ఎంత దురదృష్టవంతుడివయ్యా.. స్టొయినిస్‌! | Seven 50 Plus Scores For Marcus Stoinis But None Have Resulted in a Win for Australia | Sakshi
Sakshi News home page

ఎంత దురదృష్టవంతుడివయ్యా.. స్టొయినిస్‌!

Published Wed, Mar 6 2019 2:24 PM | Last Updated on Wed, Mar 6 2019 2:24 PM

Seven 50 Plus Scores For Marcus Stoinis But None Have Resulted in a Win for Australia - Sakshi

నాగ్‌పూర్‌ : ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మార్క్‌ స్టొయినిస్‌ అంత దురదృష్టవంతుడు క్రికెట్‌ ప్రపంచంలోనే ఎవరూ లేనట్టున్నారు. నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్‌ను ఓడించెంత పనిచేసిన ఈ ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ ట్రాక్‌ రికార్డును పరిశీలిస్తే అవాక్కయ్యే విషయం తెలిసింది. ఈ మ్యాచ్‌లో 52 పరుగులతో ఆఖరి ఓవర్‌ వరకు పోరాటం చేసిన స్టొయినిస్‌.. చివరకు విజయ్‌ శంకర్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగడంతో ఆసీస్‌ పోరాటం ముగిసింది. అయితే స్టొయినిస్‌ ఇప్పటి వరకు 26 వన్డేలు ఆడగా.. ఒక సెంచరీతో పాటు 6 అర్థసెంచరీలు సాధించాడు. అతను ఇప్పటి వరకు 50కి పైగా పరుగులు చేసిన ప్రతి మ్యాచ్‌ ఆసీస్‌ ఓడిపోవడం గమనార్హం. ఆఖరికి సెంచరీ చేసిన మ్యాచ్‌లో కూడా ఆసీస్‌ పరాజయం పాలైంది.

2017లో న్యూజిలాండ్‌పై స్టొయినిస్‌(146 నాటౌట్‌) అజేయ సెంచరీ చేయగా.. ఆసీస్‌ 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అదే ఏడాది కోల్‌కతా వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 62 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. ఆసీస్‌ 50 పరుగులతో పరాజయం పాలైంది. ఇక 2018లో స్టొయినీస్‌ 4 అర్ధసెంచరీలు సాధించగా.. ఏ ఒక్క మ్యాచ్‌ కూడా ఆసీస్‌ గెలవలేదు. ఇక తాజాగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లోను అర్థసెంచరీతో ఆఖరి వరకు పోరాడినా 8 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో ఎంతైనా స్టొయినిస్‌ దురదృష్టవంతుడేనని అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement