Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ తమ బ్యాటింగ్ విశ్వరూపాన్ని ప్రదర్శించింది. కేఎల్ రాహుల్ మినహా వచ్చిన బ్యాటర్లంతా బాదుడే లక్ష్యంగా పెట్టుకున్నారు. ముందు కైల్ మేయర్స్ 24 బంతుల్లోనే 54 పరుగులతో అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వగా.. దానిని స్టోయినిస్, బదోనిలు కంటిన్యూ చేశారు.
ముఖ్యంగా స్టోయినిస్ 40 బంతుల్లో 72 పరుగుల విధ్వంసకర ఆటతీరుతో అలరించాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. బదోని 43 పరుగులు చేసి ఔటైన తర్వాత వచ్చిన పూరన్ పూనకం వచ్చినట్లు చెలరేగిపోయాడు. 19 బంతుల్లో 45 పరుగులతో తన వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు.
Photo: IPL Twitter
ఈ దెబ్బకు లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోరు చేసింది. ఐపీఎల్ చరిత్రలో లక్నో సూపర్ జెయింట్స్‌ది రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇక మొదటి స్థానంలో ఆర్‌సీబీ 2013లో పుణే వారియర్స్‌పై 263 పరుగులు చేసింది. మళ్లీ మూడో స్థానంలో ఆర్‌సీబీనే ఉంది.
2016లో గుజరాత్ లయన్స్‌పై 248 పరుగులు, ఇక నాలుగో స్థానంలో సీఎస్‌కే 2010లో రాజస్తాన్‌పై 246 పరుగులు.. చివరిగా ఐదో స్థానంలో కేకేఆర్.. 2018లో పంజాబ్ కింగ్స్‌పై 245 పరుగులు చేసింది. ఇక లక్నోకు ఇదే ఐపీఎల్ అత్యధిక స్కోరు కావడం మరో విశేషం. ఇక్కడ మరో అంశంమేమిటంటే ఐపీఎల్‌లో ఆర్‌సీబీ రెండుసార్లు అత్యధిక స్కోర్లు ఫీట్ సాధించింది. అయితే 263 పరుగుల అత్యధిక స్కోరు చేసి తొలి స్థానంలో ఉన్న ఆర్‌సీబీ ఫీట్‌ను మాత్రం అందుకోవడంలో లక్నో విఫలమయింది.
ఇక లక్నో, పంజాబ్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 41 బౌండరీలు కౌంట్ అయ్యాయి. ఇందులో 27 ఫోర్లు, 14 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఒక మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఎక్కువ బౌండరీలు సాధించిన జట్టుగా లక్నో రెండో స్థానంలో ఉంది. తొలి స్థానంలో ఆర్‌సీబీ 42 బౌండరీలు(21 ఫోర్లు, 21 సిక్సర్లు) ఉంది.
263 is unbreakable, Only RCB can break this! 😎🔥#PlayBold #ನಮ್ಮRCB #IPL2023 #PBKSvLSG pic.twitter.com/MRTMqdmS8Z
— Royal Challengers Bangalore FC (@RCBxFC) April 28, 2023
Highest team total in IPL history:
— Lokesh Saini (@LokeshViraat18K) April 28, 2023
RCB - 263/5 Vs PWI.
LSG - 257/5 Vs PBKS*.
RCB - 248/3 Vs GL.
263 is unbreakable, Only RCB can break this! 😎🔥 pic.twitter.com/kYdVxY7CjA
Comments
Please login to add a commentAdd a comment