PBKS Vs LSG: Fans Says Thanks To KL Rahul Over His Early Out, Big Advantage For LSG Big Score - Sakshi
Sakshi News home page

#ThanksKLRahul: త్వరగా ఔటయ్యి జట్టుకు మేలు చేశావు

Published Fri, Apr 28 2023 9:14 PM | Last Updated on Sat, Apr 29 2023 12:10 PM

Fans Says Thanks-KL Rahul-Out-Early-BIg-Advantage For-LSG-Big-Score - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ కేఎల​ రాహుల్‌ బ్యాటింగ్‌ వైఫల్యం కొనసాగుతుంది. గుజరాత్‌తో జరిగిన గత మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ చేసినప్పటికి నెమ్మదిగా ఆడి లక్నో ఓటమికి కారణమయిన రాహుల్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.

అయితే పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో 12 పరుగులే చేసి ఔటైనప్పటికి రాహుల్‌ను విమర్శించడంతో పాటు కొంత మంది అభిమానులు మెచ్చుకోవడం ఆసక్తి కలిగించింది. వాస్తవానికి తొలి బంతికే కేఎల్‌ రాహుల్‌ వెనుదిరగాల్సింది. అయితే తైదే క్యాచ్‌ అందుకోవడంలో విఫలం కావడంతో రాహుల్‌ బతికిపోయాడు. అయితే ఆ తర్వాత కాసేపటికే రబాడ బౌలింగ్‌లో షారుక్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.


Photo: IPL Twitter

విమర్శించడం ఓకే.. మెచ్చుకోవడం ఏంటి?
కేఎల్‌ రాహుల్‌ను మెచ్చుకోవడం వెనుక ఒక కారణం ఉంది. అదేంటంటే.. అతను త్వరగా వెనుదిరిగాడు కాబట్టే లక్నో.. పంజాబ్‌తో మ్యాచ్‌లో భారీ స్కోరు చేసింది. కైల్‌ మేయర్స్‌ ఇచ్చిన అద్బుత ఆరంభాన్ని స్టోయినిస్‌, బదోని, నికోలస్‌ పూరన్‌లు కంటిన్యూ చేశారు. ఒకరిని మించి మరొకరు బ్యాటింగ్‌ చేసి ఐపీఎల్‌ చరిత్రలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తొలిసారి భారీ స్కోరు చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు.

ఒకవేళ కేఎల్‌ రాహుల్‌ ఔట్‌ కాకపోయినా.. మరో ఆరేడు, ఓవర్లు బ్యాటింగ్‌ చేసేవాడు. అతని జిడ్డు బ్యాటింగ్‌ కారణంగా స్టోయినిస్‌, పూరన్‌ల అద్భుత ప్రదర్శన మిస్సయ్యేవాళ్లం. అందుకే రాహుల్‌ త్వరగా ఔటయ్యి ఒక రకంగా జట్టుకు మేలు చేశాడని అభిమానులు సోషల్‌మీడియాలో ట్రోల్‌ చేయడం విశేషం.

చదవండి: ఏమా విధ్వంసం.. ఇలా ఆడితే డికాక్‌కు కష్టమే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement