Australia All Rounder Marcus Stoinis Ruled Out Of WI T20I Series, Details Inside - Sakshi
Sakshi News home page

AUS vs WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌.. ఆస్ట్రేలియాకు బిగ్‌ షాక్‌!

Published Mon, Oct 3 2022 5:52 PM | Last Updated on Mon, Oct 3 2022 7:00 PM

Marcus Stoinis ruled out of West Indies T20I series - Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022కు ముందు ఆస్ట్రేలియా మరో కీలక పోరుకు సిద్దమైంది. స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా తలపడనుంది. అయితే ఈ సిరీస్‌కు గాయం కారణంగా ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ మార్కస్ స్టోయినిస్‌ దూరమయ్యాడు. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 శుక్రవారం గోల్డ్‌ కోస్ట్‌ వేదికగా జరగనుంది.

ఈ క్రమంలో అయితే స్టోయినిస్‌ మాత్రం గోల్డ్‌ కోస్ట్‌కు ఆస్ట్రేలియా జట్టుతో వెళ్లకుండా పెర్త్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది.  ఇక ఈ సిరీస్‌ అనంతరం ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది.  పెర్త్‌ వేదికగా ఆదివారం(ఆక్టోబర్‌ 9)న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది.

కాగా ఈ సిరీస్‌కు స్టోయినిస్‌ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.  మరోవైపు టీమిండియాతో టీ20 సిరీస్‌​కు దూరమైన ఆసీస్‌ స్టార్‌ డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌, మిచెల్‌ స్టార్క్‌.. విండీస్‌తో సిరీస్‌కు జట్టులోకి వచ్చారు. ఇక స్వదేశంలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఈ మెగా ఈవెంట్‌లో ఆసీస్‌ తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్‌22న న్యూజిలాండ్‌తో తలపడనుంది.

వెస్టిండీస్‌  సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్‌), సీన్ అబాట్, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, డేనియల్ సామ్స్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాత్త్ వేడ్ , డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.
చదవండి: రోహిత్‌, కోహ్లి, సూర్య కాదు.. వరల్డ్‌ టాప్‌-5 టీ20 ఆటగాళ్లు వీరే!

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement