ ప్రశ్న వచ్చేందుకు అవకాశముంది. విద్యార్థులు వారికి అనువైన ప్రశ్నలను ఎంపిక చేసుకోవాలి. *** సెక్షన్-జి లో అతిస్వల్ప సమాధాన ప్రశ్నలకు క్లుప్తంగా, సవివరంగా సమాధానాలు రాయాలి. సూచనలు: *** అకౌంట్స్ విభాగంలో అధిక శాతం సుదీర్ఘ సమాధాన ప్రశ్నలు, calculations ఉన్నందున సమాధానాలు రాయటంలో వేగం, కచ్చితత్వం ప్రధానం. *** అకౌంట్స్‌లో నియమాలు, సూత్రాలను అనుసరిస్తూ సమాధానాలు రాయాలి. అవసరమైన చోట తప్పనిసరిగా స్కేలు, పెన్సిల్ ఉపయోగించాలి. ఎకనామిక్స్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం అర్థశాస్త్రంలో అధిక మార్కులు సాధించాలంటే భారత దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలు, ఆర్థిక సమస్యలు- కారణాలు, నివారణ చర్యలు, గణాంక వివరాలను కూలంకషంగా చదివి, అర్థం చేసుకుంటే మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. సిలబస్: యూనిట్ 1: ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి. యూనిట్ 2: నూతన ఆర్థిక సంస్కరణలు. యూనిట్ 3: జనాభా, మానవ వనరుల అభివృద్ధి. యూనిట్ 4: జాతీయాదాయం. యూనిట్ 5: వ్యవసాయ రంగం. యూనిట్ 6: పారిశ్రామిక రంగం. యూనిట్ 7: తృతీయ రంగం. యూనిట్ 8: ప్రణాళికలు. యూనిట్ 9: పర్యావరణం, ఆర్థికాభివృద్ధి. యూనిట్10: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ- విహంగ వీక్షణం. ప్రశ్నపత్రం: *** సెక్షన్- ఎలోని ఐదు ప్రశ్నల్లో మూడింటికి సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 10 మార్కులు. *** సెక్షన్- బిలోని 12 ప్రశ్నల్లో ఎనిమిది ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 5 మార్కులు. *** సెక్షన్- సిలోని 20 ప్రశ్నల్లో 15 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. మార్కుల వెయిటేజీ: యూనిట్- 10 మార్కులు- 5 మార్కులు- 2 మార్కులు 1 - 1 - -- 2 2 - 1 - 2 - 2 3 - 1 - 1 - 2 4 - 1 - 2 - - 5 - 1 - 2 - 4 6 - 1 - 2 - 2 7 - - 2 - 3 8 - - 1 - 3 9 - - 1- 3 10 - - 1 - - *** పది మార్కుల ప్రశ్నకు 20 నిమిషాలు, ఐదు మార్కుల ప్రశ్నకు 10 నిమిషాలు, రెండు మార్కుల ప్రశ్నకు రెండు నిమిషాలు కేటాయించాలి. పునఃపరిశీలనకు 10 నిమిషాలు కేటాయించాలి. సూచనలు: *** ద్వితీయ సంవత్సరం అర్థశాస్త్రం సిలబస్‌లో ముఖ్యంగా నాలుగు యూనిట్లపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. అవి: జాతీయాదాయం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, నూతన ఆర్థిక సంస్కరణలు. వీటి నుంచి దాదాపు 80 నుంచి 90 మార్కుల వరకు ప్రశ్నలు వస్తాయి. *** ప్రతి సమాధానంలో సబ్ హెడ్డింగ్స్, గణాంకాలు ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల ఎక్కువ మార్కులు సాధించేందుకు అవకాశముంటుంది. *** 10 మార్కుల ప్రశ్నకు కనీసం 8 కారణాలు, ఆరు నివారణ చర్యలు రాయాలి. 5 మార్కుల ప్రశ్నకు ఐదారు అంశాలు రాయాలి. *** పరీక్షలో తొలుత రెండు మార్కుల ప్రశ్నలకు, తర్వాత ఐదు మార్కుల ప్రశ్నలకు, చివరగా 10 మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఎకనామిక్స్ జాతీయాదాయం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, నూతన ఆర్థిక సంస్కరణల అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. కామర్స్ ‘అకౌంట్స్’ విభాగానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు రాయటంలో వేగం, కచ్చితత్వం ప్రధానం. సివిక్స్ అవసరమైన చోట సమకాలీన ఉదాహరణలు, ఆర్టికల్స్‌తో సమాధానాలు రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయి. prepared by K. Janardhan Reddy (Economics) Kuruhuri Ramesh (Commerce) G.W. Stevenson (Civics) Royal Educational Institutions, Hyderabad. -
వ్యూహాత్మకంగా చదివితే విజయం చిక్కినట్లే!
గణితం (Mathematics), అర్థ శాస్త్రం (Economics), వాణిజ్య శాస్త్రం (Commerce).. ఇవి నేటి తరం కుర్రకారుకు క్రేజీ సబ్జెక్టులు. సీఏ, సీఎస్ వంటి ఉన్నత స్థాయి ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశించి, సుస్థిర వృత్తి జీవితాన్ని సొంతం చేసుకునే క్రమంలో ఇప్పుడు చాలా మంది విద్యార్థులు ఇంటర్ ఎంఈసీ గ్రూపులో అడుగుపెడుతున్నారు. దీన్ని అత్యుత్తమ మార్కులతో దిగ్విజయంగా పూర్తిచేసి భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఈ నేపథ్యంలో జూనియర్ ఇంటర్ ఎంఈసీ ప్రిపరేషన్ ప్రణాళిక.. మ్యాథమెటిక్స్ గతంతో పోలిస్తే ఇప్పుడు జూనియర్ ఇంటర్ గణిత శాస్త్రం పాఠ్య ప్రణాళికలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. వీటిని నిశితంగా పరిశీలించి పరీక్షలకు సిద్ధం కావాలి. 1 (ఎ): సిలబస్: యూనిట్ 1: ప్రమేయాలు (11 మార్కులు); యూనిట్ 2: గణితానుగమనం (7 మార్కులు); యూనిట్ 3: మాత్రికలు (22 మార్కులు); యూనిట్ 4: సదిశల సంకలనం (8 మార్కులు); యూనిట్ 5: సదిశల గుణనం (13 మార్కులు); యూనిట్ 6: త్రికోణమితీయ నిష్పత్తులు- పరివర్తనలు (15 మార్కులు); యూనిట్ 7: త్రికోణమితీయ సమీకరణాలు (4 మార్కులు); యూనిట్ 8: విలోమ త్రికోణమితీయ ప్రమేయాలు (4 మార్కులు); యూనిట్ 9: అతి పరావలయ ప్రమేయాలు (2 మార్కులు); యూనిట్ 10: త్రిభుజ ధర్మాలు (11 మార్కులు). పాఠ్యాంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలంటే మొదట ఆయా అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ప్రశ్నపత్రం: విద్యార్థులు మొత్తం 75 మార్కులకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. సెక్షన్-ఎ లో 10 అతిస్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి. వీటన్నింటికీ సమాధానాలు రాయాలి. ఒక్కో దానికి రెండు మార్కులు. సెక్షన్-బి లో 7 స్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి. వీటిలో ఐదింటికి సమాధానాలు రాయాలి. ఒక్కో దానికి నాలుగు మార్కులు. సెక్షన్-సి లో 7 దీర్ఘ సమాధాన ప్రశ్నలుంటాయి. వీటిలో ఐదింటికి సమాధానాలు రాయాలి. ఒక్కో దానికి 7 మార్కులు. ప్రశ్నపత్రం దాదాపు తెలుగు అకాడమీ పాఠ్య గ్రంథం చివర్లో ఇచ్చిన మాదిరి ప్రశ్నపత్రం తరహాలోనే ఉంటుంది. ప్రిపరేషన్ వ్యూహం: విద్యార్థులు వెయిటేజీని అనుసరించి ప్రిపరేషన్ కొనసాగించాలి. 1, 2, 3, 5, 6, 10 యూనిట్ల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వస్తాయి. 3వ యూనిట్ నుంచి రెండు దీర్ఘ సమాధాన ప్రశ్నలు వస్తాయి. మొత్తంమీద ఈ యూనిట్ నుంచి 22 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. కాబట్టి విద్యార్థులు దీనిపై ఎక్కువ దృష్టిసారించాలి. 1వ యూనిట్ నుంచి ఒక సిద్ధాంతం తప్పకుండా వస్తుంది. అందువల్ల ఉన్న ఆరు సిద్ధాంతాలను శ్రద్ధగా నేర్చుకోవాలి. 3, 4, 5, 6, 7, 8, 10 యూనిట్ల నుంచి స్వల్ప సమాధాన ప్రశ్నలు వస్తాయి. 1,3, 4, 5, 6, 9 యూనిట్ల నుంచి అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు వస్తాయి. ఇందులో 1, 3, 4, 6 యూనిట్ల నుంచి రెండేసి ప్రశ్నలు వస్తాయి. అధిక మార్కులు సాధించేందుకు అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు ఉపయోగపడతాయి. అందువల్ల వీటిపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. 1 (బి): సిలబస్: యూనిట్ 1: బిందుపథం (4 మార్కులు); యూనిట్ 2: అక్ష పరివర్తనం (4 మార్కులు); యూనిట్ 3: సరళరేఖలు (15 మార్కులు); యూనిట్ 4: సరళరేఖాయుగ్మాలు (14 మార్కులు); యూనిట్ 5: త్రిపరిమాణ నిరూపకాలు (2 మార్కులు); యూనిట్ 6: దిక్ కొసైన్లు, దిక్ సం ఖ్యలు (7 మార్కులు); యూనిట్ 7: సమతలం (2 మార్కులు); యూనిట్ 8: అవధులు, అవిచ్ఛిన్నత (8 మార్కులు); యూనిట్ 9: అవకలనం (15 మార్కులు); యూనిట్ 10: అవకలజాల అనువర్తనాలు (26 మార్కులు). ప్రశ్నపత్రం: 1 (బి) ప్రశ్నపత్రం కూడా 1 (ఎ) ప్రశ్నపత్రం తరహాలోనే ఉంటుంది. ప్రిపరేషన్ వ్యూహం: అధిక వెయిటేజీ ఉన్న సరళరేఖలు, సరళరేఖా యుగ్మాలు, అవకలనం, అవకలజాల అనువర్తనాలను బాగా చదవాలి. 3, 4, 6, 9, 10 యూనిట్ల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వస్తాయి. వీటిలో 4, 10 యూనిట్ల నుంచి రెండేసి ప్రశ్నలు వస్తాయి. 1, 2, 3, 8, 9, 10 యూనిట్ల నుంచి స్వల్ప సమాధాన ప్రశ్నలు వస్తాయి. పదో యూనిట్ నుంచి రెండు స్వల్ప సమాధాన ప్రశ్నలు వస్తాయి. 3, 5, 7, 8, 9, 10 యూనిట్ల నుంచి అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు వస్తాయి. వీటిలో 3, 8, 9, 10 యూనిట్ల నుంచి రెండేసి ప్రశ్నలు వస్తాయి. సరళరేఖా యుగ్మాలు యూనిట్లో సమఘాత పరచటం పాఠ్యాంశం నుంచి ఓ దీర్ఘ సమాధాన ప్రశ్న తప్పకుండా వస్తుంది. కాబట్టి విద్యార్థులు దీన్ని బాగా సాధన చేయాలి. విద్యార్థులు ప్రతి యూనిట్ చివర్లో ఇచ్చిన సూత్రాలను సాధన చేయాలి. అప్పుడే సమస్యల్ని తేలిగ్గా సాధించేందుకు వీలవుతుంది. ఎకనామిక్స్ 100 మార్కులకు ఉండే అర్థశాస్త్రంలో అధిక మార్కులు సాధించాలంటే విద్యార్థులు ముందుగా ఆర్థిక భావనలను అర్థం చేసుకోవాలి. ఆర్థిక భావనలు, ఆర్థిక సూత్రాలకు సంబంధించిన నిర్వచనాలు, పట్టికలు, రేఖా పటాలు, ప్రమేయాలు తదితర అంశాలపై దృష్టిసారించాలి. ప్రతిరోజూ వీటిని విశ్లేషించుకుంటూ అధ్యయనం చేయాలి. పాఠ్యాంశాలు: యూనిట్ 1: ఉపోద్ఘాతం; యూనిట్ 2: వినియోగ సిద్ధాంతం; యూనిట్ 3: డిమాండ్ వ్యాకోచత్వం; యూనిట్ 4: ఉదాసీనతా వక్రరేఖలు; యూనిట్ 5: ఉత్పత్తి సిద్ధాంతం; యూనిట్ 6: విలువ సిద్ధాంతం; యూనిట్ 7: పంపిణీ సిద్ధాంతం; యూనిట్ 8: జాతీయాదాయం; యూనిట్ 9: స్థూల ఆర్థిక అంశాలు; యూనిట్ 10: ద్రవ్యం, బ్యాంకింగ్, ద్రవ్యోల్బణం. నమూనా ప్రశ్నపత్రం: ప్రశ్నపత్రంలో సెక్షన్-ఎలో ఐదు ప్రశ్నలు ఇస్తారు. వీటిలో మూడింటికి సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు పది మార్కులు. సెక్షన్-బిలోని 12 ప్రశ్నల్లో ఎనిమిది ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు ఐదు మార్కులుంటాయి. సెక్షన్-సిలోని 20 ప్రశ్నల్లో 15 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. పాఠ్యాంశాలు-ప్రాధాన్యం: పరీక్షల్లో కేటాయించాల్సిన సమయం: పది మార్కుల ప్రశ్నకు 20 నిమిషాలు, 5 మార్కుల ప్రశ్నకు 10 నిమిషాలు, 2 మార్కుల ప్రశ్నకు 2 నిమిషాలు; పునఃపరిశీలనకు 10 నిమిషాలు కేటాయించాలి. సూచనలు: అర్థశాస్త్రంలో అధిక మార్కులు సాధించాలంటే, ముందుగా రెండు మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. తర్వాత ఐదు మార్కుల ప్రశ్నలకు, తర్వాత 10 మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. కామర్స్ పదో తరగతి పూర్తిచేసి ఇంటర్మీడియెట్ మొదటి ఏడాది ఎంఈసీలో చేరిన విద్యార్థులకు వాణిజ్య శాస్త్రం (కామర్స్) కొత్త సబ్జెక్టుగా ఎదురవుతుంది. అందువల్ల దీనిపై ఆసక్తి పెంచుకొని పాఠ్యాంశాలపై లోతైన అవగాహన పెం పొందించుకోవడం అవసరం. వాణిజ్య శాస్త్రానికి బీకాం, సీపీటీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్, ఎంబీఏ వంటి కోర్సులతో సంబంధం ఉంది. అందువల్ల ఇంటర్ ఎంఈసీని విజయవంతంగా పూర్తిచేసిన వారు తర్వాత వివిధ ఉన్నత కోర్సుల్లో చేరి చక్కని కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. వాణిజ్య శాస్త్రం ప్రశ్నపత్రం రెండు విభాగాలుగా ఉంటుంది. పార్ట్-1 వాణిజ్య శాస్త్రానికి 50 మార్కులు; పార్ట్-2 వ్యాపారగణక శాస్త్రానికి 50 మార్కులు ఉంటాయి. పార్ట్- 1 పాఠ్య ప్రణాళిక: యూనిట్ 1: వ్యాపారం, భావనలు; యూనిట్ 2: వ్యాపార సంస్థల స్వరూప, స్వభావాలు; యూనిట్ 3: వ్యవస్థాపన-వ్యవస్థాపకుడు; యూనిట్ 4: వ్యాపార విత్తం-మూలాధారాలు; యూనిట్ 5: ప్రభుత్వ, ప్రైవేటు బహుళ జాతీయ సంస్థలు. పార్ట్- 2 పాఠ్య ప్రణాళిక: యూనిట్ 1: విషయ పరిచయం; యూనిట్ 2: సహాయక పుస్తకాలు; యూనిట్ 3: బ్యాంకు నిల్వల సమన్వయ పట్టీ; యూనిట్ 4: అంకణా తప్పుల సవరణ; యూనిట్ 5: ముగింపు లెక్కలు. పార్ట్- 1 ప్రశ్నపత్రం విద్యార్థులు 50 మార్కులకు సమాధానాలు రాయాలి. సెక్షన్-ఎలో మూడు దీర్ఘ సమాధాన ప్రశ్నలు ఇస్తారు. వీటిలో రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి సమాధానానికి పది మార్కులు. 2, 3, 4 యూనిట్ల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వస్తాయి. సెక్షన్-బిలో ఆరు లఘు సమాధాన ప్రశ్నలు ఉంటాయి. వీటిలో నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి సమాధానానికి ఐదు మార్కులు. అన్ని యూనిట్ల నుంచి లఘు సమాధాన ప్రశ్నలు వస్తాయి. సెక్షన్-సిలో ఎనిమిది అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు ఉంటాయి. ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి సమాధానానికి 2 మార్కులు. అన్ని యూనిట్ల నుంచి అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు వస్తాయి. పార్ట్-2 ప్రశ్నపత్రం ఎంఈసీ విద్యార్థులకు గణితంపై అవగాహన ఉండటం వల్ల అకౌంట్స్‌లో ఎలాంటి పొరపాట్లు లేకుండా కచ్చితంగా సమాధానాలు రాయడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులు వాణిజ్య శాస్త్రాన్ని స్కోరింగ్ సబ్జెక్టుగా పరిగణించి ఎక్కువ శ్రద్ధచూపాలి. సెక్షన్-డి నుంచి సెక్షన్-జి వరకు అకౌంట్స్‌కు సంబంధించి ప్రశ్నలు వస్తాయి. అందువల్ల సమయ పాలన అలవరచుకోవడం చాలా అవసరం. వ్యాపార వ్యవహారాలు నమోదు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని, ప్రశ్నపత్రంలో ఇచ్చిన నగదు మొత్తాలను సరిచూసుకొని రాయాలి. లేకుంటే ఓ చిన్న పొరపాటు వల్ల చాలా సమయం వృథా అవుతుంది. సెక్షన్-డిలో 20 మార్కుల ప్రశ్నకు ముగింపు లెక్కలు చేసేటప్పుడు వ్యవహారాల నమోదుతో పాటు సర్దుబాట్లను కూడా పరిగణనలోకి తీసుకొని, ఖాతాల నిల్వలను సరిగా తేల్చాలి. ఆస్తులు, అప్పుల పట్టీతో ఆస్తులు, అప్పులను సరైన విధానంలో నమోదు చేయాలి. అకౌంట్స్‌లో ఎలాంటి కొట్టివేతలు లేకుండా సరైన పద్ధతిలో సమాధానాలు రాస్తే పూర్తి మార్కులు పొందేందుకు అవకాశముంటుంది. అవసరమైన చోట తప్పనిసరిగా స్కేలు, పెన్సిల్లను ఉపయోగించాలి. పార్ట్-1 విభాగంలో థియరీ ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు స్పష్టంగా ఉండాలి. ముఖ్యమైన అంశాలను అండర్లైన్ చేయాలి. చివరగా ప్రతి సమాధానాన్ని పునఃపరిశీలించుకోవాలి. prepared by K. Janardhan Reddy (Economics) Kuruhuri Ramesh (Commerce) S.S.C.V.S. Ramarao (Mathematics) Royal Educational Institutions, Hyderabad.