పాలకుర్తి : జాతీయ స్థాయి అండర్ 17 బాలుర క్రికెట్ పోటీల్లో పాల కుర్తి మండలం దర్దేపల్లికి చెందిన నిమ్మల అనిల్ అత్యుత్తమ ప్రతిభ కనబరి చాడు. ట్రెడిషనల్ ఒలిం పిక్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ హర్డోయి నగరంలో ఇటీవల ప్రథమ జాతీయ క్రీడోత్సవాలు జరి గాయి. ఈ పోటీల్లో రాష్ట్ర జట్టులో అనిల్ పాల్గొని స్వర్ణ పతకం సాధిం చాడు.
ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ క్రికెట్‌లో అంతర్జాతీయ స్థాయి లో రాణించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నేపాల్‌లో జరగనున్న అంతర్జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరఫున ఆడనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నానని, కోచింగ్ తీసుకునేందుకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బం దులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి చేయూతనందించాలని అనిల్ కోరారు.