BCCI- Women Cricket Team Head Coach: దేశవాళీ దిగ్గజం, ముంబై జట్టు మాజీ కెప్టెన్ అమోల్ మజుందార్‌ను భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త హెడ్ కోచ్‌గా నియమించారు. కొన్ని నెలల క్రితం సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరంజపేలతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఈ పదవి కోసం పలువురిని ఇంటర్వ్యూ చేసింది.
తుదకు 48 ఏళ్ల అమోల్ మజుందార్‌కు ఈ బాధ్యతలు అప్పగించింది. కాగా అమోల్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 171 మ్యాచ్‌లు ఆడి 11,167 పరుగులు సాధించాడు. ఇందులో 30 సెంచరీలు, 60 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
అస్సాం, ఆంధ్ర జట్లకు కూడా ప్రాతినిధ్యం
ఇక రంజీ జట్టు టైటిల్ నెగ్గిన ముంబై జట్టులో కీలక సభ్యుడిగా వ్యవహరించిన అమోల్ తదనంతరం దేశవాళీ క్రికెట్‌లో అస్సాం, ఆంధ్ర జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించి 2014లో ఆటకు వీడ్కోలు పలికి కోచింగ్‌వైపు వచ్చాడు. ఐపీఎల్ జట్టు రాజస్తాన్ రాయల్స్‌కు మూడు సీజన్‌ల పాటు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించాడు.
చదవండి: WC 2023: క్రేజీ ఇన్నింగ్స్.. అతడు అద్భుతం.. ఆ ‘వంద’లో నాదీ సమాన పాత్ర: కమిన్స్
Comments
Please login to add a commentAdd a comment