విరాట్ కోహ్లి మరోసారి సెంచరీ మిస్సయ్యాడు. సెంచరీ మిస్ చేసుకున్నప్పటికి సఫారీలతో జరుగుతున్న మూడో టెస్టులో 79 పరుగులతో ఆకట్టుకున్నాడు. భారత బ్యాట్స్‌మన్ వరుసగా విఫలమైన చోట కోహ్లి మాత్రం మంచి ఇన్నింగ్స్‌తో మెరిశాడు. సెంచరీ చేసి రెండేళ్లు కావొస్తుండడంతో ఈసారి ఇక సెంచరీ కచ్చితంగా కొడుతాడు అనుకున్న సమయంలో 79 పరుగుల వద్ద రబడ బౌలింగ్‌లో వెర్రియేన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో కోహ్లి ఒక రికార్డు అందుకున్నాడు.
రెండేళ్లుగా సెంచరీ లేని కోహ్లి అప్పటినుంచి ఆడిన టెస్టుల్లో చూసుకుంటే అత్యధిక స్కోరు 74గా ఉంది. 2020 జనవరిలో అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఈ స్కోరు చేశాడు. తాజాగా కేప్‌టౌన్ వేదికగా సఫారీలతో జరుగుతున్న మూడో టెస్టులో 79 పరుగులు చేసి అత్యధిక స్కోరు సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment