
Hardik Pandya Vs Marcus Stoinis.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా నేడు టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య వార్మప్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఇద్దరు ఆల్‌రౌండర్లకు కీలకం కానుంది. వారిలో ఒకరు టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అయితే.. మరొకరు ఆసీస్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో హార్దిక్ బౌలింగ్ చేయలేదు. ఇక బ్యాటింగ్‌లో చివరలో వచ్చిన అతను 10 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఆసీస్‌తో మ్యాచ్ హార్దిక్‌కు తన ఫిట్‌నెస్ నిరూపించుకునేందుకు మంచి అవకాశం.
చదవండి: T20 WC 2021: స్కాట్లాండ్ తరపున తొలి బ్యాటర్‌గా రికార్డు
మరోవైపు ఆసీస్ ఆల్‌రౌండర్ స్టోయినిస్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఫామ్‌లేమితో సతమతమవుతున్న అతను ఈ మ్యాచ్‌లో ఎలాగైనా మంచి ప్రదర్శన చేయాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది. జట్టుకు ఆరో బౌలర్‌గా స్టోయినిస్ సేవలు అవసరమని ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఇప్పటికే స్పష్టం చేశాడు. కాగా యూఏఈ గడ్డపై బ్యాటింగ్‌లో స్టోయినిస్, హార్దిక్‌లకు మంచి రికార్డు ఉంది. హార్దిక్ 19 మ్యాచ్‌ల్లో 356 పరుగులు చేయగా.. స్టోయినిస్ 19 మ్యాచ్‌ల్లో 370 పరుగులు సాధించాడు. ఇక బౌలింగ్‌లో స్టోయినిస్ 19 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీయగా.. హార్దిక్ మాత్రం యూఏఈ గడ్డపై ఒక్కమ్యాచ్‌లోనూ బౌలింగ్ చేయలేదు. ఇక నేటి వార్మప్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది.
చదవండి: IND vs AUS: నేడు ఆసీస్‌తో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్
Comments
Please login to add a commentAdd a comment