యువ క్రికెటర్లను చూసి చాలా గ‌ర్వ‌ప‌డుతున్నా: నరేంద్ర మోది | PM Narendra Modi lauds India U19 team after winning the World Cup | Sakshi
Sakshi News home page

యువ క్రికెటర్లను చూసి చాలా గ‌ర్వ‌ప‌డుతున్నా: నరేంద్ర మోది

Published Sun, Feb 6 2022 2:44 PM | Last Updated on Sun, Feb 6 2022 5:25 PM

PM Narendra Modi lauds India U19 team after winning the World Cup - Sakshi

అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌-2022 ఫైనల్లో ఇంగ్లండ్‌పై విజ‌యం సాధించి యువ భార‌త్ విశ్వ విజేత‌గా నిలిచింది. ఈ నేప‌థ్యంలో భార‌త జ‌ట్టుపై స‌ర్వాత్ర ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ఇక అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచినందుకు భార‌త జ‌ట్టును దేశ ప్ర‌ధాని మంత్రి నరేంద్ర మోది అభినందించారు. "యువ క్రికెటర్లను చూసి తాను చాలా గర్వపడుతున్నాను, అండర్ 19 ప్రపంచకప్‌ను గెలుచుకున్నందుకు వారికి అభినందనలు. ఈ టోర్నమెంట్‌లో యష్ ధుల్ నేతృత్వంలోని జట్టు అద్భుతంగా రాణించింది" అని ట్విట‌ర్‌లో ప్రధాని రాసుకొచ్చారు.

 ఇక అండ‌ర్‌ -19 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన భార‌త జ‌ట్టుకు బీసీసీఐ భారీ న‌జ‌రానా ప్ర‌క‌టంచింది. భార‌త జ‌ట్టులో ప్ర‌తీ ఒక్క ఆట‌గాడికి రూ. 40 ల‌క్ష‌ల న‌గ‌దు బ‌హుమ‌తిని అంద‌జేయ‌నున్న‌ట్లు బీసీసీఐ కార్య‌ద‌ర్శి తెలిపారు. ఇక అండ‌ర్‌ -19 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన భార‌త జ‌ట్టుకు బీసీసీఐ భారీ న‌జ‌రానా ప్ర‌క‌టంచింది. భార‌త జ‌ట్టులో ప్ర‌తీ ఒక్క ఆట‌గాడికి రూ. 40 ల‌క్ష‌ల న‌గ‌దు బ‌హుమ‌తిని అంద‌జేయ‌నున్న‌ట్లు బీసీసీఐ కార్య‌ద‌ర్శి తెలిపారు. కాగా అండ‌ర్‌-19 ప్రపంచ‌క‌ప్‌ను భార‌త్ ఐదో సారి గెలుచుకుంది. భారత్‌ 2000, 2008, 2012, 2018 లలోనూ విజేతగా నిలిచింది.

చ‌ద‌వండి: IND VS WI 1st ODI: లైవ్‌ అప్‌డేట్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement