మహిళలకూ మహదవకాశం | Fourth T20 with South Africa today | Sakshi
Sakshi News home page

మహిళలకూ మహదవకాశం

Published Wed, Feb 21 2018 1:40 AM | Last Updated on Wed, Feb 21 2018 2:00 AM

Fourth T20 with South Africa today - Sakshi

హర్మన్‌ప్రీత్‌

సెంచూరియన్‌: భారత మహిళల క్రికెట్‌ జట్టు ముంగిట అరుదైన ఘనత. దీనిని అందుకోవాలంటే మాత్రం బుధవారం దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరిగే నాలుగో టి20లో విజయం సాధించాలి. తద్వారా సఫారీ గడ్డపై వన్డే, టి20 సిరీస్‌లు చేజిక్కించుకున్న తొలి జట్టుగా రికార్డు సృష్టిస్తుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30కు ఈ మ్యాచ్‌ ప్రారంభమవుతుంది. అనంతరం ఇదే మైదానంలో పురుషుల జట్ల పోరాటం ఉంటుంది. యాదృచ్ఛికమే అయినా... గెలిస్తే రెండు భారత జట్లూ మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌లను సొంతం చేసుకుంటాయి.

ఐదు మ్యాచ్‌ల మహిళల సిరీస్‌లో ప్రస్తుతం హర్మన్‌ప్రీత్‌ సేన 2–1 ఆధిక్యంలో ఉంది. తొలి రెండు అలవోకగా గెలిచినా... మూడో మ్యాచ్‌లో అనవసర షాట్లతో మన జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. దీంతో ప్రత్యర్థికి పుంజుకొనే అవకాశం చిక్కింది. ఈసారి అలాంటి ఉదాసీనతకు తావివ్వకుండా సామర్థ్యం మేరకు ఆడితే తిరుగుండదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement