
భారత మహిళా క్రికెటర్లు
సాక్షి, స్పోర్ట్స్: త్వరలో జరగనున్న పేటీఎం ముక్కోణపు టీ20 సిరీస్ కోసం భారత మహిళల జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్ మహిళల జట్ల మధ్య ఈ ట్రైసిరీస్ నిర్వహించనున్నారు. గాయం కారణంగా దూరమైన కీలక బౌలర్ జులన్ గోస్వామి ఈ సిరీస్‌కు అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా, వైఎస్ కెప్టెన్‌గా స్మృతీ మంధాన వ్యవహరించనున్నారు. ముంబై వేదికగా మార్చి 22 నుంచి 31 వరకూ ఈ సిరీస్ జరగనుంది.
భారత జట్టు వివరాలు:
హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతీ మంధాన (వైస్ కెప్టెన్), మిథాలీ రాజ్, వేదా కృష్ణమూర్తి, జెమియా రోడ్రిగస్, అనుజా పాటిల్, దీప్తి శర్మ, తనియా భట్ (వికెట్ కీపర్), పూనమ్ యాదవ్, ఏక్తా బిస్త్, జులన్ గోస్వామి, శిఖా పాండే, పూజా వస్త్రాకర్, రుమేలీ ధార్, మోనా మెష్రమ్.
Comments
Please login to add a commentAdd a comment