Ugadi Awards
-
ANUలో 2023 ఉగాది పురస్కారాలు...!
-
AP: తెలుగు, సంస్కృత అకాడమీ ఉగాది పురస్కారాలు వీరికే..
తాడేపల్లి: తెలుగు, సంస్కృత అకాడమీ 2023 ఏడాదికి ఉగాది పురస్కారాలను ప్రకటించింది. వివిధ కేటగిరీల కింద మొత్తం ఏడుగురిని అవార్డులకు ఎంపిక చేసింది. ఏయే రంగంలో ఎవరికి అవార్డులు వచ్చాయంటే.. ► విద్యా శాస్త్రసాంకేతిక రంగం : పి.గోపీకృష్ణ ► వైద్య రంగం: డా.ఆళ్ళ గోపాలకృష్ణ గోఖలే ► లలిత కళలు : శ్రీమతి పసుమర్తి పావని ► జానపద, నాటక రంగం : కురటి సత్యం నాయుడు ► వ్యవసాయ రంగం : వి.గోపీచంద్ ► సేవా రంగం : మాదిరెడ్డి కొండారెడ్డి ► ప్రత్యేక కేటగిరి (చిత్రకళ) : ఆర్.సుభాష్ బాబు ఈనెల 25న నాగార్జున వర్సిటీలో అవార్డులు ప్రదానం జరగనుంది. ఈ కార్యక్రమానికి తానేటి వనిత, మేరుగు నాగార్జున, పేర్ని నాని ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. చదవండి: దేవుడి సేవలన్నింటికీ ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ -
AP: రైతు ఉగాది పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
గుంటూరు రూరల్: వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో నూతన ఆలోచనలు, ఆవిష్కరణల రూపకర్తలైన అభ్యుదయ రైతులకు ఈ ఏడాది ఉగాది పురస్కారాలను అందించేందుకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రాష్ట్రం లోని 13 జిల్లాల నుంచి ఆసక్తిగల రైతులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ పి.రాంబాబు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. చదవండి: ప్రభుత్వోద్యోగులకు ఏపీ సర్కార్ మరో తీపికబురు రైతులు తమకు సమీపం లోని వ్యవసాయ పరిశోధనా స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాలలో దరఖాస్తులు పొందవచ్చు. భర్తీ చేసిన దరఖాస్తులకు ధ్రువపత్రాలను జత చేసి ఈ నెల 16వ తేదీలోగా అందజేయాలన్నారు. ప్రతిభ కనబరిచిన రైతులకు పురస్కారంతో పాటుగా, రూ 5,000 నగదు బహుమతి, జ్ఞాపికను అందజేస్తామన్నారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్సైట్ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏఎన్జీఆర్ఏయూ.ఏసీ.ఇన్’ను సంప్రదించాలని సూచించారు. -
వేడుకగా ఉగాది పురస్కారాలు
32 మందికి కళారత్న, 67 మందికి ఉగాది పురస్కారాలు బాలాంత్రపు రజనీ కాంతారావుకు ‘తెలుగు వెలుగు’ పురస్కారం సాక్షి, విజయవాడ బ్యూరో: మన్మథ నామ సంవత్సర ఉగాది వేడుకలను పురస్కరించుకుని ప్రభుత్వం వివిధ రంగాల్లో నిష్ణాతులైన 100 మంది ప్రముఖులకు శనివారం ‘2015 కళారత్న (హంస), ఉగాది పురస్కారాలను అందజేసింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో శనివారం జరిగిన ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబునాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్ కృష్ణారావులు వీటిని అందజేశారు. ప్రముఖ వాగ్గేయకారుడు డాక్టర్ బాలాంత్రపు రజనీ కాంతారావుకు తెలుగు వెలుగు విశిష్ట పురస్కారాన్ని అందించి సత్కరించారు. అదేవిధంగా 32 మందికి హంస, మరో 67 మంది ప్రముఖులకు ఉగాది పురస్కారాలను అందజేశారు. హంస పురస్కార గ్రహీతలకు రూ. 50 వేలు, ఉగాది పురస్కార గ్రహీతలకు రూ.10 వేల చొప్పున నగదు బహుమతిని అందజేశారు. -
ఉగాది పురస్కారాల గ్రహీతలు వీరే..
సాక్షి, హైదరాబాద్: మన్మథ నామ సంవత్సర ఉగాది పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. ఉగాది పురస్కారాల గ్రహీతల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదికకు సీఎం కె. చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారు. పురస్కార గ్రహీతలకు రూ. 10,116 చొప్పున నగదు బహుమతిని అందజేస్తారు. పురస్కారాల గ్రహీతల వివరాలు.. సాహిత్యం: ముదిగంటి సుజాత రెడ్డి, మలయశ్రీ, గోరటి వెంకన్న, సంగీతం: రామలక్ష్మీ రంగాచారి, రాజగోపాలాచారి, నృత్యం: సుధీర్‌రావు, రత్నశ్రీ, నాటకం: బి.అమరేందర్, చిత్రకళ: సూర్యప్రకాశ్, అంజనీరెడ్డి, శిల్పకల: శ్రీనివాసరెడ్డి, పాండు, పేరిణి నృత్యం: పేరిణి రమేష్, జానపద సంగీతం: వడ్డేపల్లి శ్రీనివాస్, జానపద కళా రూప ప్రదర్శన: దర్శనం మొగులయ్య(పన్నెండు మెట్ల కిన్నెర), హరికథ: పద్మాలయాచార్య, బుర్రకథ: బి.సరోజిని, ఒగ్గుకథ: ఒగ్గు ధర్మయ్య, మిమిక్రీ: ఆర్.సదాశివ, చిందు యక్షగానం: చిందు పెదబాబయ్య, టీవీ రంగం: నాగబాల సురేష్, సినిమా రంగం: ఎన్.శంకర్, భూపాల్‌రెడ్డి, జానపద చిత్రకళ: నకాశ్ వైకుంఠం(చేర్యాల), హస్తకళ: నల్ల విజయ్, హుజూరమ్మ, ఇతరాలు: రవీంద్రశర్మ (కళాశ్రమం), ఎం.వి.నరసింహారెడ్డి(వేద పరిశోధన). -
అత్యంత ఘనంగా ఉగాది పురస్కారాలు
-
సేవకు సత్కారం
తమిళ సినిమా, న్యూస్‌లైన్:అవార్డులు, రివార్డులతో సంబంధం లేకుండా అంకిత భావంతో పని చేసే సేవకు లను సత్కరించుకోవడం సంస్కారమని బీజేపీ జాతీయ నేత వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. శ్రీకళాసుధ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఉగాది పురస్కారాలు, మహిళా రత్న అవార్డులు, సినీ ఉత్తమ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. పశ్చిమ గోదావరికి చెందిన అరుణ చంద్రాల ఆస్ట్రేలియాలో నిర్వహిస్తున్న ప్రజాహిత కార్యక్రమాలకు గాను ఆమెను మహిళా రత్న అవార్డుతో సత్కరించారు. వైద్య, విద్య రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న స్వర్ణ భారత్, అక్షర విద్యాలయం నిర్వాహక అధ్యక్షురాలు, వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్‌కు మహిళా రత్న అవార్డును ప్రదానం చేశారు. 2013కి గాను సినీ అవార్డులను అందించారు. ఉత్తమ చిత్రం అవార్డును అత్తారింటికి దారేది చిత్ర నిర్మాత బీవీఎస్ ఎస్ ప్రసాద్, ఉత్తమ కుటుంబ కథా చిత్రం అవార్డును సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు నిర్మాత రాజు, ఉత్తమ హాస్యభరిత చిత్ర అవార్డును వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రానికి గాను ఆ చిత్ర నిర్మాత అంకినేని రావి ప్రసాద్‌కు, ఉత్తమ భక్తిరస చిత్రం అవార్డును జగద్గురు ఆదిశంకర చిత్ర నిర్మాత నారా జయదేవికి, ఉత్తమ నూతన చిత్ర అవార్డును మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు నిర్మాత ఉమాదేవికి అందజేశారు. స్పెషల్ జ్యూరీ అవార్డులను సందీప్ కిషన్ (వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్)కు, నటి శ్రీ దివ్య (మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు)కు అందజేశారు. ఉత్తమ సహాయకుడు కాశి విశ్వనాథ్‌కు, నటి రోహిణీకి, ఉత్తమ నూతన నటుడు అవార్డును రాజ్ తరుణ్‌కు, ఉత్తమ నూతన నటి అవార్డును ఇషాకు, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టు అవార్డును గాయని చిన్మయికి, ఉత్తమ కథా రచయిత అవార్డును జెకె భారవికి, ఉత్తమ మాటల రచయిత అవార్డును గణేష్ పాత్రోకు అందించారు. ఉత్తమ కథనం అవార్డును ఏలేటి చంద్రశేఖర్, ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డును అనూప్ రూబెల్స్ అందుకున్నారు. తరువాత 1000 చిత్రాలు పూర్తి చేసుకున్న హాస్యనటుడు అలీని సాఫల్య అవార్డుతో ఘనంగా సత్కరించారు. ప్రార్థనా గీతంతో ప్రారంభమై న ఈ కార్యక్రమంలో అశ్విని శాస్త్రి, రోహిణీ శాస్త్రిల పంచాంగ శ్రవణం ఎం.సుందరి ఉగాది విశిష్టత ప్రసంగం, లండన్‌కు చెందిన మేనకా బోర ప్యూజన్ నృత్యం ఆహుతులను అలరించాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ ముఖ్య నేత వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రజాసేవకు రాజకీయాలే అవసరం లేదని సేవాభావం గల ప్రతి వారు నాయకులేనన్నారు. కుటుంబాన్ని, సమాజాన్ని, దేశాన్ని, మాతృభూమిని, కన్నతల్లిని ఎప్పుడూ మరచిపోకూడదన్నారు. అలాగే తెలుగు భాషను భారతీయ సంస్కృతి, సంప్రదాయాన్ని గౌరవించాలన్నారు. ఇతర భాషలైన ఇంగ్లీష్ లాంటివి నేర్చుకోండి అయితే ఇంగ్లీష్ వాళ్లు కాకండి అంటూ హితవు పలికారు. వేషం, భాష వేరైనా మనమంతా భారతీయులమని మరచిపోరాదన్నారు. సినిమా వారు కూడా కళా సేవ చేస్తున్నారని అన్నమయ్య లాంటి అద్భు త చిత్రాల రూపకర్తలు చాలామంది ఉన్నారని పేర్కొన్నారు. అయితే ఇటీవల కొన్ని చిత్రాలు పెడదోవ పడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఉగాదంటే షడ్రచుల కలయిక అని జీవితంలో కష్టసుఖాలు, ఎత్తుపల్లాలు ఉంటాయన్నారు. వాటిని అధిగమించాలన్నారు. ప్రస్తుత రాజకీయం ఎలక్షన్స్, సెలక్షన్స్, కలెక్షన్స్ అయిపోయిందన్నారు. సంస్కృతి లేని సమాజం బట్టలు లేని మనిషి లాంటిదని పేర్కొన్నారు. ఈ ఉగాది అందరికీ నూతన అధ్యాయాన్ని ప్రవేశపెట్టాలని ఆకాంక్షిస్తున్నానని వెంకయ్యనాయుడు అన్నారు. కళాసుధ తెలుగు అసోసియేషన్ తరపున బేతిరెడ్డి శ్రీనివాస్ వెంకయ్యనాయుడును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వి ఎల్ ఇందిరాదత్, ప్రీతారెడ్డి, మువ్వా పద్మయ్య, పి.నారాయణ, కాట్రగడ్డ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గాయకుడు మనో వ్యాఖ్యాతగా వ్యవహరించారు.