
U19 Cricket World Cup: అండర్-19 ప్రపంచకప్ 2022 ఛాంపియన్‌గా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో ఇంగ్లండ్‌పై 4 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించి జగజ్జేతగా నిలిచింది.ఈ క్రమంలో భారత జట్టుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత యువ జట్టును బీసీసీఐ కార్యదర్శి జైషా అభినందించారు. అధ్బుతమైన ప్రదర్శనతో భారత విజయంలో భాగమైన ప్రతీ ఒక్క ఆటగాడికి రూ. 40 లక్షల నగదు బహుమతిని బీసీసీఐ ప్రకటించింది.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
అదే విధంగా సహాయక సిబ్బందిలోని ప్రతి సభ్యుడికి 25 లక్షల క్యాష్ ఫ్రైజ్‌ను అందజేయనున్నట్లు జైషా పేర్కొన్నారు. "ప్రపంచ కప్‌ను గెలుచుకున్నందుకు యువ భారత్‌కు అభినందనలు. అండర్-19 ప్రపంచకప్‌లో అత్యత్తమ ప్రదర్శన చేసిన ప్రతి ఆటగాడికి 40 లక్షలు, సహాయక సిబ్బందికి 25 లక్షల రివార్డును ప్రకటించినందుకు నేను సంతోషిస్తున్నాను. మీరు దేశం గర్వించేలా చేశారు" అని జైషా ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా అండర్-19 ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకోవడం ఇది ఐదోసారి.
చదవండి: Under 19 World Cup: చాంపియన్ యువ భారత్
Comments
Please login to add a commentAdd a comment