![Yash Dhull To Lead India In 2022 Under 19 World Cup - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/19/Untitled-12.jpg.webp?itok=7AvOWePM)
ముంబై: వెస్టిండీస్ వేదికగా వచ్చే ఏడాది(2022) జనవరి 14 నుంచి ప్రారంభంకానున్న అండర్ 19 వన్డే ప్రపంచ కప్ టోర్నీకి టీమిండియా కెప్టెన్‌గా ఢిల్లీ కుర్రాడు యశ్ దుల్ ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్‌గా ఆంధ్రా ప్లేయర్, గుంటూరు కుర్రాడు షేక్ రషీద్‌కి అవకాశం దక్కింది. 17 మంది ప్లేయర్లు, ఐదుగురు స్టాండ్ బై ఆటగాళ్లతో కూడిన జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. మెగా టోర్నీలో భాగంగా జరిగే ప్రాధమిక మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా(జనవరి 15), ఐర్లాండ్(జనవరి 19), ఉగాండా(జనవరి 22) జట్లతో యంగ్ ఇండియా తలపడనుంది.
ఇదిలా ఉంటే, భారత అండర్-19 జట్టు నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి.. అత్యధిక సార్లు ఈ ఘనత సాధించిన జట్టుగా రికార్డుల్లోకెక్కిన సంగతి తెలిసిందే. భారత యువ జట్టు చివరిసారిగా 2020లో జరిగిన టోర్నీలో ఫైనల్‌కు చేరి.. బంగ్లాదేశ్ చేతిలో ఓడింది.
భారత జట్టు అండర్-19 జట్టు: యశ్ దుల్ (కెప్టెన్), షేక్ రషీద్ (వైస్ కెప్టెన్), హర్నూర్ సింగ్, అంగ్‌క్రిష్ రఘువంశీ, నిశాంత్ సింధు, సిద్థార్థ్ యాదవ్, అనీశ్వర్ గౌతమ్, దినేశ్ బనా (వికెట్ కీపర్), ఆరాధ్య యాదవ్ (వికెట్ కీపర్), రాజ్ అంగద్ బవా, మానవ్ పరాక్, కుశాల్ తంబే, ఆర్‌ఎస్ హంగర్కేర్, వసు వాత్స్, విక్కీ ఉత్సవల్, రవి కుమార్, గర్వ్ సంగ్వాన్
స్టాండ్ బై ప్లేయర్లు: రిషిత్ రెడ్డి(హైదరాబాద్), ఉదయ్ శరవణ్, అన్ష్ ఘోసాయ్, అమిత్ రాజ్ ఉపాధ్యాయ్, పీఎం సింగ్ రాథోర్
చదవండి: BWF World Championships 2021: మహిళల సింగిల్స్ ఛాంపియన్‌గా యమగుచి
Comments
Please login to add a commentAdd a comment