ఉగాది పురస్కారాల గ్రహీతలు వీరే.. | These are fantastic New Year award recipients .. | Sakshi
Sakshi News home page

ఉగాది పురస్కారాల గ్రహీతలు వీరే..

Published Thu, Mar 19 2015 12:55 AM | Last Updated on Wed, Aug 15 2018 8:06 PM

These are fantastic New Year award recipients ..

సాక్షి, హైదరాబాద్: మన్మథ నామ సంవత్సర ఉగాది పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. ఉగాది పురస్కారాల గ్రహీతల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదికకు సీఎం కె. చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారు. పురస్కార గ్రహీతలకు రూ. 10,116 చొప్పున నగదు బహుమతిని అందజేస్తారు.

పురస్కారాల గ్రహీతల వివరాలు..

సాహిత్యం: ముదిగంటి సుజాత రెడ్డి, మలయశ్రీ, గోరటి వెంకన్న, సంగీతం: రామలక్ష్మీ రంగాచారి, రాజగోపాలాచారి, నృత్యం: సుధీర్‌రావు, రత్నశ్రీ, నాటకం: బి.అమరేందర్, చిత్రకళ: సూర్యప్రకాశ్, అంజనీరెడ్డి, శిల్పకల: శ్రీనివాసరెడ్డి, పాండు, పేరిణి నృత్యం: పేరిణి రమేష్, జానపద సంగీతం: వడ్డేపల్లి శ్రీనివాస్, జానపద కళా రూప ప్రదర్శన: దర్శనం మొగులయ్య(పన్నెండు మెట్ల కిన్నెర), హరికథ: పద్మాలయాచార్య, బుర్రకథ: బి.సరోజిని, ఒగ్గుకథ: ఒగ్గు ధర్మయ్య, మిమిక్రీ: ఆర్.సదాశివ, చిందు యక్షగానం: చిందు పెదబాబయ్య, టీవీ రంగం: నాగబాల సురేష్, సినిమా రంగం: ఎన్.శంకర్, భూపాల్‌రెడ్డి, జానపద చిత్రకళ: నకాశ్ వైకుంఠం(చేర్యాల), హస్తకళ: నల్ల విజయ్, హుజూరమ్మ, ఇతరాలు: రవీంద్రశర్మ (కళాశ్రమం), ఎం.వి.నరసింహారెడ్డి(వేద పరిశోధన). 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement