దక్షిణాఫ్రికా ఓపెనర్‌ విధ్వంసం.. భారత్‌ టార్గెట్‌ ఎంతంటే? | 1st Women's T20I: Tazmin Brits, Marizanne Kapp Fifties Power South Africa To 189/4 | Sakshi
Sakshi News home page

IND Vs SA: దక్షిణాఫ్రికా ఓపెనర్‌ విధ్వంసం.. భారత్‌ టార్గెట్‌ ఎంతంటే?

Published Fri, Jul 5 2024 8:55 PM | Last Updated on Sat, Jul 6 2024 10:26 AM

Tazmin Brits, Marizanne Kapp Fifties Power South Africa to 189/4

చెపాక్ స్టేడియం వేదిక‌గా భార‌త మ‌హిళ‌ల‌తో జ‌రుగుతున్న తొలి టీ20లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు అదరగొట్టారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. 

సౌతాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్‌ తజ్మిన్ బ్రిట్స్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. మొదట ఆచితూచి ఆడిన బ్రిట్స్‌.. మిడిల్‌ ఓవర్లలో తన విశ్వరూపం చూపించింది. 56 బంతులు ఎదుర్కొన్న బ్రిట్స్‌ 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 81 పరుగులు చేసింది.

ఆమెతో పాటు మారిజన్నే కాప్‌(57) హాఫ్‌ సెంచరీతో మెరిసింది. ఇక భారత బౌలర్లలో పుజావస్త్రాకర్‌, రాధా యాదవ్‌ తలా రెండు వికెట్లు సాధించారు. మిగితా భారత బౌలర్లంతా విఫలమయ్యారు. కాగా ఇంతకముందు జరిగిన వన్డే, టెస్టు సిరీస్‌లను భారత్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement