Sachin Tendulkar Felicitates Women's U19 World Cup-Winning Cricket Team - Sakshi
Sakshi News home page

అండర్‌–19 ప్రపంచకప్‌ విజేతకు ఘనంగా సన్మానం  

Published Thu, Feb 2 2023 8:28 AM | Last Updated on Thu, Feb 2 2023 10:36 AM

Sachin Tendulkar-BCCI Felicitate U-19 Women T20 WC Winner-Team-Ahmedabad - Sakshi

ఐసీసీ తొలిసారి నిర్వహించిన అండర్‌–19 మహిళల టి20 ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. సౌతాఫ్రికా గడ్డపై చరిత్ర సృష్టించిన మన అమ్మాయిలను బీసీసీఐ గౌరవించుకుంది. బుధవారం టీమిండియా, న్యూజిలాండ్‌ మధ్య అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన మూడో టి20 అందుకు వేదికైంది.  

తొలి అండర్‌-19 టి20 వరల్డ్‌కప్‌ను సాధించిన టీమిండియా సభ్యులను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఘనంగా సన్మానించింది. న్యూజిలాండ్‌తో ఆఖరి టి20 పోరుకు ముందు జరిగిన ఈ వేడుకలో బోర్డు  ప్రకటించిన రూ. 5 కోట్ల నజరానాను భారత దిగ్గజం సచిన్‌ చేతుల మీదుగా అండర్‌–19 జట్టు కెప్టెన్‌ షఫాలీ వర్మ అందుకుంది. అమ్మాయిలు అద్భుతంగా రాణించారని కితాబిచ్చిన ‘మాస్టర్‌’... ఈ ఘనతతో మరెంతో మంది మహిళా క్రికెటర్ల కలలకు ఊపిరి పోశారని అన్నారు. 

చదవండి: ఒహో.. చివరికి పృథ్వీని ఇలా కూల్‌ చేశారా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement