సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్ మహిళలతో జరిగిన ఐదో టీ20లో 21 పరుగుల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 5-0 తేడాతో భారత్ క్లీన్ స్వీప్ చేసింది.
ఆఖరి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 156 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టీమిండియా బ్యాటర్లలో హేమలత(37) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మంధాన(33),హర్‌ప్రీత్ కౌర్(30) పరుగులతో రాణించారు.
బంగ్లా బౌలర్లలో రబేయా ఖాన్, నహిదా అక్తర్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సుల్తానా ఒక్క వికెట్ సాధించింది. అనంతరం 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. నిర్ఱీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది.
భారత బౌలర్లలో రాధా యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఆశా రెండు వికట్లు సాధించింది. బంగ్లా బ్యాటర్లలో రితూ మోనీ(37) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది.
చదవండి: టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
Comments
Please login to add a commentAdd a comment